Author: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “నల్ల సూరీడు”  జూలై 2019 లో “విశాలాక్షి” మాస పత్రికలో ప్రచురితం అయింది. “మతం కన్నా మానవత్వం మిన్న” అనే నేపధ్యం లో నా కళ్ళ ముందు జరిగిన సంఘటనలను కథగా మలిచాను. ఈ కథకి “మక్కెన రామ సుబ్బయ్య స్మారక & విశాలాక్షి సాహితీ మాస పత్రిక” నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి ని పొందాను. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ————————————————————————————————————————– సూరీడు నల్లగా ఉంటాడా ! నింగిలోని సూరీడు ఎప్పుడైనా ముసురు పట్టినప్పుడు మబ్బుల వెనుక దాగి, గ్రహణం పట్టినప్పుడు ఆ కాస్త సమయంలో కనుమరుగై లోకాన్ని చీకటి మయం చేస్తాడు. కానీ, తాను ఎప్పుడూ నల్లబడడు . వేడి మి,వెలుగులు ప్రసాదిస్తూ లోకాన్ని చైతన్యవంతం చేస్తాడు.  మరి ఈ నేలమీది సూరీడు! నికార్సయిన నల్లని దేహం కలవాడు. కాయకష్టం తో కండలు తిరిగిన,…

Read More

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “దత్తత ఫలం”  “ప్రియమైన రచయితల నూరు కథల సంకలనం” లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ————————————————————————————————————————— “అమ్మకు సీరియస్ గా ఉంది వెంటనే బయలుదేరండి” అని బావగారి వద్దనుంచి ఫోన్ రావటంతోనే ఆయన డీలా పడిపోయారు. ఓ ప్రక్క ఆయన్ను అనునయిస్తూనే కర్తవ్యాన్ని గుర్తెరిగిన నేను రైల్వే రిజర్వేషన్ కోసం చూసాను.ఏ ట్రైన్ లో దొరకలేదు. ఇక తప్పదని కేశినేని ట్రావల్స్ బస్ హైద్రాబాద్ నుంచి చెన్నైకి టికెట్స్ బుక్ చేశాను. మేం చెన్నైలో దిగి ఆసుపత్రికి వెళ్ళేసరికే మా వారి అన్నలు వదినలు, పిల్లలు అంతా వచ్చేసి ఉన్నారు. ఎప్పుడు ఏ వార్త డాక్టర్ దగ్గరనించి వస్తుందో అని అందరం విచారంగా ఉన్నాం. సాయంత్రం ఆరవుతుండగా డాక్టరు అందరినీ లోపలికి పిలిచారు. చివరి చూపుకోసం. అందరం మా అత్తగారి మంచం చుట్టూ చేరి విషణ్ణ…

Read More

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “డ్రైవరో నారాయణో హరి”  నవంబర్ 2019 “హ్యూమర్ టూన్స్” పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————– ఓర్నాయనో” గావుకేక పెట్టి కుర్చీ లోంచి ఇరగదీసుకుని కింద పడిపోయాడు పుల్లారావు. నేలమీదపడి దొర్లుతూ తిరిగి తిరిగి ఆగిపోయిన బొంగరంలా చేష్టలుడిగి, ఉలుకు పలుకు లేకుండా చచ్చిన శవం మాదిరి బిగుసుకుపోయాడు. పుల్లారావు అరచిన అరుపుకి భూ కోపం వచ్చినట్లుగా ఆఫీసంతా దద్దరిల్లి పోయి పనిచేసుకుంటున్న వారంతా బెంబేలెత్తిపోయి, పుల్లారావు చుట్టూ చేరారు. పుల్లారావుకు ఏమైందో ఎవరికీ అంతు పట్టలేదు.. మళ్లీ ఓసారి ‘ఓర్నాయనో’ అని అరచి నక్క బిగువుపట్టినట్లు కాళ్లు చేతులు కొట్టుకో సాగాడు. ఎవరో తాళాల గుత్తిని పుల్లారావు చేతిలో పెట్టారు. దానిని అతను విసిరి కొట్టడంతో అది వెళ్లి వాళ్ళ బాస్ బట్టతలకి టపీమని కొట్టుకొని బాస్ తలమీద క్షణాల్లో బొప్పికట్టింది. ఇక బాస్…

Read More

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “ఇచుటలోని ఆనందం”  జనవరి 2019 “ఉషోదయ వెలుగు” పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————– రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా, పొద్దున లేచేసరికి ఏడు గంటలయ్యింది. అలా నిద్ర కళ్ళతోనే నడుస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ వైపు చూచి ఉలిక్కిపడ్డాను. టేబుల్ మీద పెద్ద సైజు పుల్లారెడ్డి స్వీట్ల ప్యాకెట్టు దర్శనమిచ్చింది. రారమ్మంటూ ఊరిస్తూ.. ఓహో అప్పుడే మొదలైందన్నమాట, పండుగ రోజుల్లో మా ఇంటిపై జరిగే తియ్యని దాడి. కేలండర్ లో చూద్దునుగా నిన్న ‘ధన త్రయోదసి’ అని ఉంది. అదన్నమాట సంగతి. ఆ స్వీట్లు మా ఇంటి ఎదురు ఫ్లాట్ లో ఉండే మార్వాడీల అమ్మాయి డాలి’ తెచ్చి ఇచ్చుంటుంది. అనుకుని బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాడు.. నా శ్రీమతి ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాను. అయినా మనసు పేపర్లోని వార్తల మీదకు పోవడం లేదు.…

Read More

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “కృషి తో నాస్తి దుర్భిక్షం”  9-12-2018 తేదీన “సాక్షి ఫండే” లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————- అది ఆరవ తరగతి గది. ఏం అవినాష్ నిన్న నువ్వు స్కూల్ కి ఎందుకు రాలేదు?” అడిగాడు సైన్స్ టీచర్ సుధాకర్ అవినాష్ వంక చూస్తూ, “సార్… మరి మన ఊర్లోకి ‘ఆనంద బాబా’ వచ్చారు. కదా! ఆయన్ని చూడ్డానికి మా గల్లీలో వాళ్లంతా వెళ్తుంటే… మా అమ్మానాన్నా నన్ను కూడా తీసుకెళ్లారు సార్!” అన్నాడు అవినాష్. “అవునా! అయితే నీకు పనేముంది. ఆ బాబా తో” అడిగాడు సుధాకర్ సార్ “సార్ మరేమో ‘ఆనంద బాబా’ చాలా మహి మలు కలిగినవాడట. ఆయన మంత్రం చదివి తాయత్తు కడితే… ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుం దట. అందుకే నేను కూడా తాయత్తు కట్టించుకోవడా నికి వెళ్లాను”…

Read More

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “మీ టూ”  19-12-2018 తేదీన “నవ్య ” వార పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————— జ్వాలా, తలనొప్పిగా ఉంది. కాస్త టీ పెట్టి ఇవ్వు” అంటూ ఇంట్లోకి వస్తూనే కుర్చీలో కూర్చుని తలపట్టుకున్నాడు శ్రీధర్ టీ చేతికందిస్తూ, ‘అయితే వెళ్ళినపని కాలేదన్నమాట. ఎక్కడా డబ్బు దొరకలేదాండీ” అంది జ్వాల. “లేదు జ్వాలా. యాభై వేలు కాదు కదా , కనీసం పదివేలు కూడా అప్పు పుట్టలేదు. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదు” అన్నాడు శ్రీధర్. జ్వాల, శ్రీధర్ ది ముచ్చటైన సంసారం. వారి పాప దివ్య. ఫోర్త్ క్లాస్. శ్రీధర్ చిన్న వ్యాపారిగా ప్రారంభమై క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. లాభాల బాటపట్టి ఓసొంత ఇల్లు కట్టుకున్నాడు. ఇక భవి ష్యత్తుకు డోకా లేదనుకుంటున్న తరుణంలో, ఓ అనుకోని కుదుపు, వ్యాపారంలో నష్టాలతో శ్రీధర్…

Read More

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “హృదయాలయం”  ఫిబ్రవరి 2019 లో “విశాలాక్షి” మాస పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————— స్వామియే అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప శరణం. వీనుల విందుగా అత్యంత శ్రావ్యంగా వినిపిస్తున్న అయ్యప్ప స్వామి భజన మంత్రమైన సినట్టు నిలబడిపోయింది రాగిణి. అక్కడికి దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి పూజమండపం నించి వినవచ్చే శరణు ఘోషకు వివశురాలై మండపం చెంతకు వెళ్ళి స్వామికి నమస్కరించుకుని భక్తి పారవశ్యంలో మునిగి, తేలుతూ అలలమీద తేలుతున్నట్టుగా ఇంటికొచ్చింది రాగిణి. అప్పుడే మండపంలో పూజ, భజన పూర్తయిందని గురుస్వామి చెప్పి అందరు స్వాములకీ అయ్యప్ప స్వామి ప్రసాదం పంచసాగాడు. ప్రసాదం తీసుకున్న స్వాములంతా ఇళ్ళకు మళ్ళారు. అందరూ స్వాములతో పాటు రాగిణి వాళ్ళ నాన్న గురుమూర్తి కూడా ఇంటికి వచ్చాడు తండ్రిని చూస్తునే నాన్న పూజ అయిపోయిందా? మీరు శబరిమలై కొండకు…

Read More

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “విజయ్ మహల్ రిక్షా సెంటర్”  06-10-2019 తేదీన “సాక్షి ఫండే”లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————– నెల్లూరులో రైలు కట్టకు తూర్పు వైపున ఉన్న విజయమహల్ సెంటర్ ఊరికి నడిబొడ్డు. రైలు గేటు తూర్పు పక్కన విజయమహల్ సెంటర్లో నాలుగు రోడ్ల కూడలిలో తూర్పు, దక్షిణ మూలను అనుకొనే మా ఇల్లు ఉండేది. మా ఇంటిముందు చాల పెద్ద జాగా ఉండేది. ఆ జాగాలో చాలామంది రిక్షా వాళ్ళు రాత్రి పూట బాడుగలు అయిపోయాక వాళ్ళ రిక్షాలను పెట్టుకొని విశ్రాంతి తీసుకునేవాళ్ళు. రోజూ వాళ్ళు ఆ తావునే ఉండడంతో ఆ తావుకు ‘విజయమహల్ రిక్షా సెంటర్ అనే పేరు వచ్చింది. దసరా వస్తే మా రిక్షా వాళ్ళు అందరూ నవరాత్రులలో బాడుగలు మానేసి దసరా వేషాలు కట్టి నాలుగు రాళ్లు సులభంగా సంపాదించుకునే వాళ్ళు. నెల్లూరులో…

Read More

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “వ్యాప్తి”  09-06-2019 తేదీన “సాక్షి ఫండే ”లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.   ————————————————————————————————————————– వేపచెట్టు క్రింద పిల్లలకు పాఠం చెబుతున్న జోసెఫ్ మాస్టర్ దగ్గరకు వచ్చిచేతులు కట్టుకుని నిల్చున్నారు యాదయ్య,రంగి. వాళ్ళ కొడుకు వెంకటేసు కూడా ఆ చెట్టు క్రిందే కూర్చుని సార్ చెప్పే పాఠం వింటున్నాడు. యాదయ్య చేతులు జోడించి “సారు,తమరు మా వెంకటేసు చేత అదేదో పరిచ్చ రాపిచ్చారు కదా,ఆడు పాసయినాడు, పైచదువుల కోసం ఆణ్ణి పట్నం పంపుతామన్నారు కదా, కానీ ఆడి అమ్మ ఒప్పుకోవటం లేదు. పిల్లోడిని ఇడిచి ఉండలేనంటా ఒకటే ఏడుపు సారు. తమరు చెప్పండి  రంగికి అన్నాడు యాదయ్య.రంగిని చూసి జోసెఫ్ సారు” చూడు రంగమ్మ ఈ  వేపచెట్టు క్రింద దాని నీడలోనే దాని మొలకలు చాలా ఉన్నాయి కదా.అవన్నీ పెద్ద చెట్టు నీడన ఉన్నందున వాటికి…

Read More

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “తప్పటడుగు”  జులై 2019 లో “నెచ్చెలి” వెబ్ మాస పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ——————————————————————————————————————————- “నీతా! బంటి, రీతూ రెడీనా? వాళ్ళ స్కూల్ బస్ వచ్చింది . పిల్లలను పంపు” అన్నాడు అరవింద్ పేపర్ లో తలదూర్చి. “ఆ రడీ అయ్యారు” అంటూనే బంటీ,రీతూల భుజాలకి బ్యాగ్ లు తగిలించి చేతికి చిన్న లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఉండే బాస్కెట్లను అందించింది నిఖిత. ఓకే డాడీ, మామ్ టాటా అంటూ స్కూల్ బస్ ఎక్కేసారు ఇద్దరు. “నీతా నేను కూడా ఈ రోజు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి”అన్నాడు అరవింద్ షర్టు వేసుకుంటూ.”అరవింద్ రేపు శనివారం బంటీ వాళ్ళ స్కూల్ లో మీటింగ్ ఉందట. వాళ్ళ మేడం ఫోన్ చేసారు. పేరెంట్స్ తప్పకుండా అటెండ్ అవ్వాలట, మీరు వస్తారుగా అంది”అరవింద్ ఏమంటాడో అన్నట్టు…

Read More