*రోహిణీ వంజారి కవితా సంపుటి ” దిగులు వర్ణం”.!!

రోహిణి గారి స్వస్థలం నెల్లూరు.చదువుసంధ్యఅంతా

నెల్లూరు,విద్యానగర్లలో జరిగింది.ప్రస్తుతంహైదరాబా

ద్లో వుంటున్నారు.చక్కని కథలురాస్తారు.అప్పుడప్పు

డు కవిత్వం కూడారాస్తారు.ఇప్పటికిరెండుకథాసంపు

టాలొచ్చాయి(నల్లసూరీడు కథలు,విజయమోహన్ సెంటర్ కథలు) ఇప్పుడు ఈ దిగులు వర్ణం తొలి కవి

తా సంపుటి వెలువడింది.

ఈ కవితా సంపుటి లో మొత్తం 59 కవిత

లున్నాయి.

*మానవత్వపు వర్ణం..!!

“రక్తం గ్రూపులు నాలుగేనట

A, B, AB, O అని

ఏ గ్రూపు రక్తం అయినా దాని వర్ణం ఎరుపేనట ఎక్క

డైనా, ఎవరైనా విశ్వదాతలు, విశ్వ గ్రహీతలు కావ

చ్చునట..రక్తానికి కులం, మతం, ప్రాంతమని భేదాలు లేవట

తాను నిత్యజీవన స్రవంతిలా

జీవనదిలా యుగాలుగా మనుషుల్లో

క్షణమాత్రకాలం కూడా విరామమెరుగక

ప్రవహిస్తూ కొన ఊపిరితో ఉన్న దేహానికి

ప్రాణభిక్ష పడుతుంది….

కానీ మనిషి

కులమత విద్వేషాలు పెంచుకుని,

అంతరంగాన్ని కదనరంగంగా మార్చుకుని

రుధిర తర్పణాలు విడుస్తున్నాడు….

మనలో ప్రవహించే జీవనదికి లేని బేధాలు

మనకెందుకో మరి.

యుగాలు మారినా తరాలు మారినా,

మారని మనిషి అంతరంగాన్ని మార్చే

మానవత్వపు రక్తవర్ణమా నువ్వెక్కడ, ఎక్కడ?

*రోహిణి..

“రక్తానికి కులం, మతం లేవు..మానవత్వానికి వర్ణం

లేదు..డాక్టర్లు రక్తాన్ని నాలుగు గ్రూపులుగా విడగొట్టా

రు – A, B, AB, O. కానీ ఏ గ్రూపు రక్తం అయినా.. రంగు ఎరుపే. మనం మనుషులను వేల గ్రూపులుగా విడిపో

యాం.కులం, మతం, ప్రాంతం, భాష. కానీ లోపల ప్రవహించేది మాత్రం అదే వర్ణం. అదేఎరుపు.

“తాను నిత్యజీవన స్రవంతిలా జీవనదిలా యుగాలు

గా మనుషుల్లో క్షణమాత్రకాలం కూడా విరామమెరు

గక ప్రవహిస్తూ..”రక్తం అనేది ఓ నది.అది ఆగిపోతే

మనిషి ఆగిపోతాడు. అది యుగాలుగా విరామం.. లేకుండా ప్రవహిస్తోంది. మీ మొదటి కవిత మూసీ

నది గురించి, ఈ కవిత రక్తమనే నది గురించి.మూసీ

లో మురికి చేరింది అన్నారు, రక్తమనే నదిలో‌ విద్వే

షం చేరింది అంటున్నారు కవయిత్రి.‌

మనలో ప్రవహించే జీవనదికి లేని భేదాలు మన

కెందుకో మరి”? కలిసి ప్రవహించే నదికి భేదం లేదు, మనుషుల మధ్య మాత్రమఘ భేదం.

“మారని మనిషి అంతరంగాన్ని మార్చే మానవ

త్వపు రక్తవర్ణమా నువ్వెక్కడ?.ఇది వెతుకులాట.

మానవత్వపు రంగు ఎక్కడ అన్న వెతుకులాట..

2*

“కెజియా వచ్చి ప్రార్థన చేసిన

కేకు తెచ్చి ఇచ్చింది….

రంజాన్ నాడు రజియా వచ్చి

షీర్ కుర్మారుచి చూడమంది

దసరా పండుగ నాడు

విజయ వచ్చి అమ్మ వారి

ప్రసాదం చక్కెర పొంగలి

తెచ్చి నోట్లో పెట్టింది…..

అన్నింటిలోనూ ఒకటే

తియ్యదనం……

అదే మనందరినీ కలిపే

మానవత్వం……..

అనురాగపు వెల్లువలో

అందరం తడిసి

మురిసే వేళ,

మనకెందుకీ కులమతాల గోల ? “!!

*తియ్యదనం.!!

ఈ కవితలోసర్వమత‌సారాన్నితియ్యగాఅందించారు

రోహిణి గారుఅన్నిమతాలూమంచివే.అందరూమను

షులే అయినప్పుడువాళ్ళుఆచరించేమతాలుమాత్రం

ఎందుకు వేరు వేరవుతాయి.‌ఒక్కో మతానికి ఒక్కో..

ఆచారం,సంప్రదాయం వుండొచ్చు..కానీ,ఏ మతం

కూడా ఇంకో మతాన్ని ద్వేషించమనో,వేరుచేసిచూడ

మని చెప్పనే చెప్పదు.అయినా మనుషులు వాళ్ళ స్వార్ధానికి మతాలు మధ్య చిచ్చుపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారు.!

రోహిణి గారు..‌ఈ కవితలో అన్ని మతాలను.సమా

నంగా చూపారు.అన్నిమతాల్లోని తీపినిపంచారు.

ఈ పోస్టింగ్ చదవగానే నోరంతా తీపైంది.!మనసు

తేలిక పడింది.

ఇదో దృశ్యాత్మక సందర్భం .”కెజియా వచ్చి ప్రార్థన

చేసిన కేకు తెచ్చి ఇచ్చింది.నోరంతాతీపైంది.కెజియా క్రిస్టియన్..

రంజాన్ నాడు రజియా వచ్చి షీర్ కుర్మారుచి చూడ

మంది.నోట్లో వేసుకోగానేతీపే తీపి..రజియా ముస్లిం.

దసరా పండుగ నాడు విజయ వచ్చి అమ్మ వారి… ప్రసాదం చక్కెర పొంగలితెచ్చి నోట్లోపెట్టింది..ఇంకే

ముంది నోరు తీపైంది.విజయ…హిందువు..!!

ఈ మూడు పదార్ధాలు మూడు మతాలకుప్రతీకలు..

మూడు సంస్కృతులకు చిహ్నాలు.ఈ మూడు పదా

ర్ధాలు వేరువేరైనా, మూడింటిలోనూ కామన్ గా అని

పించింది ఒకటే రుచి.అది..తీపి(sweet )అన్నింటి

లోనూ ఒకటే..అది తియ్యదనం.అలాగే మూడు మతాల..సారం కూడా..ఒకటే..అదే ‌మనందరినీ… కలిపే”మానవత్వం” అంటారు రోహిణి..

అయినా…‌

మనుషులంతా అనురాగపు వెల్లువలో తడిసి

మురిసే వేళ, మనకెందుకీ కులమతాల గోల ?

అన్నది రోహిణి ప్రశ్న..?

దీనికి సమాధానం…ఏమంటే..ఈ కులమతాల

గోల అక్కర్లేదని అన్యాపదేశంగా చెప్పకనే చెప్పా

రు..రోహిణి వంజరి..!!

3*

*బొట్టు”మంచిదే…!!

ఓ నెత్తుటి బొట్టు

కోట్ల కణాలతో యుద్ధం చేసి

గెలిచి నీకు జన్మనిస్తుంది

ఓ వాన నీటి బొట్టు

బీడు పడ్డ రైతన్న కళ్ళల్లో

పన్నీటి జల్లు కురిపిస్తుంది

ఓ తేనేటి బొట్టు

శ్రమజీవి దేహపు

చెమట బొట్లలో కలసి

ఇంధనమైశక్తినిస్తుంది

ఓ కన్నీటి బొట్టు

మనసులో ఉప్పొంగే

వేదనాసాగరానికి

సాంత్వననిస్తుంది

భృకుటిపై సింధూరపు బొట్టు

కుండలిని తాకి

నీలో విజ్ఞతను మేల్కొలుపుతుంది

బొట్టు మంచిదే..”

*రోహిణి..!!

బొట్టు మంచిదే అంటున్నారురోహిణి.. ఐదు బొట్ల

ను వరుసగా పెడుతున్నారు అన్నీ చిన్నవే, కానీ

అన్నీ జీవం పోసేవేకావడం గమనార్హం.

1.నెత్తుటి బొట్టు..

కోట్ల కణాలతో యుద్ధం చేసి గెలుస్తుంది.

పుట్టుక.

2.వాన బొట్టు..

బీడు పడ్డ రైతు కళ్ళల్లో పన్నీరు..ఇక్కడ వర్షపు

బొట్టు బతుకు.

3.తేనె బొట్టు…చెమట బొట్లలో కలిసి శక్తి

నిస్తుంది. శ్రమ.

4.కన్నీటి బొట్టు..

వేదనాసాగరానికి సాంత్వన. ఇక్కడ కన్నీరు

కూడా ఒక ‘నాదం’!!

5.సింధూరపు బొట్టు..

కుండలిని తాకి విజ్ఞతను మేల్కొలుపుతుంది

జ్ఞానం.!

ఒక బొట్టుతో మొదలై ఒక బొట్టుతో ముగిసింది –

రక్తం నుండి సింధూరం వరకు. అంటే దేహం ..

నుండి ఆత్మ వరకు.

మీ మొదటి కవితలో “బిందె దింపితే ముందు నిట్టూ

ర్పులే పైకి వస్తాయి, ఆ తర్వాతే నీళ్లు” అన్నారు. అది కూడా బొట్టే. నీళ్ల బొట్టు ముందు నిట్టూర్పు బొట్టు.

రోహిణి గారి కవితలో బొట్టు ఒక్కోసారి విడిపో

తుంది, ఒక్కోసారి కలుపుతుంది, ఒక్కోసారి బతికి

స్తుంది.

ఈ ఐదు బొట్లలో మీకు అత్యంత ఇష్టమైన బొట్టు ఏది? నాకైతే..చెమట బొట్టులో కలిసే తేనె బొట్టు. ఎందుకంటే అది శ్రమను తీపిగా మారుస్తుంది.!!

4*

*ఆ ప్రేమ భాష..మౌనం.

“ఆమెకెపుడు నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదు

తన అడుగుల సవ్వడే నాకు హిందోళరాగం తన

నెప్పుడూ ఖరీదైన హోటల్కి తీసుకెళ్లలేదు

తనువండిన వంటలో ఏడో రుచినేదో కలిపేది

ఆ మధురమైన రుచి నాకు ఇంకెక్కడా దొరకలేదు

బహుశా

ఆ రుచి పేరు అనురాగమేమో

తనకెప్పుడు నేను గులాబీలు ఇవ్వలేదు

తన నవ్వులతోనే ఇల్లంతా రంగులద్దుకునేవి సాయంకాలమైతే చాలు తనచూపుల్ని

గుమ్మంలోనే వేలాడదీసేది

నన్ను చూడగానే తన కళ్లల్లో మెరుపులు

వాటితోనే రాత్రంతా వెలుగులు నింపేది

తనెప్పుడు నాకు ‘ఐ లవ్ యు’ అని చెప్పలేదు

నేను లేకుండా తన ఉనికి లేదంటుంది

తను లేకుండా నాకు బతుకు లేదంటాను

మేము ఇద్దరం ఆలూమగలం

మా ప్రేమ భాష మౌనం..”

*ఉనికి..

*రోహిణీ.

ఆలుమగలకు సంబంధించిన ఇంటి కథ ఇది..

ఆమెకెపుడు నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదు,

తన అడుగుల సవ్వడే నాకు హిందోళరాగం.

అదే ఇంట్లో నాదయోగం యోగం అంటోందామె.

ఈ కవితలో ఖరీదైనది ఏదీ లేదు. హోటల్ లేదు, గులాబీలు లేవు, ఐ లవ్ యూ లేదు. కానీ అన్నీ ఉన్నాయి.తను వండిన వంటలో ఏడో రుచి అది. అనురాగం. షడ్రుచులకు మించిన ఏడో అద్భుత

రుచి.

తన నవ్వులతోనే ఇల్లంతా రంగులు, తన చూపుల్ని గుమ్మంలోనే వేలాడదీసేది, తన కళ్లల్లో మెరుపులతో రాత్రంతా వెలుగులు.

తనెప్పుడు ఆమెకు ‘ఐ లవ్ యు’ అని చెప్పలేదు,

అయినా అతను లేకుండా తన ఉనికి లేదంటోం

దామె..ఇదే మౌనం. ప్రేమకు భాష అవసరం లేదు.

ఉనికే భాష.

ఈ కవితలోని ఇద్దరూ ఆలూమగలు. ఉనికికి

కూడా ఒక భాష ఉంటుంది, అదే మౌనం…

*రైతు బాధ..

ఈ సంపుటిలోని కవితల్లో వస్తు వైవిధ్య ముంది.

రైతులు గురించి రాసిన నేలతల్లి కవిత బాగుంది.

“నాగలి కర్రుతో..

నువ్వు నా గుండెను

చీల్చుతూ ఉంటే

పసిబిడ్డడు పాలుతాగుతూ

లేతపాదాలతో నా గుండెలమీద

తన్నినట్లు పరవశించి పోయాను..

ఇందులో వ్యక్తీకరణ కొత్తగా అనిపించింది…

అలాగే…మనిషి గురించి…(చీకటి దీపాలు)

“ఒకరికి మోదం

మరొకరికి ఖేదం

వెలుగుతున్న దీపాలు ఆర్పితేనే

ఒకరికి మనఃశాంతి

ఇంకా చీకటిలోనే బతకడం ఇష్టం వారికి

ప్రేమను ఆశించడం మూర్ఖత్వం

అయిపోతోందిప్పుడు

పెంచుకునే కుక్కపాటి విలువ చేయక

పోయే సాటిమనిషి”!!

ఇందులో మానవ నైజాన్ని చక్కగా వ్యక్తీ

కరించారు.

అభ్యుదయం కవితలో బాలకార్మికుల దీనస్థితిని వివరించిన తీరు బాగుంది..

ఆ పసివేళ్ళు యంత్రం కన్నా వేగంగా

అంట్ల గిన్నెలను తోమి శుభ్రం చేస్తున్నాయి

ఆ వేళ్ళు పట్టుకోవాల్సింది పుస్తకం కలమని

అక్కడ చెప్పేవారు ఎవరూ లేరు.”!!

రక్షించాల్సిన బాలకార్మిక చట్టాలన్నీ సంపన్నుల

చుట్టాలవుతుంటే..ఈ సమస్యకు పరిష్కారం…

ఎలా వుంటుందన్నది రోహిణి ప్రశ్న?

తప్పక చదవాల్సిన కవిత్వం..‌

*ఎ.రజాహుస్సేన్.‌

*హైదరాబాద్..

*దిగులు వర్ణం..కవితా సంపుటి

*పేజీలు..120..వారు.రూ..200/

*కాపీలకు.‌

రోహిణి వంజారి

కోకాపేట, హైదరాబాద్

ఫోన్.9000594630.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *