పందేరం
మిత్రులకు సంక్రాతి కానుక. విశాలాంధ్ర పత్రికలో ఈ రోజు మీకోసం “పందేరం“. విశాలాంధ్ర సంపాదకులకు ధన్యవాదాలతో.. వరికుప్పల నడుమ వడివడిగా తిరుగుతూఈ తూరికి ఎన్ని పుట్ల ఒడ్లు వస్తాయోననిలెక్కలు గట్టే నాయన కళ్ళుచీకట్లో గడ్డివాముల చుట్టూ తిరిగేమిణుగురుల్లా ఆశగా మెరుస్తున్నాయి.. కుప్ప నూర్పిడి చేసి వొడ్లను తూర్పారబడుతూఅలిసిసొలిసిన కూలోళ్ళకు నడుమ నడుమతాటాకుల దొన్నెలో శాంతమ్మ అందించే కల్లుఅమృతపు చుక్కల్లా గొంతుల్లోకి దిగుతోంది.. ఊర్లోని పిలకాయలకోసం తెగలు తంపటేస్తూబురగుంజు తీస్తూ, తాటిముంజలు కొడుతూకరతుమ్మ పుల్లల మంటమీద తాటిపండ్లు కాలుస్తూవీరయ్య […]