నవనీతం

ముందుగా “బహుళ” త్రైమాసిక పత్రిక సంపాదకులు, ప్రముఖ కవులు, కథా రచయిత్రి శ్రీమతి జ్వలిత Jwalitha Denchanala Jwalitha గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా స్త్రీ లు ఎదుర్కొంటున్న వివక్షలు, సమస్యలు, పరిష్కారాలు, సలహాలు, చిట్కాలు,మనసుని రంజింపజేసే కథలు, కవితలు, సమీక్షలు, వ్యాసాలు తదితరాలతో రూపొందించబడిన అపురూపమైన పత్రిక “బహుళ”. సంపాదకురాలిగా ఎన్నో వ్యయ ప్రయాసలు తట్టుకుని, మరెన్నో చిత్కారాలను ఓర్పు తో సహించి పత్రికను ఎంతో ఉన్నత స్థాయిలో నిలపటానికి జ్వలిత గారి పట్టుదల, శ్రమ […]

నవనీతం Read More »

బొట్టు

ద్వేషంతో చిమ్మే విషపుబొట్లు తప్ప ప్రతి బొట్టు మంచిదేగా. ఈ వారం “సహరి” వారపత్రికలో నా కవిత “బొట్టు”. సహరి సంపాదకులకు ధన్యవాదాలతో ఓ నెత్తుటి బొట్టుకోట్ల కణాలతో యుద్ధం చేసిగెలిచి నీకు జన్మనిస్తుంది ఓ వాన నీటి బొట్టుబీడు పడ్డ రైతన్న కళ్ళల్లోపన్నీటి జల్లు కురిపిస్తుంది ఓ తేనేటి బొట్టుశ్రమజీవి దేహపుచెమట బొట్లలో కలసిఇంధనమై శక్తినిస్తుంది ఓ కన్నీటి బొట్టుమనసులో ఉప్పొంగేవేదనాసాగరానికిసాంత్వననిస్తుంది భృకుటిపై సింధూరపు బొట్టుకుండలిని తాకినీలో విజ్జ్ఞతను మేల్కొలుపుతుందిబొట్టు మంచిదే..

బొట్టు Read More »

కుబుసం

నమస్తే. ఈ రోజు [31-10-2021] ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం “స్నేహ “లో నా కథ “కుబుసం ” ప్రచురితం అయింది. ప్రజాశక్తి సంపాదకులకు ధన్యవాదాలతో. కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయం కోరుతూ.. “వెతకండి..వెతికి పట్టుకోండి.. కొట్టండి..కొట్టి చంపేయండి” అరుపులకు మెలకువ వొచ్చేసింది నాకు.” అబ్బా..సెలవు రోజు నిద్రపోనీకుండా పొద్దునే ఈ వెర్రి అరుపులు ఏంటి” కళ్ళు నులుముకుంటూ లేచాను. “ఈయన లేచి ఉదయపు నడక కోసం వెళ్లినట్లు ఉన్నాడు ” బ్రష్ మీద పేస్ట్

కుబుసం Read More »

అందమే ఆనందం

నా ఊపిరి గాలికి ఊయలలూగుతూ ఉంటే నీ ముంగురులు..అవునండీ.. అతివ కురులు గాలికి అలల్లా ఊయలలూగుతుంటే మురిసిపోని రస హృదయం ఉంటుందా..? మరి ఆ కురుల సోయగాల గురించి, వాటి సంరక్షణ గురించి ఈ నెల మన సాహూ లో తెలుసుకుందామా.తొలకర్లు పడి చాలారోజులు అయిపోయింది. ఇక పూర్తీ వర్షాకాలం వచ్చేసింది. వేడిగా ఉన్న ఎండాకాలపు సెగల నుంచి కాస్త చల్లదనం, చిరుజల్లులు వాతావరణంలోకి ప్రవేశించాయి. ప్రతిరోజూ కాకపోయినా అడపా దడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మన

అందమే ఆనందం Read More »

ఒక బాలనాగమ్మ..నలుగురు మాయల పకీర్లు

ఈ నెల [అక్టోబర్ 2021 ] విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితం అయిన నా కథ “ఒక బాలనాగమ్మ -నలుగురు మాయల పకీర్లు”. శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో. మిత్రులకు దసరా శుభాకాంక్షలతో..దసరా కథ..🌹🌹🙏🙏కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ..🌹🌹🙏🙏 బడి బయట ఉండుండి తప్పేట్లు గొట్టే శబ్దం వస్తా ఉండాది.” పది రోజులు సెలవులిచ్చినారు కదా అని వీధుల్లో పడి బలాదూరుగా తిరగబాకండి. ఇంటికాడనే ఉండి సుమతి శతకాలు, వేమన పద్యాలు కంఠతా పట్టండి.

ఒక బాలనాగమ్మ..నలుగురు మాయల పకీర్లు Read More »

క్రూకెడ్

నమస్తే. ఈ రోజు 10-10-2021 నవ తెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం సోపతి లో నేను రాసిన కథ “క్రూకెడ్” ప్రచురితం అయింది. సోపతి సంపాదకులు కటుకోజ్వల ఆనందాచారి గారికి ధన్యవాదాలు. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలుపగోరుతూ…🙏🙏🌹🌹 నిశ్శబ్దం లోనించి హృదయవిదారకంగా వినిపించిందా అరుపు. అడవిలో అప్పుడప్పుడే తల్లిచాటు నుంచి బయటకు వచ్చి ఒంటరిగా తిరగడం నేర్చుకుంటున్న లేడి కూన తొలిసారి మృగపు పంజా దెబ్బ తగిలి చిగురుటాకులా వణికిపోతోంది.తలుపు తెరుచుకుని లోపలకు వెళ్ళిన

క్రూకెడ్ Read More »

నిస్సహాయ పక్కటెముక

అమ్మలారా..అక్కలారా..సృష్టిని ఆపేద్దాంవలువలు..విలువలతో నాకేం పనిఏవరేమైతే నాకేం అంతా నా ఇష్టంఅంటారు ఒకరు..డబ్బే నా పాలిటి బ్రహ్మ పదార్ధందాని కోసం ఏమైనా చూపిస్తానుఅంటోంది ఓ నటశిరోమణి..మీ మత్తే మా ఆదాయంఅంటారు పాలకులు ..చాటింగ్,మీటింగ్,డేటింగ్స్వేచ్చా విహారమే నేటి నయా ట్రెండ్అంటోంది నేటి నాగరిక యువతఏది తినవద్దు, ఏది తాగవద్దుఏది చేయవద్దు అంటేఅది చేయడమే మనిషి నైజంఅక్కడ తాగి, తిని, చూస్తేఇక్కడ మానవ జాతికి ఆధారాన్నిచ్చేఓ నిస్సహాయ పక్కటెముకకామపు అడకత్తెరలోభళ్ళున విరిగి నుజ్జు నుజ్జు అవుతోంది..చేసేవన్నీ చేసి నీతులు చెప్పడమేపైసా ఖర్చు

నిస్సహాయ పక్కటెముక Read More »

స్కైలాబ్

దీని పాసుగల..స్కైల్యాబ్ పడి అందరం సచ్చిపోతాం అంట😨. అందరిని ఎంత బెదరగొట్టేస్తోందో ఈ స్కైలాబ్. ఏమా స్కైలాబ్ కథా..కమామీషు..స్కైలాబ్ మందల తెలియాలంటే ఈ నెల విశాలాక్షిలో బుజ్జమ్మ చెప్పే స్కైలాబ్ కథ చూడాల్సిందే. శ్రీ ఈతకోటసుబ్బారావు గారికి ధన్యవాదాలతో🙏🌹… “పాండు రంగడే మనకు తోడుగా పండారిపురమున ఉన్నాడుగా. రంగయ్య..పాండు రంగయ్య”. బడి కాడ నించి నాలుగడుగులు వేసానో లేదో పెద్దగా పాట ఇనిపిస్తా ఉండాది.“ఐ… ఇంటి ముందర సెంటర్ కాడికి పండరి భజన వొళ్ళు వొచ్చినట్లు ఉండారు”

స్కైలాబ్ Read More »

మధు

కాళ్ళు, చేతులు లేవు. అయినా ఆ పసివాడు చక్కగా చిత్రాలు గీస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం. అద్భుతమైన చిత్రలేఖన కళాకారుడు మా ఆత్మీయ తమ్ముడు ఆర్టిస్ట్ హర్ష జైన్, అతని చిన్నారి శిష్యుడు మధుసూదన్ ల మధ్య జరిగిన యదార్ధ సంఘటనలే “ఎమ్మెస్సార్ కథా ప్రపంచం 2020″ సంపుటిలో నేను రాసిన ” మధు ” కథా నేపధ్యం. గురు, శిష్యుల సంబంధానికి అద్భుతమైన అర్ధాన్ని చెప్పిన కథ “మధు ” ఈ గురుపూజోత్సవం రోజున మీ

మధు Read More »

కుడుముల సామి

నమస్తే. ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో నా కథ “కుడుములు సామి” ప్రచురితం అయింది. సంపాదకులు శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ.. బడి కాడ నుంచి ఇంటికి వస్తానే వాకిట్లో నల్ల కిర్రు చెప్పులు ఔపడ్డాయి నాకు. అంటే ఊరి కాడ్నించి రమణయ్య వొచ్చాడన్నమాట. ఇంట్లోకి పోయి చూస్తే నా ఊహ నిజమే. రమణయ్య, నాయిన మాట్లాడుకుంటా టీ తాగతా ఉండారు.నన్ను చూస్తానే రమణయ్య ” రారా

కుడుముల సామి Read More »