మా నాయన ఊరు
పొగడ దొరువు కండ్రిగనాయన పుట్టిన ఊరుమా నాయన పుట్టిన ఊరుచిన్నప్పుడు ఊపిరులూదిన గాలిపచ్చగా పలకరించే చేనుచెంత చేరి నిమరగానే కళ్ళనిండా ప్రేమనుకురిపించే లేగ దూడలు..గడ్డివాము ఎక్కి అన్నతో ఆడిన ఆటలుతంపటేసిన తేగలకోసం పడిన గొడవలులెక్క తెలియకుండా జుర్రుకున్న తాటిముంజలు..గడ్డిలో కాల్చిన తాటిపండు తీపి రుచిముంత దించగానే పాలేరును ఏమార్చినాలుకపై వేసుకున్న కల్లు చుక్కలు..కోతలైన చేలో పోటిపడి ఏరుకున్న పరిగెలుదోటీతో లాగి ఒడిలో దాచుకున్న సీమచింత గుబ్బలు..దిగుడు బావిలో జలకాలాటలుగున గున తిరిగే గిన్నె కోళ్ళ అరుపులుఈత పళ్ళు, […]