దీపం
ఈ రోజు నవతెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం “సోపతి” లో నా కవిత “దీపం”. చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపుతారు కదా..🌹❤ దీపమొకటి వెలిగించాలితిమిరాన్ని తరిమేసేందుకు.. ..దీపమంటే చమురు పోసివత్తివేసి వెలిగించడమే కాదుకదా..బతుకుబాటలో అడుగడుగునాదారిదీపాలు ఎన్నెన్నో వెలిగించాలి.. ప్రయత్న దీపమొకటి వెలిగించాలివిధి రాతను మార్చేందుకు.. మమతల దీపమొకటి వెలిగించాలిమతాల మత్తును వదిలించేందుకు.ప్రేమదీపమొకటి వెలిగించాలికులపు మెట్లు కూలగొట్టేందుకు..కరుణ దీపమొకటి వెలిగించాలిసాటిమనిషి కన్నీరు తుడిచేందుకు..జ్ఞానదీపమొకటి వెలిగించాలిఅజ్ఞానాంధకారాన్ని వెడలగొట్టేందుకు . ఆశా దీపమొకటి వెలిగించాలిఆకాశపు అంచులు అందుకోవడానికి..గెలుపు దీపమొకటి వెలిగించాలివిజయకేతనాన్ని […]