రెండో బాల్యం
ఈనాటి సృజన క్రాంతి సాహితీ పేజీలో నా కవిత “రెండో బాల్యం” చదవండి. Wilson Rao Kommavarapu సర్ కి ధన్యవాదాలతో ఏటిగట్టున చింతచెట్టు కొమ్మకు ఊయల కట్టాను దిగంతాల అంచుల నడుమ అలిసిపోయేదాకా ఊగాను.. దిక్కుతోచని పిల్లపిట్టలా తోటంతా కలయదిరిగాను పూల పరిమళానికి మత్తిల్లిన గొల్లభామలా గడ్డిపరుపు పైన కాసేపు సోలిపోయాను.. సాయంత్రపు నీరెండకు నీడలు పొడుగవుతున్నాయి రేగిపోయిన జుట్టులో పిల్లగాలి గడ్డిపూలు తురుముతోంది నునులేత పారిజాత రేకులు నా ముఖాన్ని తడుముతూ దోబూచులాట మొదలుపెట్టాయి.. […]