మానవతా మూర్తులకు వందనం

ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకోగలిగే టెక్నాలజీ మనకు ఉందిప్పుడు. కానీ మనిషి మనసులో ఏముందో తెలుసుకోవడం మాత్రం అసాధ్యం. ఓవైపు సాంకేతికాభివృద్ధి పురోగమనంలో ఉంటే, మానవత్వపు విలువలు మాత్రం తిరోగమన దిశలో పాతాళంలోకి కురుకుపోతున్నాయి. ఇంతవరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న జాత్యహంకారం ఒక్కసారిగా భగ్గున మండి, దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది నిన్నటి మణిపూర్ సంఘటన. మతం రాబందు రెక్కలు విప్పుకుని అంతటా యథేచ్ఛగా తిరుగుతోంది. మనిషన్నవాడు అంతరించిపోయి విద్వేషం రాజ్యమేలుతుంటే ఇక […]

మానవతా మూర్తులకు వందనం Read More »

సైన్స్ రికార్డు – కొబ్బరి చట్నీ

నెల్లూరులో రైలుకట్టకి తూరుప్పక్క విజయమహల్ సెంటర్ లో బుజ్జమ్మ అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆ పిల్లకి ఇడ్లీలో కొబ్బరి చట్నీ నంజుకుని తినాలని కోరిక. వాళ్ళమ్మ ఎప్పుడూ మిరప్పొడి వేసేది. ఆ ఇంట్లో కొబ్బరి చట్నీ చేసుకునే స్థోమత లేదు. మరి ఆ పిల్ల కొబ్బరి చట్నీ తినాలన్న కోరిక తీరిందా లేదా. తెలియాలంటే “అంతర్వాహిని” కథల సంపుటిలోని నా కథ “సైన్సు రికార్డు” చదవాల్సిందే. మీ అభిప్రాయం తెలపాల్సిందే “ఇదిగో.. బుజ్జి..నేను గుడికాడికి పొయ్యొస్తా.

సైన్స్ రికార్డు – కొబ్బరి చట్నీ Read More »

సమైక్యంగా సాధించుకున్న స్వాతంత్య్ర ఫలం చేదెక్కిందా

ఈ వారం విమల సాహితీ ఎడిటోరియల్ వ్యాసం. చదివి మీ అమూల్యమైన స్పందనను తెలుపగోరుతూ. మిత్రులందరికీ విమల సాహితీ బృందం తరపున ముందస్తు ౭౬ వ స్వతంత్రదినోత్సవ శుభాకాంక్షలతో.. ఇష్టపడి నిర్మించుకున్న సొంత ఇంట్లో “నీ బాంచన్ దొరా, నీ కాలు మొక్కుతా” అంటూ ఒకరికింద బానిసగా బతకడం ఎంత నరకమో, ఆ ఇంటివారిని అడిగితే చెప్తారు. అటువంటిది సముద్రాలు దాటి వ్యాపారం కోసం వచ్చాము అంటూ నక్క జిత్తులు చూపించి, తిన్నఇంటి వాసాలు లెక్కబెట్టి, చివరకు

సమైక్యంగా సాధించుకున్న స్వాతంత్య్ర ఫలం చేదెక్కిందా Read More »

మానవత్వ పరిమళాలు ప్రసరించే నల్ల సూరీడు —- సామాజిక ఆరోగ్య ప్రయోజనాలలో అల్ల నేరేడు

ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి రోహిణి వంజారి గారి కథా సంపుటి “నల్ల సూరీడు” పుస్తకంపై ఒక చిరు సమీక్ష ************************************************ తెలుగు సాహిత్యం అనే రైల్వే స్టేషన్ లోకి కథా రచన అనే ప్లాట్ఫారం మీదకి 2014లో ఒక బుల్లెట్ ట్రైను దూసుకు వచ్చింది. మామూలు రైళ్లు తిరిగే ఆ ఫ్లాట్ ఫామ్ ని ఒక్క కుదుపు కుదిపి బలమైన హక్కుదారుగా తన అస్తిత్వాన్ని నిరూపించుకుంది. ఆ ఫ్లాట్ ఫామ్ పై తిరిగే ప్రయాణికులు అందర్నీ

మానవత్వ పరిమళాలు ప్రసరించే నల్ల సూరీడు —- సామాజిక ఆరోగ్య ప్రయోజనాలలో అల్ల నేరేడు Read More »

“జీవన గమనాలు” “నల్లసూరీడు రచనా ప్రస్థానం”

“జీవన గమనాలు” “నల్లసూరీడు రచనా ప్రస్థానం” కథల సంపుటి శ్రీమతి రోహిణి వంజారి గారు సమీక్షకురాలు అరుణ సందడి విమల సాహితి e పేపర్లో ఈ సమీక్షను ప్రచురించినందుకు యాజమాన్యం వారికి హృదయ పూర్వక నమస్సులు తెలుపుతున్నాను, ******************************************** ఇంగ్లీషులో స్టోరీ అనే పదం కథగా ,షార్ట్ స్టోరీ అనే పదం కథానికగా మారింది. నేడు కథ మరియు కథనం రెండు పరస్పరము మార్చుకోబడ్డాయని చెప్పుకుంటారు… తొలి తెలుగు కథ “దిద్దుబాటు” 1910 లో గురజాడ గారు

“జీవన గమనాలు” “నల్లసూరీడు రచనా ప్రస్థానం” Read More »

బతకడం కోసం, బతికించడం కోసం తిందామా..!

స్పూన్ తో నా, చేత్తో నా తినేది మీరు ..? తిండి కోసం, వివక్ష కోసం బతుకుదామా..? నలుగురి ఆకలి తీర్చేదానికి బతుకుదామా..? ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలపండి 🙏🌹 బతకడం కోసం, బతికించడం కోసం తిందామా..! మొత్తం జీవరాశుల్లో మానవులు వర్టిబ్రేట్స్ [వెన్నెముక గల జీవులు ] జీవ సముదాయంలో మమ్మెల్స్ [క్షీరదాలు అనగా పిల్లలకు పాలు ఇచ్చే జీవులు] జాతికి చెందినవాళ్ళం.

బతకడం కోసం, బతికించడం కోసం తిందామా..! Read More »

రా రా కృష్ణయ్యా

కృష్ణా…. మన్ను, వెన్నలు తిన్నది ఇక చాలయ్యా వన్నె,వలువలు దోచింది కూడా ఇక చాలు చాలయ్యా “దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై సంభవామి యుగే యుగే” అంటూ దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి వస్తానన్నావు కలియుగానికి మాత్రం రాకుండా శీతకన్నెసావు ఏమయ్యా… ఇపుడు కలియుగం అంటే కంసులు,పూతనలు, మారీచులు,శిశుపాలురూ వందలు,వేల సంఖ్యలో తిరుగాడుతున్న కలి కాలమిది… దొంగతనాలు,దోపిడులు, హత్యలు, అత్యాచారాలు, వివక్షలు,ఊచకోతలు హెచ్చుమీరిన దుష్టయుగం ఇది.. కాలుష్యాలు,కరోనాలు అంతుచిక్కని అంటురోగాలు ప్రభలిన రోగ లోకం ఇది.. మతి తప్పిన మానవజాతి

రా రా కృష్ణయ్యా Read More »