కుడుముల సామి

నమస్తే. ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో నా కథ “కుడుములు సామి” ప్రచురితం అయింది. సంపాదకులు శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ.. బడి కాడ నుంచి ఇంటికి వస్తానే వాకిట్లో నల్ల కిర్రు చెప్పులు ఔపడ్డాయి నాకు. అంటే ఊరి కాడ్నించి రమణయ్య వొచ్చాడన్నమాట. ఇంట్లోకి పోయి చూస్తే నా ఊహ నిజమే. రమణయ్య, నాయిన మాట్లాడుకుంటా టీ తాగతా ఉండారు.నన్ను చూస్తానే రమణయ్య ” రారా […]

కుడుముల సామి Read More »

పెరుమాళ్ళకెరుక

కొందరు పైకి ఎంత నిజాయితీపరులుగా కనిపిస్తారు. వారి లోగుట్టు మాత్రం పెరుమాళ్ళకే తెలియాలి. నేను మెహిదీపట్నం నుంచి చిలుకూరు బాలాజి గుడికి బస్సు లో వెళుతున్నప్పుడు నా కళ్ళ ముందర జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా వ్రాసిన ఈ కథ “పెరుమాళ్ళకెరుక” ఈ నెల [జులై] ధర్మశాస్త్రం మాసపత్రికలో ప్రచురితం అయింది. సంపాదకులకు ధన్యవాదాలతో.. ఈ చిన్న కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా.. ఆగిఆగడంతోనే జనాలు బస్సు ను చుట్టుముట్టారు. బస్సు దిగి ”

పెరుమాళ్ళకెరుక Read More »

ఆనంద భైరవి

అబ్బయ్యా..అక్కా. . మా బడికాడి కుందేళ్ళ మందల చెప్తానన్నా కదా. మరి ఈ నెల [జులై] విశాలాక్షి మాసపత్రికలో “ఆనంద భైరవి” కత చదవండి. మీకు తెలస్తది. అట్నే నన్ను ప్రోత్సహిస్తున్న శ్రీ కోసూరి రత్నం సారుకి, శ్రీ ఈతకోటసుబ్బారావు సారుకి ధన్నివాదాలు. కతని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు చెప్తారుగా రాత్రి తొమ్మిదైంది. ఆ పొయిలప్పుడు మోహనన్న ఫ్రెండ్ మురళి ఇంటికొచ్చాడు. పంచలో చేరి ఇద్దరు గుసగుసలాడుకుంటా ఉండారు. అమ్మ కుంపట్లో బొగ్గుల మీద

ఆనంద భైరవి Read More »

సునీలు ఏమయ్యాడో

అబ్బయ్య, అమ్మి ..మూడేళ్ళ పసివాడు “సునీలు ఏమయ్యాడో” . ఆ మందల తెలియాలంటే మీరు ఓ తూరి నెల్లూరు విజయమహల్ సెంటర్ కాడికి వెళ్లాల్సిందే మరి.. విశాలాక్షి మాసపత్రిక జూన్ 2021 సంచికలో.. “బాటలకు ఇరువైపులా చెట్లు నాటించిన చక్రవర్తి …. ” ఆఖరి ఖాళీలో “అశోకుడు” అని రాసి “అమ్మయ్య” అనుకున్నా. క్లాసులో ఎనక కూర్చొని రాస్తావున్న ఆ అమ్మి హిమబిందు మెల్లగా ” రాసేసావా. అయిపోయిందా” అంటా సైగ చేసింది. రాసేశా అంటా తలవూపినా.

సునీలు ఏమయ్యాడో Read More »

అందమె ఆనందం

“సాహో” మాసపత్రికలో జూన్ నెల “అందమే ఆనందం” తో మీ ముందుకు. “అందానికి అందానివై, ఏనాటికి నా దానవై నా ముందర నిలిచిన దాన నా దాన” దిగ్విజయంగా మొదలైన మన “సాహూ ” పత్రిక తిరుగులేని సాహితి ఉద్యానవనంగా విలసిల్లాలని, ముందుగా సాహూకి అభినందనలు తెలియచేసుకుంటూ..మన అందాల శీర్షిక రెండో సంచికలోకి అడుగిడింది. ప్రపంచంలో అత్యంత అందమైన వారు ఎవరు అంటే ముందుగా “మదర్ థెరెసా ” పేరు చెప్తాను నేను. హృదయపు లోతుల్లో ఉండే

అందమె ఆనందం Read More »

అందమైన గాజులు

కరోనా కరోనా అంటూ ఎప్పుడూ భయపడడం, బాధ పడడమేనా. ధైర్యమే మన ఆయుధం. కాస్త రిలాక్స్ కోసం ఈ రోజు నా కథ “అందమైన గాజులు” చదవండి మిత్రులారా. ఈ నెల [మే 2021] విశాలాక్షి మాసపత్రికలో. బడి కాడనించి వస్తానే పుస్తకాల పెట్టిని మంచం మీదకు ఇసిరేసి అమ్మ ఇచ్చిన మురుకులు తింటా ఉన్నాను. కానీ నా మనసంతా వీధిలోనే ఉంది. ఆడుకునేదానికి వస్తామన్నారు సునీతా, రాధా. గబా గబా తినేసి అమ్మ పిలస్తా ఉన్నా

అందమైన గాజులు Read More »

అందమే ఆనందం

నమస్తే. ప్రింట్ పత్రికలు ఒక్కొక్కటీ మాయమౌతున్నఈ గడ్డు పరిస్థితుల్లో పాఠకులకు మంచి సాహిత్యం అందించాలనే సుదృక్పధంతో ప్రముఖ కథ, నవలా రచయిత శ్రీ ఇందు రమణ గారు “సాహో” సాహితీ పత్రికను ప్రారంభించారు. ఈ తరుణంలో పత్రికా నిర్వహణ గొప్ప సాహసమే అనుకోవాలి. ముందుగా శ్రీ ఇందు రమణ గారికి హృదయపూర్వక అభినందనలు. సాహో పత్రిక అంచెలంచెలుగా ఎదుగుతూ, సాహితీ లోకంలో మేటి పత్రికగా నిలవాలని కోరుకుంటున్నాను. సాహూ పత్రిక కోసం నేను సైతం “అందమే ఆనందం”

అందమే ఆనందం Read More »

సరంగు

“ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్క చెడుతాడు” లాంటి నానుడులు, సామెతలతో పుచ్చిపోయిన సమాజంలో ఓ సగటు ఆడది గడప దాటి ఎందుకు రావలసివచ్చింది, వచ్చి ఎలాంటి విజయం సాధించింది తెలిపే కథ “సరంగు”. ఈ నెల “సాహిత్య ప్రస్థానం ” ఏప్రిల్ 2021 సంచికలో. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా… ఆకాశమంత విశాలమైన హృదయం, భూమికి ఉన్నంత సహనం ఉండాలంటారు ఆడదానికి. కానీ రోజు రోజుకి మారుతున్న మా పరిస్థితులు నా సహనానికి పరీక్ష పెడుతున్నాయి.మా

సరంగు Read More »

వొజ్రం ఇలువ

“వొజ్రం ఇలువ ” విజయమహల్ సెంటర్ కథల్లో మొదటికథ మన విశాలాక్షి ఏప్రిల్ 2021 సంచికలో వచ్చేసిందండి. మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం ని తెలుపుతారుగా. స్టీలు పెట్టెలో పుస్తకాలు సర్దుకుంటా ఉన్నా. కాస్త చిరుగులు ఉన్న పడక కుర్చీ పట్టను దబ్బనం, పురికోస తాడుతో కుడతాఉన్నాడు నాయన. పంచ లో కొళాయి గుంట కాడ అంట్లు తోమతా ఉండాది సుబ్బి.“లోకాలయ్య.. ఇదిగో ఈ ఇడ్లీలు తీనేసి బడికి పో”అన్నాది అమ్మ సిబ్బిరేకులో మూడు ఇడ్లీలు,

వొజ్రం ఇలువ Read More »

చెల్లె

నమస్తే. శ్రీమతి కల్వకుంట కవిత గారి సంపాదకత్వంలో ప్రతిష్టాత్మకంగా వెలువడుతున్న తెలంగాణ జాగృతి తెలుగు సాహిత్య పక్షపత్రిక “తంగేడు” మార్చి 01-15, 2021 మహిళా దినోత్సవ ప్రత్యేక సంచిక లో నా కథ “చెల్లె ” ప్రచురితం అవడం చాలా ఆనందం. శ్రీమతి కల్వకుంట కవిత గారికి, అసోసియేట్ ఎడిటర్ డా|| కాంచనపల్లి గో.రా. గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులందరికీ ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయము తెలుపుతారుగా.. సుల్తాన్పూర్ బస్టాప్

చెల్లె Read More »