ఈవారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నేను వ్రాసిన “భరత్ అనే నేను”, సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. చెడుపైన విజయం, రజో, తమో గుణాలతో యుద్ధముచేసి సత్వగుణ సంపన్నులై జీవితాన్ని తీర్చి దిద్దుకోమని చెప్తూ వచ్చిన నవరాత్రుల దసరా పండుగ ఎన్నెన్నో సందేశాల తాయిలాలను ఇచ్చి, మళ్ళీ ఏడాది తర్వాతే కనిపిస్తాను అంటూ మొన్ననే వెళ్ళిపోయింది. మరోపక్క గాజా గడ్డమీద యుద్ధ కాండ, అమాయక పౌరులపై దమనకాండ, మతపిశాచాల మారణకాండ కొనసాగుతూనే ఉంది. నెత్తుటి మరకలు ఇంకా పచ్చి వాసనకొడుతూనే ఉన్నాయి. పసి పాపల బుగ్గలమీద కన్నీటి చారికలు, గూడు చెదిరిపోయి, ఆకలి మంటలతో అన్నార్తుల పేగులు పెట్టే ఆర్తనాదాలు ఇంకా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. మతం రక్కసి కోరలు చాచి మనిషితనాన్ని కబళిస్తూనే ఉంది. అంతం లేని దుర్మార్గం కొనసాగుతూనే ఉంది. ఇంకోపక్క ప్రపంచ కప్ ఫీవర్ మొదలై, ఎప్పుడూ టీవీలో సీరియల్స్ కూడా…
Author: వంజారి రోహిణి
“ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం” ఈ వారం విమల సాహితీ పత్రికలో నేను రాసిన ఎడిటోరియల్ వ్యాసం. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపండి. మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలతో.. ‘గెలిస్తే ఏమొస్తుంది? మహా అయితే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. అదే ఓసారి ఓడిపోయి చూడు ప్రపంచం మొత్తాన్ని నువ్వు చూడవచ్చు. ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో నువ్వు తెలుసుకోవచ్చు’ అంటాడు మైఖేల్ మొనేట్ అనే ఓ మనోవైజ్ఞానిక నిపుణుడు. విజయం -అపజయం, గెలుపు – ఓటమి..! ఎంత వైరుధ్యభావనలు రెండు. ఎప్పటికీ ఒక దానిని ఒకటి కలుసుకోలేని సమాంతర రైలు పట్టాల్లాంటివి. విజయం మనిషిని ఆనంద శిఖరాలకు చేరిస్తే, ఓటమి పాతాళంలోకి నెట్టివేస్తుంది. అయితే ఈ విజయం వల్ల వచ్చే ఆనందం చాల గొప్పగా ఉంటుంది కానీ, ఆ ఆనందం తాత్కాలికమైంది. పొగడ్తలు, ప్రశంసల జల్లుల సందడి తగ్గగానే విజయం తాలూకు జ్ఞాపకాలు క్రమంగా మరుగున పడతాయి. కానీ అపజయం మాత్రం…
సామ్రాట్ అశోకుడు ధర్మ ప్రభువు ఎప్పుడు అయినాడు? ప్రపంచ చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన ధర్మచక్రాన్ని ఎప్పుడు నిర్మించాడు? తనని నమ్ముకున్న ప్రజలకు సుభిక్షమైన సలక్షణమైన పాలనను ఎప్పుడు అందించాడు? ఒక్కసారి చరిత్రపుటల్లో తిప్పి చూస్తే 261 బి.సి. కాలంలో ఇప్పటి భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రము అప్పటి కళింగ ప్రాంతం. సకల కళా నైపుణ్యాలతో, విశాలమైన సంస్కృతి, ఆర్ధిక వనరులతో అలరారే “ఉత్కళ” ప్రాంతాన్నిఅశోకుని ముత్తాత చంద్ర గుప్త మౌర్యుడు దాడి చేసి ఆక్రమించడానికి విఫల ప్రయత్నం చేసాడు. తాత సాధించని విజయాన్ని తానైనా అందుకోవటానికి తపించిన అశోకుడు ఆహారహం ఆరాటపడ్డాడు. అందుకే ఆ తర్వాతి కాలంలో అశోకుడు, కొత్తగా స్వాతంత్రం పొందిన కళింగ రాజ్యం మీదకు దండెత్తాడు. సింహాసనం కోసం జరిగిన రక్తసిక్తమైన యుద్ధంలో అశోకుడు విజయం సాధించాడు. ఈ యుద్ధంలో కొన్ని వేలమంది అమాయకులైన స్త్రీ, పురుషులు మరణించారు అన్నది మాత్రం చరిత్ర చెప్పిన సత్యం.అయితే ఇక్కడ అతను…
వందే భారత్ రైళ్ళు ఎవరికోసమండీ..? ఈ రోజు విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి. “బండీర పొగ బండీర.. దొరలెల్లే రైలు బండీర.. దొరసానులెల్లే బండీర” మనదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ తెల్ల దొరలు, దొరసానులు పొగ రైలు బండ్లలో తిరుగుతుంటే, వారి భోగాన్ని చూసి మన దేశ జానపదులు పాడుకున్న పాట ఇది. వయో వృద్ధులైన కొంతమందికైనా ఈ పాట గుర్తుండే ఉంటుంది. దేశానికీ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయాయి. తెల్లదొరలు మన దేశానికి వ్యాపారం పేరుతో వచ్చి, దురాక్రమణ చేసి కూడా చాల ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడు బ్రిటిష్ వారి వ్యాపార సౌలభ్యం కోసం మనదేశంలో కొన్ని చోట్ల రైలు మార్గాలను నిర్మించారు. అప్పట్లో తెల్ల దొరలకు, దొరసానులకు మాత్రమే రైళ్లల్లో ప్రయాణించే వెసులుబాటు ఉండేది. సామాన్య జనాలకు రైలు అంటే ఓ అద్భుతమైన వాహనం. జీవితంలో ఒక్కసారైనా…
మేధావులారా ..మేల్కొనండి. ఈ వారం విమల సాహితి పత్రికలో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి. మనసు లేని మనుషులు పుట్టుకొస్తున్నారు. కళ్ళు చెమ్మగిల్లడం మానేశాయి. కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. సాధించిన విజ్ఞానాన్ని నెత్తికెత్తుకుని భవిష్యత్ వైపుకు పరుగులు తీస్తూ మన సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న ఓ మహా మేధావుల్లారా..! దయచేసి మీ బిడ్డలకైనా జీవితపు విలువల గురించి కాస్త నేర్పించండి. అన్ని దేశాల సంస్కృతులు వేరు. మన దేశ సంస్కృతి వేరు. కన్న వారిని కావడిలో మోసిన శ్రావణ కుమారుడికి వారసులయ్యా మీరు.ఉడుకు నెత్తురు,ఉక్కు నరాలతో దేశాభివృద్ధిని పటిష్టం చేయమన్న వివేకానందుని తెగువను పుణికిపుచ్చుకున్న చైతన్యవంతులయ్యా మీరు. కులమతాల రక్కసిని కూకటివేళ్లతో పెగల్చడానికి, నిచ్చెన మెట్ల వ్యవస్థని కూలగొట్టి అందరూ సమానమని రాజ్యాంగాన్ని లిఖించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ అనుచరులయ్యా మీరు.భారతీయులను సొంత దేశంలో బానిసలుగా చేసి 38 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని 200 ఏళ్ళు పాలించారు…
Baby…..I Love You..Be Always Beautiful Yourself బయట ఎవరితోనో కాదు. నీతో నువ్వు గాఢంగా ప్రేమతో మునిగిపో.. ఈ వారం విమల సాహితీ సంపాదకీయం. చదవండి.మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఆహా..! ఎంత మధురంగా ఉన్నాయి ఈ మాటలు. నవ యవ్వనపు వీణల తంత్రులన్నీ ఒక్కసారిగా కోటి రాగాలను ఆలపించినట్లు. ప్రేమికుల మధ్య ఆ తొలివలపు మధురిమలు చూస్తుంటే మనసు, తనువూ పులకరించిపోదా..! ప్రేమను పొందని బతుకెందుకు? చరిత్రలో ప్రేమకు దాసోహం అవని ఏ రాజైనా ఉన్నాడా? చరిత్ర తిరగేస్తే ప్రేమ కోసం ఎన్ని యుద్దాలు జరిగాయో మనకు తెలియదా? ప్రేమ పవిత్రమైనదే. మరి ఎక్కడ వచ్చింది తేడా? ఈ మధ్యన వచ్చిన సినిమా “బేబీ” గురించి ఒకసారి ఇక్కడ ప్రస్తావించుకుంటే బస్తీలో నివాసం ఉంటున్న ఓ అమ్మాయి. హైస్కూల్ చదివే వయసే. ఆ బస్తీలోనే తిరిగే ఆటోవాలా ఆకర్షణలో పడింది. అది ప్రేమే అని మనసును ఇద్దరు మభ్యపెట్టుకుంటారు.ఆ…
అధునాతన ధర్మం ఏం చెబుతోంది? ఈవారం విమల సాహితీ సంపాదకీయం. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి “ధర్మో రక్షతి రక్షితః ” ఈ వాక్యానికి సూక్ష్మంగా “ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది” అనే అర్ధం ఉంది. ఎక్కడ ప్రజలు కలహాలు, కల్లోలాలు, విద్వేషాలు లేకుండా సంతోషంగా ఉంటారో, ఎక్కడ హింసకి తావు లేకుండా, త్యాగం, ప్రేమ, కరుణ రాజ్యమేలుతాయో అక్కడ ధర్మం నాలుగుపాదాల మీద నిలుస్తుంది అని పెద్దలు అన్నారు. మరి ఇప్పుడు ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తోందా? అసలు ధర్మం అంటే ఏమిటి? దీనికి సమాధానం మాత్రం కాస్త స్థూలంగా చెప్పాలి. “ఇతరులకు మనం మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది. చెడు చేస్తే పాపం కలుగుతుంది. ఇదే ధర్మ సూక్ష్మం” నిస్వార్ధంగా జీవిస్తూ తన శ్రేయస్సు కోసం కాకుండా అందరి అభ్యుదయం కోసం జీవించడమనేది అన్నిటికన్నా ఉత్తమ ధర్మం. నిస్సహాయులకు, వృద్దులకు నీవు చేసే సేవ,…
అక్కా, చెల్లి, తల్లి, కొడుకు..ఎవరైతే ఏం. మన సుఖానికి అడ్డువస్తే ఏసైడమే. అనుబంధమా..తొక్క..ఇలా మారుతున్న మానవ సంబంధాలు. దిగజారిన నైతిక విలువలు. విమల సాహితి పత్రికలో నేను రాసిన ఎడిటోరియల్ ఆర్టికల్ చదవండి. సాధారణ పరిభాషలో కుటుంబం అంటే అమ్మ,నాన్న,అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అవ్వ, తాత, అత్తలు, మామలు, పిన్నమ్మలు, పెద్దనాన్నలు. వీరు కాకుండా స్నేహితులు, ఇరుగు,పొరుగు. ఒక్క కుటుంబంలోనే సామాజిక బంధాలన్నీ ప్రతిఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు చెదిరిపోకుండా కాపాడే దృఢమైన పునాదులు ప్రేమ, అనురాగాలు. పెద్దలను గౌరవించుకోవడానికి ఫాథర్స్ డే అని, మదర్స్ డే అని జరుపుకుంటూ, కనీసం సంవత్సరానికి ఒకసారైనా కుటుంబ సభ్యులు అందరు కలుసుకుని ఆప్యాయతలను కలబోసుకోవడం మనం గతంలో చూసాం. సోదర,సోదరీమణుల అనురాగానికి ప్రతీకగా ఈ మధ్యనే రాఖీ పౌర్ణిమ పండుగ వచ్చింది. వెళ్ళింది. ఇప్పుడు ఈ దశాబ్దంలో మానవ సంబంధాలన్నీ పలుచబడి, చివరకు మాయమై పోయి, మనిషి నెత్తి మీదకి…
స్త్రీ ల ఆహార్యం గురించి Facebook వాల్స్ దగ్గర అనుచిత కామెంట్స్ చేసే మేక వన్నె కాదు కాదు నీతివన్నె కాముకుల పట్ల నిరసన, జుగుప్సలతో రాసిన కవిత ఇది. ఈ నెల సాహిత్య ప్రస్థానం లో.. మేము పంజరాలు బద్దలుకొట్టిబయటపడి చాల కాలమైందిమళ్ళీ కొత్తగా నీ ఆదిపత్యం ఏందిదేవత మహా ఇల్లాలు మహా పతివ్రతాబిరుదులిచ్చి వేసిన సంకెళ్లు చాలు ఇకమా నవ్వులమీద మా తిండి మీదమా బతుకులమీద నీ మనువు ముసుగుఎంతకాలం వేసుకోమంటావుపొడుగు పొట్టి లావు సన్నం తెలుపు నలుపుమా ఒంటి కొలతల చుట్టూనీ నిఘా ఎందుకు అనుక్షణంమా గుండెలను చున్నీతో కప్పుకోమనడం కాదుఎన్ని ఒంపుసొంపులున్నాయనితొమ్మిది నెలల పసిదాన్ని కాటు వేస్తివినడుంమీద ఎన్ని మడతలున్నాయనిజేజమ్మను చెరపడితివిబీగామి పాలియాండ్రి చిన్నిల్లుఇవిచాలక ఎదురుపడిన స్త్రీనివెకిలి చూపులు చూసే నీ మకిలి బుద్ధికిజ్ఞానపు అద్దాలు తొడుక్కో ఇకనువ్వు దొరవి కాదు నేను బానిసని కాదునీ ఆధిపత్యం సాగదిక్కడశ్రామిక తల్లి కొంగుని నడుముకి బిగిస్తుందిరెజ్లర్ చెల్లి…
ఈ వారం విమల సాహితీ సంపాదకీయం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో..వెలుగులీనుతున్న జీవన దీపాలు “మాతృదేవోభవ -పితృదేవోభవ -ఆచార్యదేవోభవ ” అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి, గురువు, దైవం అని వరుసక్రమం కూడా చెప్పారు. అంటే తల్లి,తండ్రి తర్వాతి స్థానం గురువుకి ఇచ్చి, ఆ తర్వాతే దైవం అన్నారు. అంటే గురువు దైవం కంటే గొప్పవాడనే కదా అర్ధం. మనిషి జీవితంలో ఎందుకు గురువుకి అంత ఉన్నత స్థానం ఇచ్చారు అంటే గురువు అనే గొప్ప పదానికి అర్ధం తెలుసుకోవాలి మనం.గురువు అనే పదంలో “గు” అంటే చీకటి. “రు” అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానము అనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు వచ్చింది. “గు” అంటే గుహ్యమైనది, తెలియనిది. “రు” అంటే దానిని రుచ్యము చేసేది. అంటే రహస్యమైనదానిని తెలియచేసేవారు “గురువు” అనే మరొక అర్ధం కూడా ఉంది. జ్ఞానం, ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు…