ఆరోగ్యమే ఆనందం

మిత్రులకు సాహూ కానుక. జనవరి నెల సాహూలో కపాలభాతి ప్రాణాయామం. ఇందూరమణ గారికి ధన్యవాదాలతో .. ఆరోగ్యమే ఆనందం“ఏ శ్వాసలో చేరితే.. గాలి గాంధర్వమౌతున్నదో, ఏ మోవిపై వాలితే..మౌనమే మంత్రమౌతున్నదో..ఆ శ్వాసలో నే లీనమై” మరి అంతగా మనం లీనం అవ్వాలంటే మన శ్వాస, మన మోము, మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉండాలని. మన మనసు, దేహం ఆ స్వచ్ఛతను సాధించాలంటే సులభమైన మార్గం ప్రాణాయామం. గత రెండు నెలల్లో సరళ ప్రాణాయామం, అనులోమ..విలోమ ప్రాణాయామం […]

ఆరోగ్యమే ఆనందం Read More »

పందేరం

మిత్రులకు సంక్రాతి కానుక. విశాలాంధ్ర పత్రికలో ఈ రోజు మీకోసం “పందేరం“. విశాలాంధ్ర సంపాదకులకు ధన్యవాదాలతో.. వరికుప్పల నడుమ వడివడిగా తిరుగుతూఈ తూరికి ఎన్ని పుట్ల ఒడ్లు వస్తాయోననిలెక్కలు గట్టే నాయన కళ్ళుచీకట్లో గడ్డివాముల చుట్టూ తిరిగేమిణుగురుల్లా ఆశగా మెరుస్తున్నాయి.. కుప్ప నూర్పిడి చేసి వొడ్లను తూర్పారబడుతూఅలిసిసొలిసిన కూలోళ్ళకు నడుమ నడుమతాటాకుల దొన్నెలో శాంతమ్మ అందించే కల్లుఅమృతపు చుక్కల్లా గొంతుల్లోకి దిగుతోంది.. ఊర్లోని పిలకాయలకోసం తెగలు తంపటేస్తూబురగుంజు తీస్తూ, తాటిముంజలు కొడుతూకరతుమ్మ పుల్లల మంటమీద తాటిపండ్లు కాలుస్తూవీరయ్య

పందేరం Read More »

దుఃఖపు వాగు మా నాయన

ఈ నెల “రైతు వాణి” మాస పత్రికలో నా కవిత “దుఃఖపు వాగు మా నాయన“. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపకోరుతూ.. కయ్య చివర గెనిమగట్టునవేపచెట్టు కింద యానాదన్న పిసికిన బంకమట్టితోనువ్వు ప్రతి ఏడాది స్వయంభులా వెలుస్తుంటేవిగ్నవినాయకుడవని టెంకాయకొట్టి నీకుతొలిమొక్కు తీర్చిన నాయన కళ్ళల్లో ఆశలుకల్లంలో పిడేటి కొట్టి రాల్చే ధాన్యపు రాశులతోపోటీపడుతున్నాయి.. ఏ రాత్రి ఏ వరదముంచుకొస్తుందో , ఏ పక్షులొచ్చి పంటతినేస్తాయో అని పొలం మధ్య మంచె మీదరెప్పకొట్టకుండా ఉండేలు తిప్పుకుంటూనిద్ర కాచిన

దుఃఖపు వాగు మా నాయన Read More »

రూపాయి దేవుడు

చిన్న రోగానికే పచారిసామాన్ల చీటీ అంత పొడుగున పరీక్షలు, మందులు రాసేసి ఆసుపత్రి అంటేనే బెదిరిపోయేలా చేసే డాక్టర్లు ఉన్న ఈ కాలంలో కూడా వారివారి స్తోమతని బట్టి ఎంత ఫీజు ఇస్తే అంత తీసుకుని, తన ధైర్య వచనాలతోనే సగం రోగాన్ని తగ్గిస్తూ, చక్కని వైద్యం చేసే ఓ డాక్టర్ కథే ఈ “రూపాయి దేవుడు”. ఈ నెల [డిసెంబర్] “నవమల్లెతీగ” మాసపత్రికలో నా కథ “రూపాయి దేవుడు”. “నవమల్లెతీగ ” సంపాదకులు “కలిమి శ్రీ”

రూపాయి దేవుడు Read More »

చంద్రకాంత చెలి

సాయంత్రమైందని చంద్రకాంత చెంత చేరానుచెక్కిలి ఆనించి ఓ నవ్వు నవ్వానా.. మరింత పక్కున నవ్వాయి చంద్రకాంత పూలురేపొద్దునకి వాడిపోతారు అంత నవ్వెందుకుఅని ఉడుక్కున్న నాకు ఊసులెన్నో చెప్పాయవి.. అరపూటే మా జీవితం అయితే ఏంటంటమీలా కాదు మేము అంటూ గర్వంగా తలలూపాయి.. మీ మనుషులకే కదా బాధలు వేదనలుబంధాలు బంధనాలు వేతలు వేధింపులు.. విద్వేషపు కొట్లాటలు మోసపూరిత దుర్మార్గాలుతేనె పూసిన కత్తులు విషం నిండిన గొంతులు వందేళ్ళ బతుకు ఉన్నా అరక్షణమైనాతృప్తి లేని బతుకులు అందని వాటికోసంఆరాటాలు,

చంద్రకాంత చెలి Read More »

ఎవరో నీ స్నేహం వద్దన్నారని గుబులేలఎవరో నిన్ను ద్వేషించారని బాధ ఎందుకుమరెవరో నిన్ను చూసి అసూయపడ్డారనివిచారపడనేల ..మరెవరో నీ ఉన్నతిని ఓర్వలేరని చింత నీకేల..?ఇంకెరితోనో బంధం భారమని దిగులేల..?వాళ్ళెవరో నీగురించి ఏమనుకుంటే నీకేమి..అన్నీ పట్టించుకున్నావా.. నిన్ను నువ్వు కోల్పోయావేనీలో నువ్వు లేనప్పుడు ఇక మిగిలింది శూన్యమేపూలతో నువ్వెప్పుడైనా చెలిమి చేసావా..?ఏనాడైనా నిన్ను ద్వేషించాయా అవి..రంగులను నీ కళ్ళల్లో పులుముకోవద్దని అడ్డు చెప్తాయా పూలు.పరిమళాలను ఆస్వాదించవద్దని నీ నుంచి దూరంగా పోతాయా అవి..పూలతో ఓ సారి చెలిమి చేసి

Read More »

కర్పూర దీపం సమీక్ష – జెల్ది విద్యాధరరావు గారు

శ్రీమతి వంజారి రోహిణి గారు విరచిత “కర్పూర దీపం” కథా సంవిధానం – అద్భుతం, అభినందనీయం, అజరామరం – ఒక చిన్న సమీక్ష *************************************************మరుగు దొడ్లను చేత్తో శుభ్రం చేసే వారిపై (మాన్యువల్ స్కావంజర్స్) వచ్చిన కథలు తెలుగు సాహితీ జగత్తులో చాలా అరుదు. కానీ వారి దుర్భర పరిస్థితులపై వారి దయనీయ జీవన స్థితగతుల గురించి హృదయం ద్రవించేలా కళ్ళకు హత్తుకునేలా “కర్పూర దీపం” కథ ద్వారా “దొడ్డెత్తే నరసమ్మ” ప్రధాన పాత్ర ద్వారా చిత్రీకరించన

కర్పూర దీపం సమీక్ష – జెల్ది విద్యాధరరావు గారు Read More »

దీపం

ఈ రోజు నవతెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం “సోపతి” లో నా కవిత “దీపం”. చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపుతారు కదా..🌹❤ దీపమొకటి వెలిగించాలితిమిరాన్ని తరిమేసేందుకు.. ..దీపమంటే చమురు పోసివత్తివేసి వెలిగించడమే కాదుకదా..బతుకుబాటలో అడుగడుగునాదారిదీపాలు ఎన్నెన్నో వెలిగించాలి.. ప్రయత్న దీపమొకటి వెలిగించాలివిధి రాతను మార్చేందుకు.. మమతల దీపమొకటి వెలిగించాలిమతాల మత్తును వదిలించేందుకు.ప్రేమదీపమొకటి వెలిగించాలికులపు మెట్లు కూలగొట్టేందుకు..కరుణ దీపమొకటి వెలిగించాలిసాటిమనిషి కన్నీరు తుడిచేందుకు..జ్ఞానదీపమొకటి వెలిగించాలిఅజ్ఞానాంధకారాన్ని వెడలగొట్టేందుకు . ఆశా దీపమొకటి వెలిగించాలిఆకాశపు అంచులు అందుకోవడానికి..గెలుపు దీపమొకటి వెలిగించాలివిజయకేతనాన్ని

దీపం Read More »

ఆఖరి మజిలీ

నవంబర్ నెల “సాహిత్య ప్రస్థానం” లో నా కథ “ఆఖరి మజిలీ”. నెల్లూరు లో నేను చూసిన నాలుగు జీవితాలు ఈ కథకి ప్రేరణ. ప్రస్థానం సంపాదకులకు ధన్యవాదాలతో. “ఆఖరి మజిలీ” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగోరుతూ.. “ఒళ్ళు బలిసి లేచిపోయిందంటారా..! ముండ. పిలకాయలు, మొగుడిని వదిలేసి ” ఎగతాళిగా అన్నాడతను. ఇంతకుముందెప్పుడు నేనతన్ని చూడలేదు.” అంతేనా..! ఆ ఐరావతమ్మకి మందు పెట్టి మాయ చేసి ఆస్తంతా రాయించేసుకుందట”కోర్టు మెట్లు ఎక్కుతుంటే వినిపించాయి ఆ మాటలు

ఆఖరి మజిలీ Read More »

ఆరోగ్యమే ఆనందం

నవంబర్ నెల “సాహో” మాస పత్రిక అందించిన బహుమతి. శారీరక మానసిక ఆరోగ్యాల కోసం “వృక్షాసనం“. శ్రీ ఇందూ రమణ గారికి ధన్యవాదాలతో. ఇక్కడ మిత్రుల కోసం 🌹❤🙂 “సాహూ” పాఠకులకు నమస్సులు. ప్రతి రోజు నిర్దిష్టమైన సమయంలో, నిర్దిష్టమైన ప్రదేశంలో ఆశావహ దృక్పథంతో చేసే ప్రాణాయామం, యోగాసనాలు ఇటు శారీరక, అటు మానసిక ఆరోగ్యానికి చాల చాల అవసరం. గత మూడు నెలల సంచికల్లో మూడు రకాల ప్రాణాయామాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ మూడు

ఆరోగ్యమే ఆనందం Read More »