చంద్రకాంత చెలి
సాయంత్రమైందని చంద్రకాంత చెంత చేరానుచెక్కిలి ఆనించి ఓ నవ్వు నవ్వానా.. మరింత పక్కున నవ్వాయి చంద్రకాంత పూలురేపొద్దునకి వాడిపోతారు అంత నవ్వెందుకుఅని ఉడుక్కున్న నాకు ఊసులెన్నో చెప్పాయవి.. అరపూటే మా జీవితం అయితే ఏంటంటమీలా కాదు మేము అంటూ గర్వంగా తలలూపాయి.. మీ మనుషులకే కదా బాధలు వేదనలుబంధాలు బంధనాలు వేతలు వేధింపులు.. విద్వేషపు కొట్లాటలు మోసపూరిత దుర్మార్గాలుతేనె పూసిన కత్తులు విషం నిండిన గొంతులు వందేళ్ళ బతుకు ఉన్నా అరక్షణమైనాతృప్తి లేని బతుకులు అందని వాటికోసంఆరాటాలు, […]