కవితలు

క్రింది కవిత "ఎన్ని ఉగాదులొస్తేనేం" ప్రజా శక్తి స్నేహ వీక్లీ లో 31-03-2019 న ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయాలూ తెలుప ప్రార్ధన. --------------------------------------------------------------------------------------------------------------------------- ఎన్ని ఉగాదులొస్తేనేం కాంక్రీటు కీకారణ్యంలో భూతద్దమేసినా కానరాని పచ్చదనం కాలుష్యం కోరల కింద సమాధి అవుతుంటే మూగబోయింది కోకిలమ్మ కంఠస్వరం... ఎన్ని ఉగాదులొస్తేనేం... నీరులేక, నారులేక, మడులులేక నెర్రలు బారిన నేలలో కరువు దేవత కరాళ నృత్యం మాడుతుంటే పురుగుల కోసం తెచ్చిన మందే రైతన్న గొంతులో గరళంలా దిగి అచేతన అవస్థను అందిస్తుంటే.... ఎన్ని ఉగాదులొస్తేనేం... కట్నమో, ప్రేమో, కామమో పైశాచికత్వమో మొగుడో , ప్రియుడో , అనామకుడో కని పెంచిన తండ్రో ఎవరైతేనేం,ఇంటి మహాలక్ష్మి అంటూనే కుత్తుక తెగ నరికినపుడు... ఎన్ని ఉగాదులొస్తేనేం...
క్రింది కవిత "మనిషి'లో' చెత్త" నవ్య వీక్లీ లో 29-8-2018 న ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయండి. --------------------------------------------------------------------------------------------------------------------------- మనిషి స్పర్శించడం మానేశాడు కరచాలనాలు, ఆలింగనాలు, కంటి చూపులు చిరునవ్వుల చిత్తరువులు.. ఊహ.. ఏమి లేవిప్పుడు మనిషి స్పర్శేంద్రియాన్ని కోల్పోయాడు మనిషి ఘ్రాణించడం మానేసాడు మల్లెల మకరందాలు, మట్టి సువాసనలు పచ్చటి పొలాల పైరగాలుల పరిమళాలు ఆస్వాదన లేనే లేదిప్పుడు మనిషి ఘ్రాణేంద్రియాన్ని కోల్పోయాడు టీ.వీ. ముందో, ఐపాడ్, ఐఫోన్ లోని టచ్ స్క్రీన్ ని ఓ చేత్తో జరుపుతూ మరో చేత్తో తింటున్నది ఏం రుచో తెలీనంతగా మనిషి జిహ్వేంద్రియాన్ని కోల్పోయాడిప్పుడు నేత్ర ,చక్షువులు రెండే జ్ఞానేంద్రియాలు ఉన్నాయిప్పుడు మనిషికి అవి మాత్రం...

ఆయుధం

క్రింది కవిత "ఆయుధం" మాలిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. --------------------------------------------------------------------------------------------------------------------------- "ఎక్కడమ్మా నీకు రక్ష ఓ దిశా, నిర్బయా,అభయా, ఆయోషా,ఆసిఫా... నువ్వేవరైతే ఏమి ఈ భువిలో అమ్మ గర్భంలో నువ్వు రూపుదిద్దుకోక ముందే ఆడపిల్లవని గర్భంలోనే నిన్ను చిదిమేసే కసాయి తల్లిదండ్రులున్నారు ఈ లోకంలో జాగ్రత్త తల్లి జాగ్రత్త... నువ్వు పుట్టాక ఎదిగీ ఎదగని నీ చిరుదేహాన్ని మందంతో కాటేసే కామాంధులు ఉన్నారు ఈ లోకంలో జాగ్రత్త తల్లీ జాగ్రత్త... కులాంధత్వం,మతమౌఢ్యం, కక్షలు, కార్పణ్యాలు, అన్నీంటీకీ ప్రతీకారం తీర్చుకోవడానికి నీ దేహాన్నే వేదిక చేసుకునే మానవ మృగాలున్నాయి ఈ లోకంలో జాగ్రత్త తల్లీ జాగ్రత్త... అమ్మ ఒడిలో,చదువుల బడిలో, ఆఖరికి దేవుడి గుడిలో కూడా నీకు లేదమ్మా రక్ష.... దుష్టశిక్షణ, శిష్టరక్షణ కావించాల్సిన...
మనుషులు మానవత్వాన్ని మరచి మృగాలుగా మారుతున్నవేళ ఆవేదనతో రాసిన ఈ "మనిషి - మృగం" కవిత విశాలాక్షి మాస పత్రికలో ప్రచురితం అయింది. ఓ మనిషీ.. జాగ్రత్త సుమా.. మనిషి లోని మనిషి మాయమై పోయి మనిషి రూపంలో మృగాలు తిరుగాడే జనారణ్యమిది... ప్రేమించలేదని ముఖాన యాసిడ్ పోసో, చున్నీతో ఉరిబిగించో అమాయకపు అబలను కబళించే ఈవ్ టీజర్స్ రూపంలో మానవ మృగాలు తిరుగాడుతున్నాయిపుడు. కట్టుకున్న భర్త నచ్చలేదని అన్నంలో విషం కలిపి మోసపు ప్రేమ నాటకాన్ని రక్తికట్టించి, నమ్మిన భర్తను నట్టేట ముంచే భార్యల రూపంలో మానవ మృగాలు తిరుగాడుతున్నాయిపుడు. కనిపెంచిన కూతురు తనకు నచ్చిన వాడిని మనువాడిందని.. కులం, మతం, ఆస్తి, అంతస్తు, పరువు,హోదాల ముసుగులు వీడలేక కన్నకూతుర్ని,మరో కన్నతల్లి బిడ్డడి కుత్తుక ను కత్తులతో తెగనరికే కసాయి తండ్రుల రూపంలో మానవ...
నా కవితా ప్రస్థానం: లోకం పోకడలు తెలిసి తెలియని వయస్సులో కాస్త మంచిర్యాంకు వచ్చి కూడా బి.ఎడ్ లో సీట్ పొందని నా అసమర్ధతను ఆవేదనఆవేశం కలగలిపి నా తొలి కవితగా విరచించిన వేళ... --------------------------------------------------------------------------------------------------------------------------- చదవాలని వుంది నాకో కోర్సు అందుకు చేశాను నేనో పెద్ద తపస్సు నేను మహా మేధావిని కాదు ఫస్ట్ ర్యాంకు కొట్టడానికి రాజకీయ నాయకుడి బావమరిదినైనా కాదు, రికమండేషన్ ఉత్తరం పెట్టడానికి! హరిజనుడినైనా కాలేదు రిజర్వేషన్ తో సీటు పొందడానికి ఆఖరికి అవిటివాడినైనా ఫిసికల్ హ్యాండీక్యాప్డ్ కింద సీట్ తెచ్చుకుని ఉండేవాడిని నేనెవరంటే... ఆర్ధికంగా చితికిపోయి అగ్రకులం లిస్టు లో ముందుండి దారిద్యపు ముళ్ళ కిరీటాన్ని తలపై పెట్టుకుని నిరుద్యోగపు శిలువను మోస్తూ...
నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.