నల్ల సూరీడు సమీక్ష – 1

సాహితీ పెద్దలు శ్రీ విహారి గారు సృజన ప్రియ పత్రిక లో “నల్ల సూరీడు” ని వెలిగించిన అధ్బుతం. సృజయ ప్రియ సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు Wilson Raoగారికి, Kommavarapu గారికి, గురువులు విహారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో 🙏🌹 సృజయ ప్రియ ప్రధాన సంపాదకులు, నాకు అత్యంత ప్రియ మిత్రులు శ్రీ నీలం దయానంద రాజు గారి ఆకస్మిక మరణం అత్యంత విషాదకరం. వారికి కన్నీటి నివాళులు 🙏🙏 అనుభూతి కేంద్రంగా వస్తు […]

నల్ల సూరీడు సమీక్ష – 1 Read More »

యుద్ధం

విద్యార్థులు విజయం సాధించాల్సింది దేనిమీద..? మే నెల “కస్తూరి మాసపత్రిక” లో నా కథ “యుద్ధం”. కస్తూరి మాసపత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో. “యుద్ధం ” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపగోరుతూ… 🙏🙏 మనం తరచుగా విజయాన్ని అకడమిక్ స్కోర్‌లతో సమానం చేసే ప్రపంచంలో, మార్కులు జీవితం ఒకటె అనుకునే అనాగరిక ప్రపంచంలో ఉన్నాము . రెండు విభిన్న కథనాలు నా దృష్టికి వచ్చాయి. ఒక విద్యార్థి, 1,000కి 892 స్కోర్‌ను సాధించినప్పటికీ, విషాదకరంగా ఆత్మన్యూనతతో తన

యుద్ధం Read More »

నల్ల సూరీడు సమీక్ష – 2

అడగకనే లభించిన వరం. ప్రముఖ కవి, కథకులు, విమర్శకులు, విశ్లేషకులు శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి సమీక్షతో మళ్ళీ “నల్ల సూరీడు” మీ ముందుకు వెలుగులు చిమ్ముతూ వచ్చాడు. ప్రజాపక్షం పత్రిక సంపాదకులకు, శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో..

నల్ల సూరీడు సమీక్ష – 2 Read More »

సంచికలో నా అంతరంగం

ఏప్రిల్ నెల సంచిక వెబ్ పత్రికలో డాక్టర్ కె. ఎల్. వి. ప్రసాద్ గారు నాతో జరిపిన ఇంటర్వ్యూ. నా అంతరంగంలోకి ఓ సారి చూస్తారు కదూ..సంచిక పత్రిక సంపాదకులకు, డాక్టర్ కె. ఎల్. వి. ప్రసాద్ గార్లకు ధన్యవాదాలతో.. https://sanchika.com/interview-with-mrs-rohini-vanjari/?sfw=pass1680585285

సంచికలో నా అంతరంగం Read More »

గంగరాయి సెట్టు కింద ఇరగాలమ్మో..

నెల్లూరులో నరసింహకొండకు వెళ్లే దారిలో లోతైన చీకటి గుహ లాంటి చోట వెలసిన ఇరగాలమ్మ.. గ్రామ దేవత. ఇరుకళల అమ్మగా మారక ముందు నేను పసితనంలో కళ్లారా చూసిన జాతర. “గంగరాయి చెట్టు కింద ఇరగాలమ్మో” కథ రూపంలో మార్చి నెల పాలపిట్టలో. గుడిపాటి వెంకట్ గారికి ధన్యవాదాలతో..“గంగరాయి చెట్టు కింద ఇరగాలమ్మో” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ.. ” మొ..రవంత గొబ్బిరి చమురు చేతలో ఏస్తావా” ఇరబోసుకున్న తలను గీరుకుంటా అడిగినాది సుబ్బి.“ఏం సుబ్బే..ఈ

గంగరాయి సెట్టు కింద ఇరగాలమ్మో.. Read More »

వసంత యామిని

“నేటి నిజం” దిన పత్రికలో “వసంత యామిని కవిత”. బైస దేవదాస్ గారికి ధన్యవాదాలతో. వసంత యామిని ని చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటూ “ఒకానొక సాయం సంధ్య వేళగమ్యం తెలియని తెరువరిలా అడుగులు వేస్తున్నాదేహం ముందుకు కదులుతోంది భారంగామనస్సుకి మాత్రం ఏదో తెలియని అలజడిజ్ఞానేంద్రియాల్లోకి చొచ్చుకు వెళుతున్న లోకపు వింతపోకడలుగుండెను మెలితిప్పుతున్న జ్ఞాన నరాలుఎల్లెడలా అసూయా ద్వేషం జంట కవుల్లా విజృంభిస్తున్నాయికామక్రోధాలు రాబందుల జతలా ఆడదేహాలను ఛిద్రం చేస్తున్నాయిదౌర్జన్యం రాక్షసనీడలా కమ్ముకుంటోందినిరాశ నివురుగప్పిన

వసంత యామిని Read More »

ఆరోగ్యమే ఆనందం – 8

మిత్రులకు సాహో అందించే మరో ఆరోగ్య కానుక. సాహూ మార్చి నెల సంచికలో “పశ్చిమోత్తాసనం” మీ కోసం “ఆజానుబాహుడంట అమ్మలాలో” పాట వినేవుంటారు. తీరైన భుజాల ఆకృతి ఉన్నవాళ్ళకి ఇచ్చే ఒక ప్రశంస అది. ఇప్పుడు, ఈ ఊరుకులపరుగుల యుగంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్య. పోషకాహార లోపం. ముప్పై ఏళ్లలోపే ఎముకలు అరిగిపోవడం, త్వరగా అలిసిపోవడం. మెడ, భుజాల్లో తీవ్రమైన నొప్పి. ఇక తీరైన దేహ ఆకృతి అటుంచి, చక్కని

ఆరోగ్యమే ఆనందం – 8 Read More »

నాటిన విత్తులు

ఈ రోజు ప్రజాశక్తి “స్నేహ” పత్రికలో నా బాలల కథ “నాటిన విత్తులు”. స్నేహ సంపాదకులకు ధన్యవాదాలతో..చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కోరుతూ.. బడి వదిలి గంట అయినా ఇంకా ఇంటికి రాని కొడుకు కోసం వాకిట్లో నిలబడి చూస్తోంది కీర్తన.ఆమె కొడుకు సుధీర్ మూడోవ తరగతి చదువుతున్నాడు. స్కూల్ ఇంటికి మూడు వీధుల అవతల ఉంది. రోజు బడి గంట కొట్టాక ఓ గంట స్కూల్ దగ్గర మిత్రులతో ఆడుకుని ఒక్కడే ఇంటికి వచ్చేసేవాడు. ఆ

నాటిన విత్తులు Read More »

నిత్య ప్రేమికుడు

“వాడికి నా అందంతో పనిలేదుఆపాదమస్తకం గిలిగింతలు పెట్టేస్తాడువాడు నా రంగు తెలుపా నలుపా చూడడువాడి నఖక్షతాలు దంతక్షతాలు సరేసరివాడికి నా గెలుపోటములతో పనిలేదునా చేత్తో పెడితే కానీ ఒక్క ముద్దైనా తినడునేను బయటకెళితే చాలు వాడి కళ్ళల్లో గుబులువాకిట్లో తోరణాలకి వాడి చూపులను వేలాడదీస్తాడునేనేదో కానుకలు తెస్తానని ఆశపడడునేను తిరిగొచ్చే దాక గుమ్మం దగ్గరే వాడి మకాంరోజూ I LOVE YOU చెప్పలేదని అలగడునా ఒడిలోచేరి ప్రేమగీతాన్ని మౌనంగా ఆలపిస్తాడుకాసింత పరాగ్గా ఉన్నా చాలుకళ్ళల్లోకి చూస్తూ చూస్తూ

నిత్య ప్రేమికుడు Read More »

ఉనికి

తెలుగు సొగసు ఆన్లైన్ పత్రిక “ప్రేమికుల దినోత్సవం” ప్రత్యేక సంచిక లో ప్రచురితమైన నా కవిత “ఉనికి” ❤❤ ఆమెకెపుడు నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదుతన అడుగుల సవ్వడే నాకు హిందోళరాగంతననెప్పుడూ ఖరీదైన హోటల్కి తీసుకెళ్లలేదుతనువండిన వంటలో ఏడో రుచినేదో కలిపేదిఆ మధురమైన రుచి నాకు ఇంకెక్కడా దొరకలేదుబహుశా ఆ రుచి పేరు అనురాగమేమోతనకెప్పుడు నేను గులాబీలు ఇవ్వలేదుతన నవ్వులతోనే ఇల్లంతా రంగులద్దుకునేవిసాయంకాలమైతే చాలు తనచూపుల్నిగుమ్మంలోనే వేలాడదీసేదినన్ను చూడగానే తన కళ్లల్లో మెరుపులువాటితోనే రాత్రంతా వెలుగులు నింపేదితనెప్పుడు

ఉనికి Read More »