కవితలు

లక్ష్యం

“పైపైకెగరాలని ఉంది గాలిపటంలానింగి అంచులు తాకాలనుంది స్వేచ్ఛగాఅడొచ్చే ఏ దుశ్చక్తినైనా తృణీకరిస్తూవిజయతీరాలకు దూసుకు వెళ్ళాలనుందినిప్పులుచెరిగే అంతరీక్ష నౌకలాఎదురైయ్యే అవరోధాలను అధిగమిస్తూగెలుపు తలుపులు తెరవాలనుందిఉత్సాహానికి వారసురాలిగాగాలివాటానికి సుడులు తిరుగుతూధూళిలో కలిసే కాగితపు ముక్కలా కాకదృఢమైన వ్యక్తిత్వపు అస్థిత్వంతోకార్యాచరణకు పూనుకోవాలనుందిలక్ష్యాన్ని చేధిస్తూ వెళ్ళే క్షిపణిలాఎంత ఎత్తు ఎదిగినా విజయపు శిఖరం చేరుకున్నానేలమీది పునాదులను మరువకుండాకోసం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలనుందిఅలుపెరుగని తేనెటీగలా” రోహిణి వంజారి15-1-2023

లక్ష్యం Read More »

సుతిమెత్తని పరిమళం

పారిజాత పువ్వులంపగడపు వన్నె కాడలతోవెండి చందమామ రేకులతోముట్టుకుంటే చాలుచిన్నిపాప మేనులా సుతిమెత్తగామీ చేతివేళ్ళ కొనలకిదివ్యపరిమళాలు అద్దుతాము..సత్యభామ కోసం కృష్ణుడుదివి నుంచి భువికి తెచ్చినదేవలోక పుష్పాలు అంటారు కానీఆ దైవత్వాన్ని అంటగట్టకండి మాకుఆడపిల్లలను అమ్మవారు శక్తి స్వరూపిణిఅంటూనే కాలరాచిపారేసినట్లు..అచ్చంగా భువిలో మీకోసం పూచే కుసుమాలంసాయంత్రాలు రేకులనువిచ్చుకుంటాంవిరిసిరుల సుగంధాలను మీకందిస్తాంపొద్దున కి నేలరాలి పగడాల తివాచీనిచిక్కగా పరుస్తాం మీ కోసం..అప్పుడే పుట్టిన పసికందునుచేతుల్లోకి తీసుకున్నంత మృదువుగామమ్మల్ని మీ దోసిట్లోకి తీసుకోండివాసన చూసి నలిపిపారేయకండివావివరస చూడక ఆడదేహాన్ని చిదిమేసినట్లు..మేం వెదజల్లే పరిమళాలను

సుతిమెత్తని పరిమళం Read More »

శతకోటి వందనాలు

ప్రతిష్టాత్మకమైన “అమ్మకు అక్షర నైవేద్యం” కవితా సంకలనం లో చోటు చేసుకున్న నా కవిత ” శతకోటి వందనాలు”. శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారికి, శ్రీ ఉడతా రామకృష్ణ గారికి ధన్యవాదాలతో..🙏🌹 అమ్మకు వందనాలు. కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగోరుతూ..🙏🌹 ఆషాఢమాసాన అరుదెంచే సింహవాహినీశతకోటి వందనాలమ్మా నీకు…పల్లె అయినా, పట్టణమైనా, ఆలు బిడ్డలు తోడఅప్ప చెల్లెళ్ళ తోడ నీ దరికి చేరుతామమ్మాకరుణించవే మా అమ్మా మహంకాళీశతకోటి వందనాలమ్మా నీకు…శివ సత్తులు, పోతురాజు వెంటరాగానీకు బోనమెత్తుతానమ్మా..నా

శతకోటి వందనాలు Read More »

చీకటి దీపాలు

నేటినిజం పత్రికలో నా కవిత “చీకటిదీపాలు”. బైంసా దేవదాసుగారికి ధన్యవాదాలతో .. ఒకరికి మోదంమరొకరికి ఖేదంవెలుగుతున్న దీపాలు ఆర్పితేనేఒకరికి మన:శాంతిఇంకా చీకటిలోనే బతకడం ఇష్టం వారికిప్రేమను ఆశించడం మూర్కత్వం అయిపోతోందిప్పుడుపెంచుకునే కుక్కపాటి విలువ చేయకపోయే సాటిమనిషికాలకూట విషంకన్నా చేదని షీర్ కుర్మానిటోపీ గడ్డాలను చీదరించుకునే ద్వేషం ఒకరికి నరనరాల్లోఆత్మస్తుతి పరనిందా జీవన విధానమైంది మరొకరిలోఆడపిల్ల ఇష్టం మీద ముసుగు వేయడంమతాధికార దురహంకారం ఎల్లెడలా..బొట్లు గడ్డాలు ఆనవాలే పట్టలేనిశవాల గుట్టల్లో, సామూహిక దహనంలోఊపిరిల్లోకి దూరిన రాక్షసి దురాగతంఇంకా మరపుకి

చీకటి దీపాలు Read More »

దుఃఖపు వాగు మా నాయన

ఈ నెల “రైతు వాణి” మాస పత్రికలో నా కవిత “దుఃఖపు వాగు మా నాయన“. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపకోరుతూ.. కయ్య చివర గెనిమగట్టునవేపచెట్టు కింద యానాదన్న పిసికిన బంకమట్టితోనువ్వు ప్రతి ఏడాది స్వయంభులా వెలుస్తుంటేవిగ్నవినాయకుడవని టెంకాయకొట్టి నీకుతొలిమొక్కు తీర్చిన నాయన కళ్ళల్లో ఆశలుకల్లంలో పిడేటి కొట్టి రాల్చే ధాన్యపు రాశులతోపోటీపడుతున్నాయి.. ఏ రాత్రి ఏ వరదముంచుకొస్తుందో , ఏ పక్షులొచ్చి పంటతినేస్తాయో అని పొలం మధ్య మంచె మీదరెప్పకొట్టకుండా ఉండేలు తిప్పుకుంటూనిద్ర కాచిన

దుఃఖపు వాగు మా నాయన Read More »

చంద్రకాంత చెలి

సాయంత్రమైందని చంద్రకాంత చెంత చేరానుచెక్కిలి ఆనించి ఓ నవ్వు నవ్వానా.. మరింత పక్కున నవ్వాయి చంద్రకాంత పూలురేపొద్దునకి వాడిపోతారు అంత నవ్వెందుకుఅని ఉడుక్కున్న నాకు ఊసులెన్నో చెప్పాయవి.. అరపూటే మా జీవితం అయితే ఏంటంటమీలా కాదు మేము అంటూ గర్వంగా తలలూపాయి.. మీ మనుషులకే కదా బాధలు వేదనలుబంధాలు బంధనాలు వేతలు వేధింపులు.. విద్వేషపు కొట్లాటలు మోసపూరిత దుర్మార్గాలుతేనె పూసిన కత్తులు విషం నిండిన గొంతులు వందేళ్ళ బతుకు ఉన్నా అరక్షణమైనాతృప్తి లేని బతుకులు అందని వాటికోసంఆరాటాలు,

చంద్రకాంత చెలి Read More »

ఎవరో నీ స్నేహం వద్దన్నారని గుబులేలఎవరో నిన్ను ద్వేషించారని బాధ ఎందుకుమరెవరో నిన్ను చూసి అసూయపడ్డారనివిచారపడనేల ..మరెవరో నీ ఉన్నతిని ఓర్వలేరని చింత నీకేల..?ఇంకెరితోనో బంధం భారమని దిగులేల..?వాళ్ళెవరో నీగురించి ఏమనుకుంటే నీకేమి..అన్నీ పట్టించుకున్నావా.. నిన్ను నువ్వు కోల్పోయావేనీలో నువ్వు లేనప్పుడు ఇక మిగిలింది శూన్యమేపూలతో నువ్వెప్పుడైనా చెలిమి చేసావా..?ఏనాడైనా నిన్ను ద్వేషించాయా అవి..రంగులను నీ కళ్ళల్లో పులుముకోవద్దని అడ్డు చెప్తాయా పూలు.పరిమళాలను ఆస్వాదించవద్దని నీ నుంచి దూరంగా పోతాయా అవి..పూలతో ఓ సారి చెలిమి చేసి

Read More »

దీపం

ఈ రోజు నవతెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం “సోపతి” లో నా కవిత “దీపం”. చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపుతారు కదా..🌹❤ దీపమొకటి వెలిగించాలితిమిరాన్ని తరిమేసేందుకు.. ..దీపమంటే చమురు పోసివత్తివేసి వెలిగించడమే కాదుకదా..బతుకుబాటలో అడుగడుగునాదారిదీపాలు ఎన్నెన్నో వెలిగించాలి.. ప్రయత్న దీపమొకటి వెలిగించాలివిధి రాతను మార్చేందుకు.. మమతల దీపమొకటి వెలిగించాలిమతాల మత్తును వదిలించేందుకు.ప్రేమదీపమొకటి వెలిగించాలికులపు మెట్లు కూలగొట్టేందుకు..కరుణ దీపమొకటి వెలిగించాలిసాటిమనిషి కన్నీరు తుడిచేందుకు..జ్ఞానదీపమొకటి వెలిగించాలిఅజ్ఞానాంధకారాన్ని వెడలగొట్టేందుకు . ఆశా దీపమొకటి వెలిగించాలిఆకాశపు అంచులు అందుకోవడానికి..గెలుపు దీపమొకటి వెలిగించాలివిజయకేతనాన్ని

దీపం Read More »

ఆ రెండు దీపాలే!

సారంగ పత్రికలో ప్రచురితం అయిన “ఆ రెండు దీపాలే” కవిత ఇక్కడ మీకోసం. శ్రీ అఫ్సర్ మొహమ్మద్ గారికి, శ్రీ సుధామ గారికి ధన్యవాదాలతో..🧨✨🍬 ఎర్రటి బొట్టు బిళ్ళ లాంటి టపాసను నట్టులో పెట్టి నేలకేసి కొడితే పట్ మని పేలే నేలటపాసా నా బాల్యం పక్కింటి భవంతి వాళ్ళు చిచ్చుబుడ్లు కాలిస్తే చార్మినార్ సిగరెట్టు పెట్టిలోని తగరపు వెండి  కాగితాన్ని కాల్చి చిరచిరలాడే  శబ్దంతో మండే ఎర్రటి వెలుగే  నా దీపావళి  చిచ్చుబుడ్డి ఏడాదంతా  చింతకాయలు

ఆ రెండు దీపాలే! Read More »