ఇచ్చుటలోని ఆనందం
నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “ఇచుటలోని ఆనందం” జనవరి 2019 “ఉషోదయ వెలుగు” పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————– రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా, పొద్దున లేచేసరికి ఏడు గంటలయ్యింది. అలా నిద్ర కళ్ళతోనే నడుస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ వైపు చూచి ఉలిక్కిపడ్డాను. టేబుల్ మీద పెద్ద సైజు పుల్లారెడ్డి స్వీట్ల ప్యాకెట్టు దర్శనమిచ్చింది. రారమ్మంటూ ఊరిస్తూ.. ఓహో అప్పుడే మొదలైందన్నమాట, పండుగ రోజుల్లో మా […]