4. రోహిణి కథా దర్పణం – 4

“#storyreview” #మొక్కు” నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీ పీఠం వారి కథల పోటీలో 10 వేలు రూపాయల బహుమతి పొందిన కథ Balaramaswamy Boddeda రాశారు. ఆ కథ పైన నేను రాసిన విమర్శ ఈనాటి విమల సాహితీ పత్రిక లో (13-9-2026) చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. కథా విమర్శను మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా కథ గురించి మరికొంత మంది కి సమాచారం అందుతుంది. వ్యక్తిగత కక్షల నుంచి దేవుడిని ప్రశ్నించే దాకా

4. రోహిణి కథా దర్పణం – 4 Read More »

3. రోహిణి కథా దర్పణం – 3

ఈనాటి (30-8-2026) విమల సాహితీ పత్రిక లో ప్రముఖ సాహితీవేత్తలు శ్రీ పాపినేని శివశంకర్ గారు రాసిన “శిశిర వసంతాలు” కథ గురించి నేను రాసిన విమర్శ చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి కథ: శిశిర వసంతాలు రచయిత : శ్రీ పాపినేని శివశంకర్ ” స్త్రీ , పురుషుల మధ్య అనుబంధం అంటే ఎప్పుడూ దగ్గరగా ఉండటమేనా? దానికి శరీరమే సరిహద్దా?” ఆధునిక, వర్తమాన కాలంలో ఎవరికి వారు సూటిగా వేసుకోవలసిన ఈ ప్రశ్నలు

3. రోహిణి కథా దర్పణం – 3 Read More »

బువ్వ గింజల మోపు..

ఈనాటి ఆంధ్రజ్యోతి పత్రిక సాహితీ పేజీ వివిధ లో నా కవిత “బువ్వ గింజల మోపు” ప్రచురితం అయింది. చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. వివిధ సంపాదకులకు, మెహర్ గారికి ధన్యవాదాలతో.. గెనంగట్టు మీద నాయిన కొడవలి భుజానేసుకొస్తుంటే బువ్వకుండ నడిచొస్తా ఉన్నట్లనిపించేది .. గుంటబాయి నించి యాతంతో నీళ్ళు తోడిపోస్తుంటే తొలకర్లు చిలకరించే వానదేవుడిలా అవుపడేటోడు.. చెంగోవాలు కట్టి చాడేసిన కయ్యల్లో మెరుస్తూ తిరిగే పొద్దప్పతో పోటీపడి పరుగుతీసే నాయినను పలకరిస్తే పొద్దుతిరుగుడు పువ్వులా

బువ్వ గింజల మోపు.. Read More »

2. రోహిణి కథా దర్పణం – 2 కథ: ఆమె లేని వీధి

“ఆమె లేని వీధి”. ఈ వారం విమల సాహితీ పత్రిక లో “ప్రసేన్ “ గారు రాసిన కథ గురించి నా విశ్లేషణ కథా దర్పణం శీర్షిక లో చదవండి రోహిణి కథా దర్పణం – 2 కథ: ఆమె లేని వీధి ***************************************************** రచన : ప్రసేన్ “మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని కోల్పోయామని తెలుసుకోవడం ఒక దుఃఖం. కానీ ఆ మనిషి బతికున్నప్పుడు ఆ మనిషి హృదయంలోకి చూడలేకపోయామని ఆలస్యంగా తెలుసుకోవడం ఇంకా

2. రోహిణి కథా దర్పణం – 2 కథ: ఆమె లేని వీధి Read More »

ఆధిపత్య వర్ణాన్ని తుడిచిపెట్టిన “దిగులు వర్ణం” పుస్తక సమీక్ష!

“దిగులు వర్ణం” లో నాకే తెలియని దిగుళ్ళను , వర్ణాలను వెలికి తీసి నాకు కన్నీళ్ళను తెప్పించిన సమీక్ష ఇది. ఈ వారం విమల సాహితీ పత్రిక లో ప్రచురితమైంది. Neelam SarveswaRao సర్వేశ్వరరావు నీలం గారికి జీవిత కాలపు కృతజ్ఞతలు తప్పకుండా చదవండి. Vidyadhar Jeldi గారికి ధన్యవాదాలతో కవిత్వం అనేది కేవలం కొన్ని పదాల కలయిక కాదు; అది ఒక సామాజిక ఆక్రందన మరియు భావోద్వేగాల సముద్రం. ఒక కవిత కవి చేతి నుండి

ఆధిపత్య వర్ణాన్ని తుడిచిపెట్టిన “దిగులు వర్ణం” పుస్తక సమీక్ష! Read More »

అమ్మ చెప్పింది

ఈనాటి విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధం లో నేను రాసిన కథ “అమ్మ చెప్పింది” చదవండి. మీ ఇంట్లో ఉన్న చిన్నారులకు చదివి వినిపించండి. కథ భావాన్ని వివరించి చెప్పండి. మీ మిత్రుల బిడ్డల కోసం కథని షేర్ చేయండి సాయంత్రం ఇంటి గంట కొట్టగానే చాల మంది పిల్లలు ఇళ్ళకు వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లలు మాత్రం బడి చుట్టూ ఉంటే జాగాలో ఆడుకుంటున్నారు. బడి ముందర ఉండే జామచెట్టు కింద కూర్చుని, వాళ్ళ అమ్మ వస్తుందని

అమ్మ చెప్పింది Read More »

1. రోహిణి కథా దర్పణం – 1 – “కమండల గంగ”

“కమండల గంగ” కథా విమర్శ. ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ పత్రికలో. తప్పకుండా చదవండి. రోహిణి కథా దర్పణం – 1 ******************** కథ: కమండల గంగ ******************** రచన: చాగంటి ప్రసాద్ ********************* “న మృత్యుర్న శంకా న మే జాతి బేధ:పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్నమిత్రం గురుర్నైవ శిష్య ! చిదానందరూపం. శివోహం శివోహం !” “నాకు మరణం లేదు, భయం లేదు, జాతిభేదం లేదు.

1. రోహిణి కథా దర్పణం – 1 – “కమండల గంగ” Read More »

దుఃఖాన్ని తుడిచే దృశ్యాలు

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధం (1-8-2026). ఈ నాటి సంచికలో నా “దిగులు వర్ణం” కవిత్వ సంపుటి గురించి సమీక్ష ప్రచురితం అయింది. బుక్ కావలసిన వారు ఈ నంబర్ కి మెసేజ్ చేయండి. 9000594630.

దుఃఖాన్ని తుడిచే దృశ్యాలు Read More »

విమల సాహితీ ఇం[న్న]టర్ వ్యూ “కలం నా గళం”

ఈ నాటి “విమల సాహితీ” పత్రికలో నా పరిచయం. నా ఆలోచనలు చూడండి. డాక్టర్ విద్యాధర్ రావు జెల్ది గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. శ్రీమతి కల్యాణి తురిమెళ్ళ గారికి ప్రత్యేక దన్యవాదాలు పూర్తి పేరు : రోహిణి వంజారి జన్మతేదీ : 04-02-1971 జన్మ స్థలం : నెల్లూరు స్థిరనివాసం : హైదరాబాద్ తల్లిదండ్రులు: అరిశా ఆదిలక్ష్మి, అరిశా సత్యనారాయణ విద్యాభ్యాసం: B.Sc, B.Ed. వృత్తి : 20 సంవత్సరాలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని ఆరు

విమల సాహితీ ఇం[న్న]టర్ వ్యూ “కలం నా గళం” Read More »

సమాధానం లేని ప్రశ్న

ఈ పక్షం “సారంగా” పత్రికలో ప్రచురితం అయిన నా కథ “సమాధానం లేని ప్రశ్న” ఇక్కడ చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా కథ మరికొంత మందికి చేరుతుంది. భుజానికి హ్యాండ్బ్యాగ్, చేతిలో సూట్కేసుతో దిగాను. రైలు దిగే, ఎక్కే ప్రయాణికులతో స్టేషనంతా గోలగోలగా ఉంది. ఓసారి చుట్టూ పరికించి చూసాను. వస్తానన్నాడే ! ఏదైనా పని ఉండి రాలేదేమో. ఆలోచనల మధ్య ఉండగానే, “అమ్మా..యమునా” పిలుపుతో తల తిప్పాను.

సమాధానం లేని ప్రశ్న Read More »