Home Authors Posts by వంజారి రోహిణి

వంజారి రోహిణి

105 POSTS 125 Comments
నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.
ఉగాది పండుగకు "సహరి" పత్రిక నాకు ఇచ్చిన కానుక. ఈ వారం"సహరి" ఆన్లైన్ పత్రికలో నా చిరు పరిచయం. సహరి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🌹 పేరు: వంజారి రోహిణిజన్మస్థలం: నెల్లూరు టౌన్చదువు: బి.ఎస్.సి., బి.ఎడ్.సైన్స్ టీచర్ గా ఇరవైఏళ్ల అనుభవంప్రస్తుత నివాసం: హైదరాబాద్కుటుంబంభర్త: వంజారి కృష్ణ మూర్తిటీవీ, సినిమా నటులుసంతానం:శ్రీనివాస చైతన్య,వైష్ణవి అమ్మ ఆదిలక్షమ్మ గృహిణి. మా నాన్నఅరిశా సత్యనారాయణ గారు నెల్లూరు సంతపేట బి.ఎడ్ కాలేజీ ఆఫీసులో పనిచేసేవారు. చాల సామాన్యమైన దిగువ మధ్యతరగతి కుటుంబం మాది. నాకు ఒక అక్క కామేశ్వరి, అన్న...

ఆధారం

మొక్క మట్టిలో బలంగా నాటుకోవడానికి పనికి వచ్చే తల్లివేరుని నరికేస్తే, ఇక ఆ మొక్క మనుగడసాగించి పెద్ద చెట్టు కాగలదా..? ఏమవుతుందో తెలియాలంటే ఈ వారం "సహరి" ఆన్లైన్ వారపత్రికలో ప్రచురితం అయిన "ఆధారం" కథ చదవాల్సిందే. మీ అమూల్యమైన అభిప్రాయము తెలుపాల్సిందే..🙏🙏🌹🌹 "సహరి" సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🙏🌹🌹 "సువిధా.. ! నిజంగా నువ్వు చాల గ్రేట్. కంగ్రాట్స్ " మీటింగ్ హాల్ నుంచి బయటకు వస్తూనే కరచాలనం చేసి చెప్పింది పల్లవి." థాంక్స్ " అంది సువిధ నిరాసక్తంగా . ఎదుటి వాళ్ళ మనసులో ఏం...
"సాహూ" మాసపత్రిక ఫిబ్రవరి సంచికలో నా "అందమే ఆనందం" లో అందమైన చేతుల కోసం చిట్కాలు మిత్రులకోసం.. "ఈ పాదం ఇలలోనే నాట్య వేదం" "నీ చరణం కమలం మృదులం,నీ పాదాలే రస వేదాలు". పాదాల గురించి, కాళ్ళ గురించి ఎన్నో మధురగీతాలు విన్నాం కదండీ. పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటేనే మనం పదుగురిలో హుందాగా నిలబడగలం. మరి మనల్ని నిటారుగా నిలబెట్టే పాదాల అందం, ఆరోగ్యం గురించి ఈ మాసం "సాహూ..అందమే ఆనందం" లో తెలుసుకుందాం. మనలో ప్రతిఒక్కరు ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యత పాదాలకు...
ఇప్పుడు నరసమ్మ నా కళ్ళముందు కనిపిస్తే గుండెలకు హత్తుకుని, పన్నీరు, నా కన్నీరు కలిపి ఆమె పాదాలను కడిగి నెత్తిన చల్లుకోవాలని ఉంది. ఎందుకో తెలియాలంటే ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితం అయిన నా "దొడ్డేత్తే నరసమ్మ" కథ చదవాల్సిందే. విజయమహల్ సెంటర్ కథలు విశాలాక్షి పత్రికలో ప్రచురిస్తూ గొప్ప ప్రోత్సహం ఇస్తున్న శ్రీ కోసూరు రత్నం గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి శిరస్సు వంచి వందనాలు. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పోయిన నెల నేను రాసిన "బాపనోల్ల పిల్ల-ముత్తరాశి యానాది పిలగాడు",...
"సృజన ప్రియ" మార్చి నెల మహిళా దినోత్సవ ప్రత్యేక సంచిక లో నేను రాసిన కవిత "నువ్వే నువ్వే". శ్రీ నీలం దయానంద రాజు గారికి, శ్రీ విల్సన్ రావు కొమ్మవారపు గారికి ప్రత్యేక ధన్యవాదాలతో..🙏🌹 నువ్వంటే నువ్వేనువ్వంటే స్వేచ్చే ఇక..పంజరాన్ని వీడి రెక్కలు చాపినింగికెగురుతున్న విహంగమే నువ్విక..నిన్ను నిలువరించే శక్తులకుయుక్తులన్నీ మిధ్యే ఇక..కొన్ని పువ్వులు నేలరాలిపోవచ్చుమరికొన్ని తారకలు నింగికెగియవచ్చు..నేల రాలిన పూలు నేర్పిన పాఠాలుఆత్మరక్షక కవచాలై దిశదిశలా వ్యాపిస్తాయి ఇక..నింగికెగిసిన తారకల మెరుపు సందేశాలుచిక్కబడ్డ చీకటిలోనైనా నిర్భయరాగాలైనీలో కోటిఆశల వెలుగులను నింపుతాయి ఇక..ఓర్పు,...

నువ్వు

"తెలుగు సొగసు" ఆన్లైన్ పత్రిక మహిళా దినోత్సవ ప్రత్యేక సంచిక లో ప్రచురితం అయిన నా కవిత "నువ్వు ". శ్రీ సుధామ గారికి, శ్రీ దాసరి చంద్రయ్య గారికి ధన్యవాదాలతో..🌹🌹🙏🙏 నువ్వునువ్వంటే నువ్వేనీలో ద్వంద్వార్ధాలు ఇక లేవువిధవనో, వేశ్యనో,పతితనోఇంతవరకు నిన్ను చూపినఆనవాళ్లను చెరిపేయాలి నువ్వుతాళిబొట్టో,హిజాబో ఏదైనా సరేనిన్ను బంధించే పంజరాలనుఇక బద్దలు కొట్టాలి నువ్వుఆత్మాభిమానం నీ ఆయుధంమనో నిబ్బరం నీ ఆత్మబలంఆత్మరక్షణ నీ ప్రాచీన హక్కునువ్వు చల్లగా దీవించే తల్లివిమమతలు పంచే చెల్లివిఅనురాగపు విత్తనాలు చల్లిప్రేమను పండించే నెలతవినీ మానప్రాణాలను హరించేదుష్టశక్తులను అంతమొందించేమృత్యుదాతవు...
శుభోదయం. "బహుళ" పత్రిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక సంచికలో నా కథ "పుత్తడి బొమ్మ". జ్వలిత మేడం గారికి ధన్యవాదాలతో. "పుత్తడి బొమ్మ" చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలపాలని కోరుతూ.. తలుపు చాటు నుంచి వారి మాటలు విన్న ఆమె ఏ నిర్ణయం తీసుకుంది..?ఆమె నిర్ణయానికి వారు తలవంచారా..?ఇంకా పూర్తిగా తెల్లవారనేలేదు. చిరుచీకట్లు తెరలు తెరలుగా విడివడుతూ ఉన్నాయి. పెరట్లో జామ చెట్టు మీద పక్షులు మాత్రం అప్పుడే ఉదయరాగాలు అలపిస్తున్నాయి తమ తమ విచిత్ర స్వరాలతో.బంతులు, చేమంతులు, రాత్రి విరబూసిన...

ఆభరణం

నమస్తే. తెలుగు సొగసు ఆన్లైన్ పత్రిక "ప్రేమికుల దినోత్సవ ప్రత్యేక సంచిక" లో నా కథ "ఆభరణం". మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపాలని.. ప్రార్ధన అయి పిల్లలంతా తరగతి గదిలోకి వచ్చేసారు. పిల్లలతో పాటే సులోచన టీచర్ కూడా తరగతిలోకి వచ్చారు. అది ఐదవ తరగతి. పిల్లలంతా లేచి నిలబడి టీచర్ కి నమస్కారాలు చెప్పి కూర్చున్నారు. "లావణ్య.. వచ్చి డస్టర్తో బోర్డు తుడువు" టీచర్ మాట పూర్తి...
శుభోదయం. ఈ రోజు నవతెలంగాణ దినపత్రిక దర్వాజా పేజీ లో నా కవిత "సూసైడ్ నోట్" మెల్లగా పాకుతోందదిదాని స్పర్శ ఒంటికి తగిలినప్పుడల్లాజుగుప్సాకర జలదరింపుఎదిగీ ఎదగని నా ఎదనుదాని ఇనుప చేతులు నొక్కినప్పుడల్లాచురకత్తితో నా గుండెను చీల్చుతున్నంత బాధదాని మదపు వేళ్ళునా తొడమీద పాకుతుంటేవారించలేని నా నిస్సహాయతనిచంపేయాలన్నంత కసి నాలోతరతరాలుగా మా ఒంటిమీద దాని మృగపు వేళ్ళుపాకుతూనే ఉన్నాయి కామపు కుళ్ళుతో..మదపురసి కారుతున్న దాని వికృతపు వేళ్ళనునరికే శక్తి నా బాల్యానికి లేదుఆత్మాభిమానం, అధైర్యంనా గొంతు నొక్కేశాయి మీకు చెప్పనీకుండాఅందుకే నన్ను నేను శిక్షించుకుంటున్నఉరి...
రేపు "వాలెంటైన్స్ డే" కదా. ప్రేమికుల దినోత్సవం. మరి ప్రేమంటే వలపా..?ఆకర్షణ..?ఒకరివెనుక ఒకరు తిరగడమా..? గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ, హోటల్స్, పార్కుల వెంట తిరగడమా..? ఆసిడ్ దాడా..? హత్యో, ఆత్మహత్యో చేసుకోవడమా..? ఏం చేస్తున్నారు ఇప్పటి ప్రేమికులు..? కానీ ప్రేమంటే కాలం ఎంత మారినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా అనుక్షణం నీ వెంటే నేను, నీ తోడుగా నేను, నీ నీడగా నేను, నీ సంతోషమే నేను కోరుకునేది అనే భరోసా జీవితాంతం కలిగించడం.మొత్తంగా ప్రేమంటే ఇవ్వడమే..దాదాపు 35 ఏళ్ళ...
నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.