Author: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

ఈనాటి నవ తెలంగాణ పత్రిక సోపతి “నెమలీక” శీర్షికలో నేను రాసిన బాలల కథ “బిడ్డ నేర్పిన పాఠం” ప్రచురితం అయింది. నవ తెలంగాణ సంపాదక వర్గానికి నా ధన్యవాదాలు. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹 సాయిలు ఐదో తరగతి చదువుతుండె. చాల తెలివిగలవాడు. సాయంత్రం బండి నించి అచ్చినంక అర్ధ గంట దోస్తులతో ఆడుకొని, ఇంటికచ్చి ముఖం కడుక్కున్నాడు. అమ్మ ఇచ్చిన సర్వపిండి నములుకుంటా సోషల్ బుక్ తీసి చదువుకుంటుండె. ఇంటి బయట గల్లీలో అంతా ఆగమాగంగా అరుపులు, పెద్దపెద్దగా కేకలు మైకులో నించి ఇనవడుతుండె. ఐదేళ్లకోపాలి వచ్చే ఎన్నికల రోజు దగ్గరవడింది. రెండు, మూడు పార్టీల వాళ్ళు జండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ అస్తున్నట్లుంది. ఇంటి ముంగడే కేకలు. ఆ అరుపులకు సాయిలు చదవలేకపోయిండు.ఇంతలోనే ఓ పార్టీ నాయకుడు, ఆయనతోటి కొంతమంది పార్టీ కార్యకర్తలు ఇంట్లోకి అచ్చారు. సాయిలు నాయన నర్సింగు వాళ్ళను చూసి…

Read More

“పులిరాజ” గుర్తు ఉన్నాడా మీకు? మర్చిపోయి ఉంటే ఓ సారి ఈ సంపాదకీయం చదివి గుర్తు తెచ్చుకోండి మిత్రాస్. ఆరోగ్యమే సకల భాగ్యాల సమ్మేళనం అని తెలుసుకుని అందరం ఆనందంగా జీవితం గడపాలని కోరుకుంటూఈ రోజు “విమల సాహితీ పత్రిక” ఎడిటోరియల్ వ్యాసం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి డిసెంబర్ మాసం ఇష్టసఖి లాంటిది. చిరుజల్లులు ఒకపక్క, పిల్ల తెమ్మెరలు మరోపక్క, లేత నీరెండ ఇంకోపక్క ఒంటిని తాకుతుంటే ఎంత మానసికోల్లాసం. చామంతులు, ముద్ద బంతులు, రంగురంగుల డిసెంబర్ పూలు నయనానందకరంగా ఎన్నెన్నో చిలిపి ఊసులు హృదిని తాకే వేళ. మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్షన్స్ పోలింగ్ రోజు రానేవచ్చింది. పోలింగ్ కూడా పూర్తి అయిపోయింది. చూపుడు వెలికి సింగారంలా మారిన ఇంకు చుక్కను ఫొటోతీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ‘నా బాధ్యత తీర్చుకున్నాను” అంటూ ఓ పనైపోయిందని సంతోషపడడం కూడా అయిపోయింది. ఫలితాలు ఇదిగో, ఈ…

Read More

“విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో ఈరోజు నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి  “నాయకులకు నువ్విప్పుడు దేవుడివినీ కోసం చేస్తారు ఎన్నెన్నో ఊడిగాలునీ చుట్టూ చేస్తారు ప్రదక్షిణాలువీలైతే నిన్నెత్తుకుని ఊరేగిస్తారుమాయలో పడ్డావో నీకుండదు భవితచూపుడు వేలే ఇప్పుడు నీ వజ్రాయుధంఅనర్హులకు వేసే ఓటుఅది చేస్తుంది నీకు చేటువిజ్ఞతతో నీవు వేసే ఓటుఅది వేస్తుంది నీ ప్రగతికి పై మెట్టు” నవంబర్ మాసంలో చిరుచిరు చలిగాలులు. అయినా అటు నాయకులు, ఇటు ప్రజల మనసుల్లో మాత్రం వేడి సెగలు. క్రికెట్ ఫీవర్ చల్లబడి పోయింది. ఇప్పుడు సరికొత్త ఫీవర్. ఎన్నికల ఫీవర్. నాయకుల కంటికి కునుకు రానీయకుండా చేసే భయం.. ఎలక్షన్లలో గెలిచి అధికారం పొందాలని అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులకు వెన్నులో ఒణుకు పుట్టించే సామాన్యుని ఓటు. ఎన్నిక అనేది ఒక అధికారిక సమూహ నిర్ణయ ప్రక్రియ. ఎన్నుకోవడం అంటే ” నాయకులను ఎంచుకోవడం…

Read More

సాయంత్రం కాఫీలు తాగటం అయిందా మిత్రాస్. పొద్దున్నుంచి ఆఫీస్ పనుల్లో అలసట చెంది గూటికి చేరుకుంటున్నారా. కాలచక్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తిప్పి, బుజ్జమ్మ అనే అమ్మాయి నెల్లూరు ట్రంకు రోడ్డు సెంటర్లో ఉన్న న్యూ టాకీసు ( కొత్త హాలు) సినిమా హాల్లో టికెట్ల క్యూలో మిమ్మల్ని ఇప్పుడు నిలబెడుతుంది.💐💐”చిరంజీవే నా మొగుడు” కథ ఎలాంటి సందేశాలు ఇవ్వదు. హాయిగా నవ్వించి, నెల్లూరు వీధుల్లో మిమ్మల్ని కాసేపు తిప్పుతుంది. “పాలపిట్ట” దీపావళి కథల ప్రత్యేక సంచిక -2023 లో ప్రచురితమైన నా కథ “చిరంజీవే నా మొగుడు” చదవండి. 🌹🌹 అభినందనలు, congratulations అని కామెంట్స్ వద్దు. కథని చదివి మీ అభిప్రాయం తెలుపండి. మీ చిన్ననాటి ఫాంటసీ మొగుడు/పెళ్ళాం గురించి సరదాగా చెప్పండి❤️🌹శ్రీ గుడిపాటి వెంకట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో🙏🌹 ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఇంటికి అమ్మిడిగా ఉండే “విజయమహల్” సినిమా హాల్లో తొలి తూరి నేను, పక్కింటి…

Read More

సాయంత్రమైందని చంద్రకాంత చెంత చేరానుచెక్కిలి ఆనించి ఓ నవ్వు నవ్వానా.. సాయంత్రమైందని చంద్రకాంత చెంత చేరాను చెక్కిలి ఆనించి ఓ నవ్వు నవ్వానా.. మరింత పక్కున నవ్వాయి చంద్రకాంత పూలు రేపొద్దునకి వాడిపోతారు అంత నవ్వెందుకు అని ఉడుక్కున్న నాకు ఊసులెన్నో చెప్పాయవి.. అరపూటే మా జీవితం అయితే ఏంటంట మీలా కాదు మేము అంటూ గర్వంగా తలలూపాయి.. మీ మనుషులకే కదా బాధలు వేదనలు బంధాలు బంధనాలు వేతలు వేధింపులు.. విద్వేషపు కొట్లాటలు మోసపూరిత దుర్మార్గాలు తేనె పూసిన కత్తులు విషం నిండిన గొంతులు వందేళ్ళ బతుకు ఉన్నా అరక్షణమైనా తృప్తి లేని బతుకులు అందని వాటికోసం ఆరాటాలు, అంతే లేని కోరికల గుర్రాలు.. మాతో మీకు పోలికెక్కడ..? మా జీవితం అరపూటలోనే ముగిసిపోయినా మీ కళ్ళకు వర్ణశోభితాలు అద్ది మీ ఊపిరులకు ఆయువు పోసి రాత్రంత వెన్నెల్లో తడిసి చందమామతో మురిసి ఉదయానికి మా కర్తవ్యం ముగించి ఆనందంగా…

Read More

మిత్రులకు బాలల దినోత్సవ శుభాకాంక్షల . ఈవారం విమల సాహితీ పత్రిక సంపాదకీయం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి నవంబర్ అనగానే మనకి టక్కున గుర్తుకు వచ్చే పండుగలు రెండు. ఒకటి దీపావళి, ఇంకొకటి జాతీయ బాలల దినోత్సవం. అయితే పండుగల పరమార్ధం ఏమిటి? అసలు పండుగలు ఎందుకు జరుపుకోవాలి? ఒక పక్క నిరుపేదలు తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతుంటే, మరొక పక్క పండుగ పేరుతో పరమాన్నాలు తింటూ, విలాసాలకు డబ్బు దుబారా చేయడమేనా పండగ పరమార్ధం? గాజా యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోయిన పసికందుల ఆర్తనాదాలు, రోదనలు ఇంకా మనసున్న ప్రతిమనిషి హృదయాన్ని మెలిపెడుతూనే ఉన్నాయి. ఇంతలోనే బాలల దినోత్సవం వచ్చేసింది. నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నవంబర్ 20, 1954 న, “పువ్వుల టోకెన్ల” విక్రయం ద్వారా పిల్లలకోసం ఐక్యరాజ్యసమితి అప్పీల్ కోసం నిధులను సేకరించడానికి “ఇండియన్ కౌన్సిల్…

Read More

ఈ వారం విమల సాహితీ పత్రికలో “హితేన సహితం సాహిత్యం” లో ఇప్పుడు హితమెంత? సంపాదకీయ వ్యాసం చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹 కాలం బండరాయి కాదు. ఒకేచోట స్థిరంగా ఉండడానికి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లు కూడా కాదు. కాలచక్రం నిరంతర సంచారి. అలుపెరుగని బాటసారి. గమ్యం తెలియని తెరువరి. కాలంతో పాటు సమాజంలో మార్పులు కూడా సహజం. సర్వసామాన్యం. రెండు రాళ్ళను కొట్టి నిప్పును పుట్టించిన ఆదిమానవుడి నుంచి, ఆ మంటనే వాడి చర్యకు ప్రతిచర్యగా రాకెట్లను తయారుచేసి, కథల్లో చెప్పుకునే చందమామను స్వయంగా చేరుకునే ఆధునిక మానవుడి దాకా జరిగిన మానవ వికాసం, అంతులేని మేధోమధనం మనిషి సాధించిన ఘనవిజయం.వైజ్ఞానిక వికాసంతో పాటు, సామాజిక స్థితిగతుల్లో మార్పులకు సాహిత్యం చూపిన ప్రభావం కూడా తక్కువేమి కాదు. సాహిత్య వికాసాన్ని దశలవారీగా పరిశీలిస్తే ప్రాచీనయుగం నుంచి ఆధునిక యుగం దాకా అనేకానేక మార్పులు జరిగాయని మనకందరికీ తెలుసు…

Read More

ఈ రోజు ప్రజాశక్తి పత్రిక ఆదివారం అనుబంధం ‘స్నేహ’ లో నా బాలల కథ “మార్పు తెచ్చిన మాస్టారు” కథ ప్రచురితం అయింది. సంపాదకులకు ధన్యవాదాలతో..కథని చదివి, మీ అమూల్యమైన స్పందన తెలపాలని కోరుతూ.. తెలుగు పీరియడ్ సమయం అవగానే గంట కొట్టాడు అటెండరు యాదయ్య. వెంటనే ఐదవ తరగతిలోకి సైన్స్ మాస్టారు అనిల్ కుమార్ ప్రవేశించాడు. అతని చేతిలో ఉన్న పేపర్ల కట్ట వంక పిల్లలంతా ఆసక్తిగా చూడసాగారు. మొదటి యూనిట్ పరీక్షల జవాబు పత్రాలు అవి. పేపర్లు తమకి ఎప్పుడిస్తారా అని విద్యార్థులంతా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. తమకి ఎన్ని మార్కులు వచ్చాయో, ఒకవేళ తక్కువ వస్తే మాస్టారి చేత తిట్లు, దెబ్బలు తప్పవేమో అని టెన్షన్ పడుతున్నారు అందరూ. మాస్టారు కుర్చీలో కూర్చుని పేపర్ల కట్ట టేబుల్ మీద పెట్టి, వరుసగా పేర్లు పిలుస్తూ వాళ్ళకి వచ్చిన మార్కులు కూడా చదవసాగాడు. అరుణ్-20, అరవిందా- 16, అమర్నాధ్-…

Read More

“సిరులెన్ని ఉన్నా చిరునవ్వు ఏది ? ఈ వారం విమల సాహితి పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపండి. గేటెడ్ కమ్యూనిటీలో 3 బీకే ప్లాట్, విల్లా లాంటి పెద్ద భవంతి, పెద్ద ఉద్యోగాలు, లక్షల్లో బ్యాంకు బాలన్సు, తిరగడానికి ఖరీదైన కారు. అన్నీ ఉన్నా ముఖంలో చిరునవ్వు కరువు. సకల సౌకర్యాలు ఉన్నా, బంగారు పువ్వు వేసిన వెండి పళ్ళెంలో తినేది మాత్రం రాగి సంగటి ముద్ద, రెండంటే రెండు పుల్కాలు. లేదంటే కొర్రలు, సామల అన్నం. తీపి, ఉప్పు, పులుపు, కారం ఏ రుచి నాలుకకి తగలని చప్పిడి కూడు. ఎందుకంటే అప్పటికే వారి శరీరంలో చెక్కర ఫ్యాక్టరీ, కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీలు నిండి పోయి ఉంటాయి. వెనుకటి రోజుల్లో మన హాస్య నటులు రేలంగి ఒక మాట అనేవారట “రాళ్ళూ, రప్పలు తిని అరాయించుకునే రోజుల్లో తినడానికి అన్నం కూడా దొరకదు. కష్టపడి…

Read More

గణేష్ దిన పత్రికలో ఈ రోజు[29-10-2023] నేను రాసిన కవిత “యుద్ధమే ముద్దు” ప్రచురితమైంది. మిత్రులు చదివి మీ స్పందనను తెలుపండి. యుద్ధం అనివార్యంపోరాటం జరగాల్సిందేశత్రువుని తుదముట్టించాల్సిందేబాంబర్ల మోతతో చెవులు తూట్లు పడుతున్నాయుద్ధ ట్యాంకుల శబ్దం గుండెల్లో వణుకుపుట్టిస్తున్నాయుద్ధమే ముద్దు మాకు అంటావా?తెగిన తలలనుంచి ఏరులై పారుతున్న నెత్తురుతల్లి శవం మీద పడి తల్లడిల్లుతున్న శిశువుకూలిపోయిన ఇళ్ళు పొగ చూరిన గోడలుశిధిలాల మధ్యనుంచి వినిపించే ఆర్తనాదంఏవి కదిలించలేవు నిన్నుయుద్ధమే కావాలి నీకుయుద్ధ విజేతల సమాధులు చెప్పే కథలు వినుఎన్నిఉసురులు నువ్వు తీసినాఎంత గొప్ప వీరుడివి అయినానీకు మిగిలేది శూన్యమే బూడిదేఅశోకుడు ఔరంగజేబుకే తప్పలేదుకాలగతిలో కలిసిపోవడంఇక్కడ ఎవరు శాశ్వతం అనుకుంటున్నావుఈ రోజు వాడు, రేపు వీడు, అటు తర్వాత నువ్వుఏదో రోజు కాలం చేతిలో ఓడిపోకతప్పదుఅందుకే యుద్ధం చేయిపోరాటం జరుపుశత్రువు వణికిపోయేలా తరిమికొట్టుకానీ ఆ శత్రువు ఎక్కడున్నాడో గుర్తించునీలోకి నువ్వు వెళ్లునిన్ను నీలోని మనిషిని చేరుకోవడానికినీలోని మానవత్వాన్ని బతికించడానికినీలోని శత్రువులను నువ్వు వెతికి…

Read More