Vanjari Rohini

నా పురిటి గడ్డ నెల్లూరు విజయ మహల్ సెంటర్. కానీ వారు వంజారి కృష్ణమూర్తి వృత్తిరీత్యా, హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాంతో నెల్లూరు నుండి మా మకాం మారింది .మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరూ ఇంజినీర్లు గా పని చేస్తున్నారు. నాకు కథలు అంటే చిన్నతనం నుంచి ఆసక్తి . బహుశ అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పిన కథల కాలం మరి రాకుమారుడు వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారని చెబితే రాకుమారుడు వేటకు వెళ్ళితే సింహాలను కదా వేటాడేది. చేపలు తేవడం ఏమిటి. చేపలు ఎండక పోవడం ఏంటి. గడ్డి మోపు అడ్డం వస్తే మాత్రం, ఇలాంటి ప్రశ్నలు చిన్నతనం నుంచి బుర్రలో కదలాడుతుండేవి. ఏ కథ విన్నా తర్కించడం వాస్తవం కాదే అని ఆలోచనలు ప్రారంభమయ్యాయి. కానీ డిగ్రీ చేరినప్పటి నుంచి నా ఆలోచనలు మారుతూ, ఒక గమనం వైపు నడిపించాయి. దానికి కారణం పద్మావతి గ్రంథాలయం . సాయంత్రాలు కాలేజీ అయినాక కే. వి. ఆర్. పెట్రోల్ బంకు దగ్గర బస్సు ఎక్కి గాంధీ బొమ్మ దగ్గర దిగి తిన్నగా ఇంటికి వెళ్లకుండా , ఇంటికి నడిచివెళ్లే దారిలో సండే మార్కెట్ దగ్గరున్న ఈ గ్రంథాలయంలో ప్రతి రోజు రెండు గంటలు చదువుకుని వెళ్లేదాన్ని అక్కడే చలం, రంగనాయకమ్మ మొదలు మల్లాది, ఎన్ ఆర్ నంది వరకు వార, మాస పత్రికలలోని కథలు వందల సంఖ్యలో చదివాను . అలా చదువుకునే రోజుల్లోనే రాసిన "ఆభాగ్యుడు " అనే నా తొలి కవిత ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. అప్పటి వారి కవితలు, వ్యాసాలు, భక్తి రచనలు, సమీక్షలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సైన్సు టీచరుగా గా వృత్తి, వివాహం, కుటుంబ భాద్యతలు, జీవన పయనంలో ఎదురైనా అనేకానేక సమస్యల వల్ల కొంత కాలం రచన వ్యాసంగం లో విరామం తీసుకున్నాను . అయినా ఉద్యోగ బాధ్యతల్లో సడలింపు , శ్రీవారు కృష్ణమూర్తి, పిల్లలు వాళ్ళ వృత్తి లో స్థిరపడడం జరిగాక, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాను. నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో ఇరవై కథలదాకా ప్రచురితం అయినాయి. ప్రచురణకు ఎన్నికైన కథలు ఇంకా కొన్ని ఉన్నాయి. నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను. కథలు జీవితంలో నుంచి రావాలని, ఊహా సంఘటనలు అభూత కల్పనలు, నేల విడిచిన సంఘటనలు తాత్కాలిక ఆనందమే కానీ పాఠకుల మనసులో కానీ , కదా సాహిత్యంలో కూడా చిరకాలం నిలబడలేవు. అందుకే వ్యక్తులను , కుటుంబాన్ని, జీవితాలను, సమాజాన్ని సంస్కరించాలనే కథా ప్రయోజనాన్ని ట్రంకు రోడ్డు గ్రంథాలయంలో గుర్తెరిగాను .పెద్దల సాహిత్యం నాకు ప్రేరణగా నిలిచి ఆ వైపు నడిపిస్తుంది. ప్రయోజనం లేని కథ నిరుపయోగమే అని నా అభిప్రాయం చెప్పగలను. అంటూ ఆమె ముగించారు.

సూపర్ టీచర్ సిండ్రోమ్

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “సూపర్ టీచర్ సిండ్రోమ్” ఆంధ్రజ్యోతి వారి “నవ్య” వీక్లీ లో 11-05-2020 తేదీన ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ——————————————————————————————————————————- సమయం ఉదయం తొమ్మిది గంటలు. అది హైదరాబాద్ యూసఫ్ గూడలోని ఓ ప్రైవేట్ స్కూల్. ప్రార్ధన సమయం కావడంతో పిల్లలందరూ వరుసగా బారులు తీరి నిలబడి ఉన్నారు. ఇక ప్రార్ధన మొదలవుతోందనగా స్కూల్ లోకి ప్రవేశించింది రాగిణి టీచర్. రాగిణి టీచర్ …

సూపర్ టీచర్ సిండ్రోమ్ Read More »

బుజ్జమ్మ పిల్లి

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “బుజ్జమ్మ పిల్లి” “సాహిత్య ప్రస్థానం” మాస పత్రికలో 2020 ఏప్రిల్ నెలలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————- సాయంత్రం నాలుగైంది. సురేంద్ర టీ బంకు దగ్గర సందడి మొదలైంది. తెల్ల చొక్కా, తెల్ల పంచె కట్టుకుని రామశేషయ్య చీరల బాకీ డబ్బులు దండుకునేదానికి అమ్మలక్కల ఇళ్లకు సైకిలు మీద బయలుదేరాడు. వాళ్ళ నాయన దగ్గరినుంచి వారసత్వంగా వచ్చిన పాత మోపేడు బండిని …

బుజ్జమ్మ పిల్లి Read More »

కంచె

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “కంచె” ఆంధ్ర జ్యోతి వారి “నవ్య” వీక్లీ లో 19-02-2020 తేదీన ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ———————————————————————————————————————- తొమ్మిదో తరగతి గదిలోకి ప్రవేశించిన రాగిణి టీచర్ వెళుతూనే తన చేతిలో ఉన్న చార్టుని తీసి బ్లాక్ బోర్డుకు పైన ఉన్న మేకుకు తగిలించింది. పిల్లలందరూ లేచి ఆమెకు విష్ చేసారు. చార్టు వంక ఆశ్చర్యంగా, ఒకింత వింతగా,మరికొంత సందేహంగా చూస్తున్న స్టూడెంట్స్ …

కంచె Read More »

అభిమతం

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “అభిమతం” నవ తెలంగాణ ఆదివారం అనుబంధం పుస్తకం “సోపతి” లో 12-04-2020 తేదీన ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ————————————————————————————————————- చరవాణి వసపిట్టలా మోగడంతో బద్దకంగా పక్కమీదనుంచే బల్లమీద ఉన్న చరవాణి ని అందుకుని ” హలో ” అన్నాడు రషీద్ మత్తుగా ఆవలిస్తూ. ” హలో రషీద్ భాయ్, మన సార్ వాళ్ళు సంగారెడ్డిలో ఉన్నారట” అన్నాడు డేవిడ్.  నిద్రమత్తు ఇంకా …

అభిమతం Read More »