Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

దిగుడు మెట్లు

కవిత చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి “ఓ చెంప జననం మరోపక్క మరణం ద్వంద్వ సమాసంలా ఆనందం దుఃఖం.. ఇంకెక్కడో ద్వేషం మోసం అసూయ త్రిక సంధిలా తట్లాడుతుంటాయి.. అక్కడెవరికో పదవొచ్చిందని ఇక్కడ గుండెల్లో మంట రేగుతోంది.. ఎక్కడో పార్టీలో ఎవరో దొరికారని నిద్రని తరిమి నిశీధిలో.. యూ ట్యూబ్ వీడియోల శోధనలో తనని తాను మరచి.. ఆవేశం ఆక్రోశం అవహేళన వ్యాప్తి చేస్తూ ఇక్కడ చాకిరేవులా మార్చుకుంటున్న బతుకు .. కుళ్ళు చెత్తతో బుర్ర

దిగుడు మెట్లు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 53 – తాంబూలాలిచ్చేసారిక

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. “ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే – ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే – ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి”. నాయకులు, కార్యకర్తలు , ఓటర్లు అందరు కంటిమీద రెప్ప వేయకుండా ఎదురు చూసిన ఎన్నికల పోలింగ్ రోజు మే 13 అలా వచ్చేసింది. ఇలా వెళ్ళిపోయింది. కాలానిదేముంది. ఎవరిని పట్టించుకుంటుతుందది?

విమల సాహితి ఎడిటోరియల్ 53 – తాంబూలాలిచ్చేసారిక Read More »

రోహిణక్క కథల మందల

మే నెల విశాలాక్షి మాసపత్రికలో “రోహిణక్క కథల మందల” అంటూ డాక్టర్ పెళ్ళూరు సునీల్ గారు రాసిన సమీక్ష. విజయ మహల్ సెంటర్ కథల మందల గుట్టును సరిగ్గా విప్పి చెప్పిన సమీక్ష ఇది. శ్రీ కోసూరు రత్నం Ratnam Kosuru గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు Ethakota Subbarao గారికి కృతజ్ఞతలతో డాక్టర్ పెళ్ళూరు సునీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో సమీక్ష చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. పుస్తకం కొరకు ఈ నెంబర్ ను

రోహిణక్క కథల మందల Read More »

గిలక బొమ్మ

సృజన క్రాంతి సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు Wilson Rao Kommavarapu గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఉయ్యాల తొట్టిలో పొత్తి గుడ్డ గిరగిరా తిరిగే గిలక బొమ్మ.. వెన్నెల రాత్రిలో వేడి బువ్వ చందమామలో కుందేలు.. జాతరలో దొరికే చెరుకు గడ పండుగ రోజు పట్టు వస్త్రం.. కన్నీటిని తుడిచే కడకొంగు తడబడే అడుగులకు ఊతం.. పడిపోతే లేవనెత్తే ఆసరా జీవిత పుస్తకంలో తొలిపాఠం నేర్పించే గురువు.. గెలుపు ఓటమి ఏది వరించిన నన్ను నన్నుగా

గిలక బొమ్మ Read More »

జీవన్మృత్యువు

“జీవన్మృత్యువు”. ఈ వారం నవ తెలంగాణ సోపతిలో ప్రచురింపబడిన నా కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. శత్రువు లేని యుద్ధం వరద పోటెత్తినట్లు నెత్తుటి ప్రవాహం.. క్షణక్షణానికి విస్తరిస్తున్న వేదన ఆయుధాల కోతలతో ఉగ్గబట్టిన ఊపిరి .. నడుముకింద నవనాడుల్లో భరించలేని రాపిడి గాలిలో దీపమవుతున్న ప్రాణం.. తొమ్మిది నెలలు కాపురమున్న అతిధి కొత్తలోకంలోకి రావాలని జరిపే విశ్వ ప్రయత్నం .. ఉప్పెనలా ఉధృతమై ఊరుకుతున్న ఉమ్మనీరు జీవన్మృత్యు పోరాటం .. కేర్ కేర్

జీవన్మృత్యువు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 52 – బొడ్డు తాడు

బొడ్డు తాడు తెగకుంటే ఏమౌతుంది? ఈనాటి విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “బొడ్డు తాడు” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🙏 ఎప్పుడో చాల చిన్నప్పుడు ఆవు, పులి కథ విన్నాం మనందరం. మంద నుంచి తప్పిపోయిన ఆవు పులి కంట పడుతుంది. పులి అవును చంపి తింటానని బెదిరిస్తుంది. ప్రాణభయంతో వణికిపోయింది ఆవు. అయితే అంత భయంలో కూడా ఆవుకి తన బిడ్డ లేగ దూడ గుర్తుకు వస్తుంది. బిడ్డకు

విమల సాహితి ఎడిటోరియల్ 52 – బొడ్డు తాడు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 51 – మనిషి, జంతువు సమానమా?

మనిషిని జంతువు నుంచి వేరు చేసి చూపేది ఏమిటి? విమల సాహితీ పత్రిక లో ఈ వారం నా సంపాదకీయ వ్యాసం “మనిషి -జంతువు” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. “ఆహార – నిద్రా – భయ – మైథునం చ సమానమేతత్పసుభిర్నరాణామ్ధర్మోహితేషామధికో విశేషో ధర్మేణ హీనా: పశు: సమానా:” ఆకలి, నిద్రా, కామం మనుషులకు, జంతువులకు ఒకే విధంగా ఉంటాయి. కానీ జంతువు నుండి మనిషిని వేరుచేసేది, జంతువులకంటే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది ధర్మం.

విమల సాహితి ఎడిటోరియల్ 51 – మనిషి, జంతువు సమానమా? Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 50 – రాముడినైనా, అల్లానైనా కీర్తిస్తూ కూర్చుంటామా?

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నేను రాసిన సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.దేవుళ్ళందరినీ కీర్తిస్తూ కూర్చుంటామా..? ఒక్క రోజు తేడాలో ఒకదానితర్వాత ఒకటి వచ్చినంత వేగంగా వెళ్లిపోయాయి ఉగాది, రంజాన్ పండుగలు. ఆ తర్వాత శ్రీరామ నవమి వచ్చి వెళ్ళింది. అసలు పండుగలు ఎందుకు? పండుగలు మనకి ఏం చెప్తున్నాయి? పండుగల పరమార్ధం ఏమిటి? కొన్ని దశాబ్దాల ముందు ఏదైనా పండుగ వస్తోందంటే ఊరు ఊరందరికీ చేతినిండా పని.

విమల సాహితి ఎడిటోరియల్ 50 – రాముడినైనా, అల్లానైనా కీర్తిస్తూ కూర్చుంటామా? Read More »

ప్రేమలు

నేను గొప్ప నేనే గొప్పని విర్రవీగుతారు.. చిన్న కష్టానికే ఓర్వలేక కుదేలయిపోతారు.. కులమతాల కుళ్ళులో జలగల్లా పొర్లుతుంటారు.. ఎవరో పట్టించుకోలేదని ప్రేమకోసం దేబిరిస్తూ ఉంటారు.. స్వార్ధాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ ఉంటారు.. విజ్ఞానపు ఫలాలనెన్నింటినో చేజిక్కించుకుంటారు.. ఆధునిక వసతులనెన్నిటినో అందిపుచ్చుకుంటారు.. డబ్బు జబ్బు చేసి నానా యాతనలు పడుతుంటారు.. ఎదిగిన బిడ్డలకు వీసా రెక్కలు కట్టి లోహ విహంగం ఎక్కించేస్తారు.. డాలర్లు బంగారు బిస్కెట్లు కడుపాకలి తీర్చవని తెలిసి ఒంటరితనాన్ని నిందిస్తూ ఉంటారు.. నడుమొంచి పనిచేయక రాని

ప్రేమలు Read More »