Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

విమల సాహితి ఎడిటోరియల్ 70 – న్యాయదేవత కళ్ళు తెరిచింది

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం ” న్యాయ దేవత కళ్ళు తెరిచింది” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. “న్యాయదేవతకు కన్నులు తెరచే ధర్మ దేవతను నేనేరా- పేద కడుపులా ఆకలిమంటకు అన్నదాతనై వస్తారా – దోపిడి రాజ్యం..దొంగ ప్రభత్వం నేల కూల్చకా తప్పదురా” ఆహా..ఎంత అద్భుతమైన చరణాలు. ఈ పాట విన్నవారి హృదయం పులకరించిపోతుంది. దేశం మీద, దేశ ప్రజల మీదా అమాంతం భక్తి పెరిగిపోతుంది. దేశ న్యాయ […]

విమల సాహితి ఎడిటోరియల్ 70 – న్యాయదేవత కళ్ళు తెరిచింది Read More »

ఆ రెండు దీపాలే!

సారంగ పత్రికలో ప్రచురితం అయిన “ఆ రెండు దీపాలే” కవిత ఇక్కడ మీకోసం. శ్రీ అఫ్సర్ మొహమ్మద్ గారికి, శ్రీ సుధామ గారికి ధన్యవాదాలతో.. ఎర్రటి బొట్టు బిళ్ళ లాంటి టపాసను నట్టులో పెట్టి నేలకేసి కొడితే పట్ మని పేలే నేలటపాసా నా బాల్యం పక్కింటి భవంతి వాళ్ళు చిచ్చుబుడ్లు కాలిస్తే చార్మినార్ సిగరెట్టు పెట్టిలోని తగరపు వెండి కాగితాన్ని కాల్చి చిరచిరలాడే శబ్దంతో మండే ఎర్రటి వెలుగే నా దీపావళి చిచ్చుబుడ్డి ఏడాదంతా చింతకాయలు

ఆ రెండు దీపాలే! Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 69 – చెరకు తీపి – చేదు విషం

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “చెరుకు తీపి – చేదు విషం” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. ఈమధ్యన ఒక ప్రముఖ సాహితీవేత్తలు తమ అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. ఎవరో ఒక కథా రచయిత వీరికి పిడిఎఫ్ లో తను రాసిన కథను పంపి, ఆ కథ ఎలా ఉంది చదివి చెప్పమని వారిని పదేపదే ఫోన్ చేసి అడిగారట. అనేక పనుల ఒత్తిడి వల్ల కథని చదవలేకపోతే,

విమల సాహితి ఎడిటోరియల్ 69 – చెరకు తీపి – చేదు విషం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 68 – అనువాద సాహిత్యం అనుసరణీయమేనా ?

అనువాదకుల లిస్ట్ చాంతాడంత ఉంది తెలుగులో. కానీ తెలుగు భాష లోని సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించేవారు వారు మాత్రం కరువైనారు. తెలుగు సాహిత్యానికి ఎందుకీ దుస్థితి. ఈ నాటి విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. మన ఇంటి మంచి కూర ఎంత రుచిగా ఉన్నా పొరుగింటి పుల్లకూర మీదే మక్కువ ఎక్కువ’ ఈ నానుడి అందరికీ తెలిసినదే. మనవాళ్ళు ఎన్ని విజయాలు సాధించినా, మనలో

విమల సాహితి ఎడిటోరియల్ 68 – అనువాద సాహిత్యం అనుసరణీయమేనా ? Read More »

పిరికి మందు

ఈనాటి ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం స్నేహ లో నేను రాసిన బాలల కథ ” పిరికి మందు” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. సాయంత్రం నాలుగయింది. చివరి పీరియడ్ కావడంతో రెండవ తరగతి క్లాస్ టీచర్ సుమతి పిల్లలకి హోంవర్క్ బోర్డు మీద రాసి, అందరినీ పుస్తకంలో ఎక్కించుకోమంది. వర్షాకాలం కావడంతో నాలుగు గంటలకే చిరు చీకట్లు కమ్ముకున్నాయి. స్కూల్ చుట్టూ ఉన్న చెట్ల నుంచి చల్లటి గాలులు తరగతి గదిలోకి వ్యాపిస్తున్నాయి. నల్లటి

పిరికి మందు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 67 – సాహిత్యమా – వ్యాపారమా

ఈనాటి విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం ” సాహిత్యమా – వ్యాపారమా ” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. ఓ పిల్ల తెమ్మెర మేనిని తాకినప్పుడు మనసు పరవశించో, కళ్ళ ముందు జరిగిన అన్యాయం హృదయాన్ని ముక్కలు చేసినప్పుడో, మోసమో, ద్రోహమో భరించలేక గుండె లోతుల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలైనప్పుడో, ఓ కవి అంతరంగంలో కవితాక్షరాలు పురుడు పోసుకుంటాయి. ఓ కథకుని మదిలో వస్తుశిల్పాలు పోటీపడి కథని నడిపిస్తాయి. ఆ ప్రాచీన కవులు

విమల సాహితి ఎడిటోరియల్ 67 – సాహిత్యమా – వ్యాపారమా Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 66 – అఖండ భారతం – అ’మృత’ భారతం

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం ” అఖండ భారతం- అ ‘ మృత ‘ భారతం ” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. మూడు దిక్కులా నీటి వనరులు, నాలుగవ దిక్కున పర్వత కనుమలు మధ్యన వెలిసిన విశాలమైన ద్వీపకల్పం మన అఖండ భారతం. ఎన్నో ప్రాంతాలు. మరెన్నో కులాలు, మతాలు, సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు అనుసరించే ప్రజలతో, అపారమైన ప్రాకృతిక వనరులతో ఎన్నో శతాబ్దలుగా విలసిల్లుతూ, ఎందరో

విమల సాహితి ఎడిటోరియల్ 66 – అఖండ భారతం – అ’మృత’ భారతం Read More »

అందుకేనేమో

సముద్రం… కొందరికి వినోదం, కొందరికి విషాదం, మరి కొందరికి సముద్రమే జీవితం. విశాలాక్షి పత్రిక వారు నిర్వహించిన సముద్రం కథల పోటీ లో బహుమతి పొందిన నా కథ ‘ అందుకేనేమో’ లో సముద్రం ఎవరికి ఏమైంది చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. శ్రీ కోసూరు రత్నం గారికి, శ్రీఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో.. రాత్రంతా నిద్రలేదు. కళ్ళు ఉసముద్రం… కొందరికి వినోదం, కొందరికి విషాదం, మరి కొందరికి సముద్రమే జీవితం. విశాలాక్షి పత్రిక వారు

అందుకేనేమో Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 65 – 150 మిల్లీగ్రాముల దౌర్భాగ్యం

150 మిల్లీగ్రాముల దౌర్భాగ్యం. ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. ఏ చీకట్లలో కునారిల్లుతోంది దేశం? ఏ నికృష్టపు మృగనీడలు దేశాన్ని ఆవరించిఉన్నాయి? జరుగుతున్న సంఘటనలు తలచుకుంటుంటే రక్తం మరిగిపోతోంది. నిరాశ పెద్ద పాములా తలకు చుట్టుకుంటోంది. ఏమి చేయలేని నిస్సహాయత నిలువునా కూల్చేస్తోంది. భారత దేశం ప్రగతి పధంలో ఉంది. అభివృద్ధిని సాధించినది. సాంకేతికాభివృద్ధిలో ఎదురులేని విజేత అయింది. ఇవన్నీ ఉత్త మాటలు.

విమల సాహితి ఎడిటోరియల్ 65 – 150 మిల్లీగ్రాముల దౌర్భాగ్యం Read More »

మనిషి’లో ‘ చెత్త

29-8-2018 నవ్య వారపత్రికలో నేను వ్రాసిన కవిత “మనిషి’లో ‘ చెత్త , ప్రచురితమైంది. కవిత ను ప్రచురించి ప్రోత్సహించిన శ్రీ జగన్నాథ శర్మ సార్ గారి కి చాలా చాలా ధన్యవాదాలు

మనిషి’లో ‘ చెత్త Read More »