విమల సాహితి ఎడిటోరియల్ 22 – చిన్నారి బాలల నవ్వుల పువ్వులు – నట్టింట మెరిసే దీపావళి వెలుగులు
మిత్రులకు బాలల దినోత్సవ శుభాకాంక్షల . ఈవారం విమల సాహితీ పత్రిక సంపాదకీయం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి నవంబర్ అనగానే మనకి టక్కున గుర్తుకు వచ్చే పండుగలు రెండు. ఒకటి దీపావళి, ఇంకొకటి జాతీయ బాలల దినోత్సవం. అయితే పండుగల పరమార్ధం ఏమిటి? అసలు పండుగలు ఎందుకు జరుపుకోవాలి? ఒక పక్క నిరుపేదలు తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతుంటే, మరొక పక్క పండుగ పేరుతో పరమాన్నాలు తింటూ, విలాసాలకు డబ్బు దుబారా