Home Uncategorized

Uncategorized

ఏప్రిల్ నెల సంచిక వెబ్ పత్రికలో డాక్టర్ కె. ఎల్. వి. ప్రసాద్ గారు నాతో జరిపిన ఇంటర్వ్యూ. నా అంతరంగంలోకి ఓ సారి చూస్తారు కదూ..సంచిక పత్రిక సంపాదకులకు, డాక్టర్ కె. ఎల్. వి. ప్రసాద్ గార్లకు ధన్యవాదాలతో.. https://sanchika.com/interview-with-mrs-rohini-vanjari/?sfw=pass1680585285
యువ కథా రచయిత చరణ్ పరిమి Charan Parimi గారి "కేరాఫ్ బావర్చీ కథలు" సంపుటి కోసం రాసిన నా సమీక్ష.ఈ నెల "సాహిత్య ప్రస్థానం" లో. శ్రీ సత్యాజీ గారికి ధన్యవాదాలతో. చరణ్ పరిమి గారికి హృదయపూర్వక అభినందనలు. సమీక్ష చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపకోరుతూ 🌹🙏 మీరెప్పుడైనా ఇంట్లోకూర్చుని ఇరానీ హోటల్లో ఉండే మసాలా టీ రుచిని ఆస్వాదించారా..? సినిమా యాక్టర్, డైరెక్టర్ అయిపోదామని కలలుకంటూ మీ పక్కింటి కుర్రాడో, ఎదురింటి పోరి ఎవరో ఒకరు హైదరాబాద్ రైలు ఎక్కడం...
శ్రీ జల్ది విద్యాధర్ రావు గారి "అంతరంగపు భాష" కవనానికి నా చిరు సమీక్ష. ఈ నెల" విశాలాక్షి మాసపత్రికలో". శ్రీ జల్ది విద్యాధర్ రావు గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో..సమీక్ష చదివి మీ విలువైన అభిప్రాయాలను తెలుపగోరుతూ.. ప్రతి దేశానికీ ఓ ప్రత్యేక భాష ఉంటుంది. ప్రతి ప్రాంతానికి కూడా ఓ ప్రత్యేక భాష ఉంటుంది. ప్రకృతిలోని జీవకోటిలో ప్రతి జీవి తన స్పందనలను ఓ ప్రత్యేక రీతిలో తెలుపుతుంది. అలాగే మనుషులు కూడా తమ భావాలను మాటలరూపంలో తెలుపుతారు....
శ్రీమతి వంజారి రోహిణి గారు విరచిత "కర్పూర దీపం" కథా సంవిధానం - అద్భుతం, అభినందనీయం, అజరామరం - ఒక చిన్న సమీక్ష *************************************************మరుగు దొడ్లను చేత్తో శుభ్రం చేసే వారిపై (మాన్యువల్ స్కావంజర్స్) వచ్చిన కథలు తెలుగు సాహితీ జగత్తులో చాలా అరుదు. కానీ వారి దుర్భర పరిస్థితులపై వారి దయనీయ జీవన స్థితగతుల గురించి హృదయం ద్రవించేలా కళ్ళకు హత్తుకునేలా "కర్పూర దీపం" కథ ద్వారా "దొడ్డెత్తే నరసమ్మ" ప్రధాన పాత్ర ద్వారా చిత్రీకరించన శ్రీమతి రోహిణి గారు సర్వదా...
ప్రియమైన రచయితలు సాహితీ సంబరాల నడుమ ఆవిష్కరించిన "ప్రియ కవిత" సంకలనంలో చోటు చేసుకున్న నా కవిత ఇది. శ్రీ ఇందూ రమణ గారికి, శ్రీ రంగబాబు గారికి ధన్యవాదాలతో 🙏🙏. ఇప్పుడు మూగబోయిన అందరి నాలుకల మీద వసపాలు పోయాల్సిందే కదా. కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతారుకదా❤🌹🙏 ఉభయకుశలోపరిఎన్ని ఏళ్లయ్యిందంటావ్ ఉత్తరంలో ఈ మాట చూసిహలో అబ్బయ్య ! ఎట్లుండారుఎన్నాళ్ళయ్యిందంటావ్ ల్యాండ్ ఫోన్లో ఈ మాటవినిఇప్పుడు మాటలెందుకు అంటారా?నవ్వుకో ఎమోజి, లవ్వుకో ఎమోజి, ఏడుపుకో ఎమోజిసంతోషమైన, దుఃఖమైన ఒక్క ఎమోజితో సరినాలుగుగోడల...
ఉగాది పండుగకు "సహరి" పత్రిక నాకు ఇచ్చిన కానుక. ఈ వారం"సహరి" ఆన్లైన్ పత్రికలో నా చిరు పరిచయం. సహరి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🌹 పేరు: వంజారి రోహిణిజన్మస్థలం: నెల్లూరు టౌన్చదువు: బి.ఎస్.సి., బి.ఎడ్.సైన్స్ టీచర్ గా ఇరవైఏళ్ల అనుభవంప్రస్తుత నివాసం: హైదరాబాద్కుటుంబంభర్త: వంజారి కృష్ణ మూర్తిటీవీ, సినిమా నటులుసంతానం:శ్రీనివాస చైతన్య,వైష్ణవి అమ్మ ఆదిలక్షమ్మ గృహిణి. మా నాన్నఅరిశా సత్యనారాయణ గారు నెల్లూరు సంతపేట బి.ఎడ్ కాలేజీ ఆఫీసులో పనిచేసేవారు. చాల సామాన్యమైన దిగువ మధ్యతరగతి కుటుంబం మాది. నాకు ఒక అక్క కామేశ్వరి, అన్న...
కొందరు పైకి ఎంత నిజాయితీపరులుగా కనిపిస్తారు. వారి లోగుట్టు మాత్రం పెరుమాళ్ళకే తెలియాలి. నేను మెహిదీపట్నం నుంచి చిలుకూరు బాలాజి గుడికి బస్సు లో వెళుతున్నప్పుడు నా కళ్ళ ముందర జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా వ్రాసిన ఈ కథ "పెరుమాళ్ళకెరుక" ఈ నెల ధర్మశాస్త్రం మాసపత్రికలో ప్రచురితం అయింది. సంపాదకులకు ధన్యవాదాలతో.. ఈ చిన్న కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా.. ఆగిఆగడంతోనే జనాలు బస్సు ను చుట్టుముట్టారు. బస్సు దిగి " కాళీ మందిర్..బాలాజీ టెంపుల్.. కాళీ మందిర్..చిలుకూరు...

దమనం

మిత్రులకు నమస్తే. మనుషుల జీవితంలో, వారి పసితనంలో జరిగిన విషాద సంఘటనలు, లేదా ఇష్టం లేని విషయాలు మనసు పొరల్లో మారుమూలకు నెట్టివేయబడతాయి. వారు పెరిగే క్రమంలో తిరిగి అలాంటి సంఘటనలు లేదా అప్పటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే నేపథ్యంలో రాసిన ఈ కథ "దమనం" విశాలాక్షి మాసపత్రిక వారి సంక్రాతి కథల పోటీ విజేతల కథల సంపుటిలో ప్రచురితం అయింది. ఈ కథల పోటీని మా అమ్మ జ్ఞాపకార్ధం "అరిశా ఆదిలక్షమ్మ స్మారక కథల...
నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.