Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

విజ్ఞాన వని – నల్ల సూరీడు సమీక్ష

“విజ్ఞాన వని”సైన్స్ విశేషాలతో కూడిన పత్రిక. “నల్ల సూరీడు” అస్పృశ్యతని నిరసించే సామాజిక కథ. సైన్స్ పత్రికలో సామాజిక కథ. ఓ సైన్స్ టీచర్ గా, రచయిత్రి గా ఇంతకంటే ఆనందం ఏముంటుంది నాకు. కథ తో పాటు “నల్ల సూరీడు” సంపుటి మీద శాస్త్రీయ పద్దతిలో రాసినట్లున్న సమీక్ష. జులై నెల విజ్ఞాన వని మాసపత్రికలో “నల్ల సూరీడు” సమీక్షను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపాలని కోరుకుంటూ.. సమీక్షని రాసిన ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య […]

విజ్ఞాన వని – నల్ల సూరీడు సమీక్ష Read More »

ఆరోగ్య యోగం..అందరికీ అందాల్సిన ఫలం – సంపాదకీయం 4

విమల సాహితీ నాలుగో వారం విజయవంతంగా మీ ముందుకు విందు భోజనం తెచ్చిపెట్టింది. ఆస్వాదించడమే మీ వంతు.. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతలను విస్మరించకూడదు అని మన రాజ్యాంగం చెపుతోంది. అందరూ ఆరోగ్యం కలిగి ఉండడం మన హక్కు అనుకుంటే, ఆరోగ్యం ని పొందడం కోసం మన వంతుగా మనం ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నాం అనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న.పక్క వారిని పలకరించడానికి కూడా సమయం లేని బిజీ లైఫ్. ఉరుకుల పరుగుల ఉద్యోగాలు. ఏ

ఆరోగ్య యోగం..అందరికీ అందాల్సిన ఫలం – సంపాదకీయం 4 Read More »

“ఓ వివస్త్రా… నీకు వందనం ! – సంపాదకీయం 3

“చీరలోని గొప్పతనం తెలుసుకో..చీర కట్టి ఆడతనం పెంచుకో ” అన్నారు సినీ కవి చంద్రబోస్. మరి ఆ చీరనే అందరి ముందరే విప్పేసి ఆడతనాన్ని వదిలేసి వివస్త్ర అయితే..? ఆడవాళ్ళ చీరలను వాళ్ళు స్నానం చేస్తుండగా ఎత్తుకు పోయి దాచేసే కొంటెతనాన్ని, ఇంకో సందర్భంలో ఓ స్త్రీ మానాన్ని రక్షించడానికి అంతం లేని ఓ పెద్ద చీరను సృష్టించడాన్ని హీరోయిజంగా, దైవత్వంగా ఉటంకించిన పురాణ దృష్టాంతాలు ఉన్నాయి. మరి తనకుతాను వివస్త్రగా మారిన ఈ మహిళను మనం

“ఓ వివస్త్రా… నీకు వందనం ! – సంపాదకీయం 3 Read More »

వేధింపులపై కోర్టు తీర్పు హర్షణీయం

శుభోదయం. ఈ వారం “విమల సాహితీ ” మీ కోసం సర్వాంగ సుందరంగా మిమ్ములను అలరించడానికి మీ ముందుకు వచ్చేసింది. నిప్పు లాంటి నిజాలు, ఆలోచింపచేసే వ్యాసాలు, హృదయాన్ని ఆహ్లాదపరిచే కవితలు, కళ్ళు చెమ్మగిల్లించే కథలు, చవలలనిపించే సమీక్షలు ఇంకా ఎన్నో విషయాలతో ఈ ఆదివారం మీ కోసం ఇస్తున్న అక్షర కానుక ఈ విమల సాహితీ. పత్రిక ఆసాంతం చదివి మీ విలువైన అభిప్రాయాలు తెలపాలని కోరుకుంటూ.. దీనిలో అనేకానేక లైంగిక వివక్షలపై నా సంపాదకీయ

వేధింపులపై కోర్టు తీర్పు హర్షణీయం Read More »

రెండరటిపళ్ళు

కాస్త పెద్ద కథ అయినా “రెండరటి పళ్ళ” రహస్యం తెలియాలంటే ఈ నెల [జూన్] సాహితి ప్రస్థానం లో ప్రచురింపబడిన నా కథ “రెండరటి పళ్ళు” చదవాల్సిందే. ఇక్కడ పుస్తకంలోని పేజీలు పెట్టాను. టెక్స్ట్ మెసేజ్ రూపంలో చదవాలంటే నా పర్సనల్ వెబ్సైటు లింక్ ఇక్కడ ఇస్తున్నాను. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటూ.. దిండుకి ముఖం ఆనించి బోర్లా పడుకున్నా. ఊపిరి ఆగిపోయినట్లయింది. వెనక్కి తిరిగి వెల్లికిలా పడుకున్నా..ఊహు.. నిద్ర కాదు కదా..కంటి

రెండరటిపళ్ళు Read More »

దిగులు వర్ణం

రంగులు చాల ఉన్నాయి ప్రకృతిలో. ఈ దిగులు వర్ణం ఏమంటుందో చూడండి. “బహుళ త్రైమాసిక పత్రిక” లో ప్రచురితం అయిన నా కవిత “దిగులు వర్ణం”. జ్వలిత మేడం గారికి ధన్యవాదాలతో.. ” దిగులు వర్ణం” చదివి మీ దానికి మీరు ఏం చెప్తారో అడుగుతోంది. ఆరంజ్ రంగంటే ప్రాణమప్పుడువెన్నులో వణుకిప్పుడు ప్రాణంతీస్తుందనికాషాయపు విద్వేషాన్ని పులిమేశారు దానికి గులాబీ పసుపు రంగుల్లో ఎంత అందముందనిచూడడానికే భయమిప్పుడుపార్టీల అడ్డు తెరని దించారు వాటిమీద ఎంత వింతైనవర్ణమని నలుపుదానికీ అంటగట్టారు

దిగులు వర్ణం Read More »

విరిగిన తల

విరిగిన తల. ఎవరి తల ..? ఎందుకు విరిగింది..? తెలుసుకోవాలంటే ఈ రోజు “ప్రజాశక్తి ఆదివారం అనుభందం స్నేహ పత్రిక” లో ప్రచురితం అయిన కథ “విరిగిన తల” చదవాల్సిందే. “ప్రజాశక్తి ” సంపాదకులకు ధన్యవాదాలతో.. విరిగిన తల చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపాలని కోరుతూ.. డుగు డుగు డుగు డుర్ డుర్.. డుర్ర్ర్..‘ కీ ‘ ఇచ్చి వదిలిన స్కూటర్ బొమ్మ ఇల్లంతా పరుగులు తీస్తోంది. బొమ్మ వెనుకే పరుగు తీస్తున్నాడు ఐదేళ్ళ చిన్నారి

విరిగిన తల Read More »

మమతల దారుల్లో

తెలుగు జ్యోతి పత్రిక ఏప్రిల్ నెలలో ఉగాది కవితల పోటీల్లో ఎన్నుకోబడిన నా కవిత “మమతల దారుల్లో”. తెలుగు జ్యోతి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో🌹🙏 కోటి ఆశలతో మాఇంట్లో అడుగుపెట్టిన మా కూతురు లాంటి కోడలు ” సాయి సాహిత్య” కి ఈ కవిత అంకితం ప్రేమతో ❤️❤️మమతల దారుల్లో ప్రయాణం కొత్తమజిలీకిఇదివరకెన్నడూ చూడని దారిఆశలు దీర్ఘాలైభయాలు హ్రస్వాలైముందుకు సాగే పయనంఅలుపొచ్చి ఆగిపోతే సేదదీరడానికిఅమ్మ పాడిన జోలపాటనిగుండె ఊయల్లో దాచుకుని వెళుతున్నా..బాటలో పరాకుగా అనిపిస్తేఉల్లాసం పొందడానికిచెల్లి తమ్ముడుతో

మమతల దారుల్లో Read More »

నల్ల సూరీడు సమీక్ష – 1

సాహితీ పెద్దలు శ్రీ విహారి గారు సృజన ప్రియ పత్రిక లో “నల్ల సూరీడు” ని వెలిగించిన అధ్బుతం. సృజయ ప్రియ సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు Wilson Raoగారికి, Kommavarapu గారికి, గురువులు విహారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో 🙏🌹 సృజయ ప్రియ ప్రధాన సంపాదకులు, నాకు అత్యంత ప్రియ మిత్రులు శ్రీ నీలం దయానంద రాజు గారి ఆకస్మిక మరణం అత్యంత విషాదకరం. వారికి కన్నీటి నివాళులు 🙏🙏 అనుభూతి కేంద్రంగా వస్తు

నల్ల సూరీడు సమీక్ష – 1 Read More »

యుద్ధం

విద్యార్థులు విజయం సాధించాల్సింది దేనిమీద..? మే నెల “కస్తూరి మాసపత్రిక” లో నా కథ “యుద్ధం”. కస్తూరి మాసపత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో. “యుద్ధం ” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపగోరుతూ… 🙏🙏 మనం తరచుగా విజయాన్ని అకడమిక్ స్కోర్‌లతో సమానం చేసే ప్రపంచంలో, మార్కులు జీవితం ఒకటె అనుకునే అనాగరిక ప్రపంచంలో ఉన్నాము . రెండు విభిన్న కథనాలు నా దృష్టికి వచ్చాయి. ఒక విద్యార్థి, 1,000కి 892 స్కోర్‌ను సాధించినప్పటికీ, విషాదకరంగా ఆత్మన్యూనతతో తన

యుద్ధం Read More »