కవితలు

బువ్వ గింజల మోపు..

ఈనాటి ఆంధ్రజ్యోతి పత్రిక సాహితీ పేజీ వివిధ లో నా కవిత “బువ్వ గింజల మోపు” ప్రచురితం అయింది. చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. వివిధ సంపాదకులకు, మెహర్ గారికి ధన్యవాదాలతో.. గెనంగట్టు మీద నాయిన కొడవలి భుజానేసుకొస్తుంటే బువ్వకుండ నడిచొస్తా ఉన్నట్లనిపించేది .. గుంటబాయి నించి యాతంతో నీళ్ళు తోడిపోస్తుంటే తొలకర్లు చిలకరించే వానదేవుడిలా అవుపడేటోడు.. చెంగోవాలు కట్టి చాడేసిన కయ్యల్లో మెరుస్తూ తిరిగే పొద్దప్పతో పోటీపడి పరుగుతీసే నాయినను పలకరిస్తే పొద్దుతిరుగుడు పువ్వులా

బువ్వ గింజల మోపు.. Read More »

ఆ మూడు మాకొద్దు

ఈనాటి “మహా”పత్రిక సాహితీ పేజీ లో నా కవిత “ఆ మూడు మాకొద్దు” చదవండి. మహా సాహితీ పేజి సంపాదకులు హనీఫ్ గారికి ధన్యవాదాలతో “అన్నీ అంగాల్లాంటివే మా దేహాల్లో ఇమిడిఉన్న ఆ మూడు.. అవి ఉన్నందుకేగా మాపై మీ దాష్టికాలు.. గుడులు బడులు రైల్వేస్టేషన్లు హోటళ్ళు ఎన్ని స్థలాలో మీకు.. మా అవయవాలను ఛిద్రం చేయడానికి.. మా దేహాల రక్షణకు కాసింత జాగా ఎక్కడుందో ఏ మహాత్ముడు చెప్పగలడు? ఇరవై ముప్పై మృగాల మూకుమ్మడి దాడికి

ఆ మూడు మాకొద్దు Read More »

రెండో బాల్యం

ఈనాటి సృజన క్రాంతి సాహితీ పేజీలో నా కవిత “రెండో బాల్యం” చదవండి. Wilson Rao Kommavarapu సర్ కి ధన్యవాదాలతో ఏటిగట్టున చింతచెట్టు కొమ్మకు ఊయల కట్టాను దిగంతాల అంచుల నడుమ అలిసిపోయేదాకా ఊగాను.. దిక్కుతోచని పిల్లపిట్టలా తోటంతా కలయదిరిగాను పూల పరిమళానికి మత్తిల్లిన గొల్లభామలా గడ్డిపరుపు పైన కాసేపు సోలిపోయాను.. సాయంత్రపు నీరెండకు నీడలు పొడుగవుతున్నాయి రేగిపోయిన జుట్టులో పిల్లగాలి గడ్డిపూలు తురుముతోంది నునులేత పారిజాత రేకులు నా ముఖాన్ని తడుముతూ దోబూచులాట మొదలుపెట్టాయి..

రెండో బాల్యం Read More »

లక్ష ఒత్తుల కాగడా

యుద్ధం- శాంతి” కవిత్వ సంకలనంలో నేను రాసిన “లక్ష వత్తుల కాగడా” కవిత చదవండి. Doctor Vidyadhar Jeldi గారికి, శ్రీ Sarikonda Narasimharaju గారికి ధన్యవాదాలతో అక్కడ నెత్తురు ఏరులై పారింది గడ్డకట్టిన నెత్తుటి మడుగులు నల్లటి అవశేషాలైనాయి జరిగిన రక్తపాతాన్ని పైనుంచి చూసిన ఆకాశం వెక్కి వెక్కి ఏడ్చింది.. నింగి కార్చిన కన్నీటి బొట్లు నేలపై పడ్డాయి నెత్తుటి చుక్కలకు మళ్ళీ జీవమొచ్చింది ఒక్కో చుక్కా ఒక్కో కథ వినమంటోంది .. తల తెగిన

లక్ష ఒత్తుల కాగడా Read More »

తరాజు

ఈనాటి మన తెలంగాణ పత్రిక సాహితీ పేజి “మెహఫిల్” లో నా కవిత “తరాజు “ చదవండి నువ్వు నేను- తరతరాల తక్కెడ తరాజులో నన్నెప్పుడో తాలుగింజలా తేల్చేసావు.. రెండు క్రోమోజోముల కలయిక నువ్వు నేను- ఒక్క క్రోమోజము తేడాతో నిర్మితమైన దేహాలు – నీది నాది అంతమాత్రాన నువ్వు ధీరుడు సూరుడు కాదు నేను బేలనో అబలనో కాదు.. పితృసామ్యం నిన్ను అధిపతిగా మలచి నాకు బానిస ముద్ర వేసి ఉగ్గుపాలతోనే భావ గరళం పోసింది..

తరాజు Read More »

తలవంచని సుమధాత్రి నేటి మహిళ

తెలంగాణ రాష్ట్ర పోలీస్ పత్రిక “తెలంగాణ సురక్ష” మార్చి నెల సంచికలో “నేటి మహిళ” వ్యాసం చదవండి “యుగయుగాల చరిత్రలో- పగబట్టిన ధరిత్రి లో – తలవంచని సుమధాత్రి స్త్రీ – కరుణామృత నేత్రి స్త్రీ” మహిళల స్థితిగతులను ప్రస్తావిస్తూ ఓ కవి రాసిన పలుకులు ఇవి. మార్చి నెలను తల్చుకున్నా, మార్చి 8 వ తేదీ దగ్గర పడుతోంది అనుకున్నా మహిళల్లో ఒక ఉత్తేజం కనబడుతుంది. పెల్లుబికిన ఉత్సాహం మగువ మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సభలు,

తలవంచని సుమధాత్రి నేటి మహిళ Read More »

89. ఏక్ దిన్ కా రాణి

“ఏక్ దిన్ కా రాణి” బహుళ త్రైమాసిక ఆన్లైన్ పత్రిక “మహిళ దినోత్సవ ప్రత్యేక సంచిక లో ప్రచురితం అయిన నా కవిత చదవండి Jwalitha Denchanala Jwalitha మేడమ్ గారికి ధన్యవాదాలతో “స్త్రీ దేవత పూజించాలి” అని ఊగిపోతూ కవితను చదివినవాడే ఇంట్లో వంట చేయడం ఆలస్యమైందని భార్య చెంప మీద అరచేతి ముద్ర వేశాడు.. “మహిళలను నేను గౌరవిస్తాను” వేదికపై మైకులో గొంతు చించుకున్న వాడే కాసుల కోసం గుడ్డలిప్పి ఆమెను విపణి వీధిలో

89. ఏక్ దిన్ కా రాణి Read More »

88. ప్రేమ వంతెన

ఏకం నుంచి అనేకం అక్కడే కదా భిన్నత్వం అకారమో అభిరుచో వేరైతే నువ్వు నేను ఒకటి కదా..? నింగికి నేల ఎంత దూరమని వాన బొట్ల వంతెనేసి హరివిల్లును కిందికి దించి నింగి నేలకు ప్రేమ కానుకను అందిస్తోంది కదా.. నింగిలో కిరణం పుడితేనే కదా నేల మీద వెలుతురు పండగ.. పగలు రాత్రి ఒక్కసారైనా కలవకున్నా నీ వెంటే నేను నీ వెనుకే నేను ఎప్పుడైనా గతి తప్పామా అంటున్నాయి.. పగలు రాత్రి లేకుంటే రోజు

88. ప్రేమ వంతెన Read More »

ప్రేమ తరగలు

ఈ వారం సృజన క్రాంతి సాహితీ పేజీలో నా కవిత “ప్రేమ తరగలు”. Wilson Rao Kommavarapu గారికి ధన్యవాదాలతో.. కర్తవ్యాన్ని పూర్తి చేసిన సైనికుడిలా చలి మౌనంగా వెనుదిరిగింది.. మోడువారిన బీడులన్నీ పచ్చగా విచ్చుకుంటున్నాయి.. లేత చిగుళ్ళ వగరుకి చైత్ర కోయిలలు సానబెట్టుకున్న స్వరాలతో వసంత రాగాన్ని పదేపదే ఆలపిస్తున్నాయి.. అమావాస్య చీకటిని చీల్చుతూ విల్లులా ఒంపు తిరిగిన బాలచంద్రుడు రంజాన్ మాసానికి స్వాగతం పలికాడు.. మరోపక్క వేపపూత, మామిడి పిందెలు ఆమని పిలుపు అందుకుని

ప్రేమ తరగలు Read More »

పడమటి మెట్లు

ఎందుకో ఈ సాయంసంధ్య వేళ అలవికాని దిగులు చీకటిలా అలుముకుంటోంది నింగినావరించి ఉన్న కెంజాయ వర్ణం నిశ్శబ్ద రాగంతో విలపిస్తోంది.. అస్తమయమవుతున్న సూర్యుడికి దిగులేమీలేదు తొలిపొద్దుకు వెలుగై మళ్ళీ పుడతాననే నమ్మకం అతనిది .. బాల్యపు చైతన్యాలు యవ్వనపు శిఖరాగ్రాలు ఎక్కేసాక పడమటి మెట్లు దిగడమంటే ఎంత బెంగో.. నడిచొచ్చిన దారులు దూరమవుతున్నాయి వెంట వచ్చిన మమతలు మాయమవుతున్నాయి.. మాటల ఊతం లేకుండా మరలుతున్న ఒంటరి పయనం మెట్లన్నీ దిగిపోయి అదృశ్యం అయినాక ఇక అంతా చీకటే

పడమటి మెట్లు Read More »