కధలు

యుద్ధం

విజయ తీరం చేరాలంటే యుద్ధం తప్పనిసరా..? “జోర్దార్” పత్రికలో నా కథ “యుద్ధం”. సంపాదకులకు ధన్యవాదాలు.“యుద్ధం” కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్తారు కదూ..🙏🙏🌹🌹 సమాచారం అందిన వెంటనే ఆందోళనగా ఆసుపత్రికి బయలుదేరాడు కరుణాకర్ మాస్టారు. ఏం జరిగిందో తెలియక, ఆతృతగా వెళుతున్న ఆయనకు ట్రాఫిక్ జాం అడ్డు పడుతూ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తన ప్రియ శిష్యుడు గౌతమ్ కి ఏమైందో తెలియక అతని మనసు ఆరాటపడుతోంది. మోపేడు బండిలో ఆసుపత్రికి చేరుకునేదానికి అర్ధగంట […]

యుద్ధం Read More »

నా సాహితి ప్రయాణం

ఉగాది పండుగకు “సహరి” పత్రిక నాకు ఇచ్చిన కానుక. ఈ వారం”సహరి” ఆన్లైన్ పత్రికలో నా చిరు పరిచయం. సహరి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🌹 పేరు: వంజారి రోహిణిజన్మస్థలం: నెల్లూరు టౌన్చదువు: బి.ఎస్.సి., బి.ఎడ్.సైన్స్ టీచర్ గా ఇరవైఏళ్ల అనుభవంప్రస్తుత నివాసం: హైదరాబాద్కుటుంబంభర్త: వంజారి కృష్ణ మూర్తిటీవీ, సినిమా నటులుసంతానం:శ్రీనివాస చైతన్య,వైష్ణవి అమ్మ ఆదిలక్షమ్మ గృహిణి. మా నాన్నఅరిశా సత్యనారాయణ గారు నెల్లూరు సంతపేట బి.ఎడ్ కాలేజీ ఆఫీసులో పనిచేసేవారు. చాల సామాన్యమైన దిగువ మధ్యతరగతి కుటుంబం

నా సాహితి ప్రయాణం Read More »

ఆధారం

మొక్క మట్టిలో బలంగా నాటుకోవడానికి పనికి వచ్చే తల్లివేరుని నరికేస్తే, ఇక ఆ మొక్క మనుగడసాగించి పెద్ద చెట్టు కాగలదా..? ఏమవుతుందో తెలియాలంటే ఈ వారం “సహరి” ఆన్లైన్ వారపత్రికలో ప్రచురితం అయిన “ఆధారం” కథ చదవాల్సిందే. మీ అమూల్యమైన అభిప్రాయము తెలుపాల్సిందే..🙏🙏🌹🌹 “సహరి” సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🙏🌹🌹 “సువిధా.. ! నిజంగా నువ్వు చాల గ్రేట్. కంగ్రాట్స్ ” మీటింగ్ హాల్ నుంచి బయటకు వస్తూనే కరచాలనం చేసి చెప్పింది పల్లవి.” థాంక్స్ ” అంది సువిధ

ఆధారం Read More »

దొడ్డెత్తే నరసమ్మ

ఇప్పుడు నరసమ్మ నా కళ్ళముందు కనిపిస్తే గుండెలకు హత్తుకుని, పన్నీరు, నా కన్నీరు కలిపి ఆమె పాదాలను కడిగి నెత్తిన చల్లుకోవాలని ఉంది. ఎందుకో తెలియాలంటే ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితం అయిన నా “దొడ్డేత్తే నరసమ్మ” కథ చదవాల్సిందే. విజయమహల్ సెంటర్ కథలు విశాలాక్షి పత్రికలో ప్రచురిస్తూ గొప్ప ప్రోత్సహం ఇస్తున్న శ్రీ కోసూరు రత్నం గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి శిరస్సు వంచి వందనాలు. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పోయిన నెల

దొడ్డెత్తే నరసమ్మ Read More »

పుత్తడి బొమ్మ

శుభోదయం. “బహుళ” పత్రిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక సంచికలో నా కథ “పుత్తడి బొమ్మ”. జ్వలిత మేడం గారికి ధన్యవాదాలతో. “పుత్తడి బొమ్మ” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలపాలని కోరుతూ.. తలుపు చాటు నుంచి వారి మాటలు విన్న ఆమె ఏ నిర్ణయం తీసుకుంది..?ఆమె నిర్ణయానికి వారు తలవంచారా..?ఇంకా పూర్తిగా తెల్లవారనేలేదు. చిరుచీకట్లు తెరలు తెరలుగా విడివడుతూ ఉన్నాయి. పెరట్లో జామ చెట్టు మీద పక్షులు మాత్రం అప్పుడే ఉదయరాగాలు అలపిస్తున్నాయి తమ తమ

పుత్తడి బొమ్మ Read More »

బాపనోళ్ళ పిల్ల…ముత్తరాసి యానాది పిలగోడు

రేపు “వాలెంటైన్స్ డే” కదా. ప్రేమికుల దినోత్సవం. మరి ప్రేమంటే వలపా..?ఆకర్షణ..?ఒకరివెనుక ఒకరు తిరగడమా..? గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ, హోటల్స్, పార్కుల వెంట తిరగడమా..? ఆసిడ్ దాడా..? హత్యో, ఆత్మహత్యో చేసుకోవడమా..? ఏం చేస్తున్నారు ఇప్పటి ప్రేమికులు..? కానీ ప్రేమంటే కాలం ఎంత మారినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా అనుక్షణం నీ వెంటే నేను, నీ తోడుగా నేను, నీ నీడగా నేను, నీ సంతోషమే నేను కోరుకునేది అనే భరోసా జీవితాంతం కలిగించడం.మొత్తంగా

బాపనోళ్ళ పిల్ల…ముత్తరాసి యానాది పిలగోడు Read More »

దేవత అయిన రెడ్డమ్మ

వీధుల్లో తోపుడు బండ్లమీద, పండ్ల అంగళ్ళల్లో చూసి తృప్తి పడడమే కానీ ఆపిల్ పండు కొనుక్కుని తినే ఆర్ధిక స్తోమత నా చిన్నప్పుడు మాకు లేదు. ఆపిల్ పండు తినాలనేది నా తీరని ఆశ అప్పుడు. అయితే ఓ జనవరి ఫస్ట్ రోజు ఏం జరిగింది,ఆపిల్ పండు తినాలనే నా కోరిక తీరిందా, లేదా అనేది ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో వచ్చిన ” దేవత అయిన రెడ్డెమ్మ” కథలో. సంపాదకులు శ్రీ కోసూరు రత్నం, శ్రీ

దేవత అయిన రెడ్డమ్మ Read More »

తట్టుడీ మీకు తీయబడును

ఆరవ తరగతిలో తొలిసారి బడిలో చేరిన తొలిరోజు “యేసయ్య” గురించి తెలుసుకున్న బుజ్జమ్మ చెప్పిన కథ “తట్టుడీ మీకు టీయబడును”, ఈ నెల [డిసెంబర్] విశాలాక్షి మాసపత్రికలో. శ్రీ కోసూరి రత్నం సర్, శ్రీ ఈతకోట సుబ్బారావు సార్లకి ధన్యవాదాలతో. మిత్రులకు ముందస్తు “క్రిస్మస్” పండుగ శుభాకాంక్షలతో..🎄🎄🙏🙏 పైప్రాణాలు పైనే పోయి వొనకతా ఎనక్కి చూసినా. ఆడ మా హెడ్ మిస్సెస్ ఎలిజబెత్ టీచర్ బూట్లు టక టకలాడిస్తా చెక్క మెట్లు దిగి వస్తా ఉండాది. అప్పుటికి

తట్టుడీ మీకు తీయబడును Read More »

ధనాత్మకం

జీవితంలో మనిషికి ధనాత్మకంగా ఉండాల్సింది ఏమిటి ?. ఈ రోజు “విశాలాంధ్ర” ఆదివారం అనుబంధం లో నా కథ “ధనాత్మకం” ప్రచురితం అయింది. విశాలాంధ్ర సంపాదకులకు ధన్యవాదాలతో. మీరు కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా.. మిన్ను విరిగి మీద పడినా నాకేం కాదు. ధీమా అనేది నా రక్తంలోనే ఉంది. ఇటాంటివి ఎన్ని చూడలేదు నేను. ఈ మధుసూధన్ రావు అంటే ఎవరైనా, ఏదైనా గడగడలాడాల్సిందే.అయినా దేవి ఎందుకు అంత కంగారు పడుతుంది. చిన్న

ధనాత్మకం Read More »