మనిషి’లో’ చెత్త
క్రింది కవిత “మనిషి’లో’ చెత్త” నవ్య వీక్లీ లో 29-8-2018 న ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయండి. ————————————————————————————————————————— మనిషి స్పర్శించడం మానేశాడు కరచాలనాలు, ఆలింగనాలు, కంటి చూపులు చిరునవ్వుల చిత్తరువులు.. ఊహ.. ఏమి లేవిప్పుడు మనిషి స్పర్శేంద్రియాన్ని కోల్పోయాడు మనిషి ఘ్రాణించడం మానేసాడు మల్లెల మకరందాలు, మట్టి సువాసనలు పచ్చటి పొలాల పైరగాలుల పరిమళాలు ఆస్వాదన లేనే లేదిప్పుడు మనిషి ఘ్రాణేంద్రియాన్ని కోల్పోయాడు టీ.వీ. ముందో, ఐపాడ్, ఐఫోన్ లోని టచ్ స్క్రీన్ ని […]