విమల సాహితి ఎడిటోరియల్స్

విమల సాహితి ఎడిటోరియల్ 62 – పద్మం డాక్టర్ కత్తి పద్మారావు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి అడవిలో దుప్పి, జింకల్లాంటి సాధుజంతువులతో పాటు క్రూర మృగాలైన పులి, సింహంలాటివి కూడా ఉంటాయి. నక్క, తోడేళ్లలాంటి జిత్తులమారి జంతువులూ ఉంటాయి. అటువంటి అడవిలో జీవులు మనుగడ సాగించడం ఎలా? నీటి కొలనులో అరవిరిసిన కలువలు, ఎర్ర తామరలే కాకుండా, నెత్తురు తాగే మొసళ్ళు, ప్రాణాలు తీసే పాములు కూడా ఉంటాయి. అక్కడే చేపలు, ఎర్రలు, […]

విమల సాహితి ఎడిటోరియల్ 62 – పద్మం డాక్టర్ కత్తి పద్మారావు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 61 – పరిపూర్ణ జీవితం

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “పరిపూర్ణ జీవితం” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. “గురో: ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే ” గురువు అనుగ్రహం లేనిదే లోకంలో సుఖం పొందడం దుర్లభం. ఎక్కడో ఒకచోట పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు, పుట్టుకతోనే సహజ పాండిత్యం అబ్బిన పోతనామాత్యుల వంటి వారు ఉండవచ్చు కానీ, ప్రతి మనిషికీ గురువు లేకుండా జీవితం సాగదు. ఎంత గొప్ప వ్యక్తి

విమల సాహితి ఎడిటోరియల్ 61 – పరిపూర్ణ జీవితం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 60 – అనేకానేక ముసుగులు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “అనేకానేక ముసుగులు”చదివి మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. సంతోషం, దుఃఖం, కోపం, కరుణ, ఆవేశం. బహు ముఖాల ఉద్వేగాలు, సంవేదనలను వ్యక్తపరచడం ఒక్క మనుషులకి మాత్రమే సాధ్యం. ఎద లోతుల్లో జనించిన భావాలకు భాష తోడై, మనసుని వెల్లడిచేసే మాటలు పలకడం కూడా ఒక్క మనిషికే సాధ్యం. మిగతా జంతువులకు కూడా ఈతి బాధలు ఉంటాయి. అయితే వాటిని చెట్లు, జంతువులు వ్యక్తం చేయలేవు

విమల సాహితి ఎడిటోరియల్ 60 – అనేకానేక ముసుగులు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 59 – పాద ధూళిలో ప్రాణాలు

మిత్రులకు శుభోదయం. ఈవారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “పాద ధూళిలో ప్రాణాలు” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి నలుగురిని ఒకచోట చేర్చి, నాలుగు మంచి మాటలు చెప్తే సమాజంలో ఓ మార్పుకి శ్రీకారం చుట్టవచ్చు. మంచైనా, చెడైనా వ్యాపించాలంటే మౌత్ పబ్లిసిటి ని మించిన సామాజిక వనరు మరొకటి లేదు. చెడుని కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే మనుషుల ఐక్యమత్యాన్ని నిర్వీర్యం చేసి, మనుషుల మధ్య చిచ్చు పెట్టే మానవ

విమల సాహితి ఎడిటోరియల్ 59 – పాద ధూళిలో ప్రాణాలు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 58 – రెండో మెట్టు

ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “రెండో మెట్టు” చదవండి . మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి దేనినైనా జయించాలంటే నిరంతర సాధన, అధ్యయనం చేస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఏకాగ్రచిత్తం కలిగివుంటేనే విజయం సాధ్యం అవుతుంది. ఇతరములైన బాహ్యవిషయాలపై పట్టు సాధించడానికి కూడా ఏకాగ్రత అవసరమే. అదే ఎవరి మనసును వారు జయించాలంటే? మన మనసు మన ఆధీనంలో ఉండాలంటే? ఆ మనసును సన్మార్గంలో నడిపించేందుకు ఓ మాధ్యమం కావాలి.

విమల సాహితి ఎడిటోరియల్ 58 – రెండో మెట్టు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 57 – మేథావి – బికారి

మేథావి -బికారి. ఎవరు వీళ్ళిద్దరూ. ఈనాటి విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి మహాప్రస్థాన సృష్టికర్త శ్రీ శ్రీ మరణాంతరం వారి సతీమణి ఇంట్లో జరుగుబాటులేక, శ్రీ శ్రీ గారికి వచ్చిన సర్టిఫికెట్స్, షీల్డ్ ఏదో పదిహేను వందల రూపాయలకు అమ్మకానికి పెట్టారట. ఎవరో అది చూసి “వాటి విలువ పదిహేను వందలు కాదమ్మా. ఎన్నో లక్షల రూపాయలు చేస్తాయి. అయినా డబ్బుతో కొలిచేవి కాదు. శ్రీ

విమల సాహితి ఎడిటోరియల్ 57 – మేథావి – బికారి Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 56 – కొందరికి అందని చందమామ!!

పిల్లలు దేవుడు చల్లని వారే. కల్ల కపటమెరుగని కరుణామయులే. కానీ ఆ కరుణామయ పిల్లలు ఎందరికి బంగారు బాల్యం ఉంది. ఎందరు పంట పొలాల్లో, పశువులు మేపడంలో, పరిశ్రమల్లో, ధనవంతుల ఇంట పాచి పనుల్లో, జమిందార్ల కాళ్ళు ఒత్తుతూ బానిసలుగా ఉన్నారో తెలుసా. జూన్ 12 బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం ” కొందరికి ఇంకా అందని చందమామ” చదవండి. మీ అమూల్యమైన

విమల సాహితి ఎడిటోరియల్ 56 – కొందరికి అందని చందమామ!! Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 55 – డిటాచ్మెంట్ to అటాచ్మెంట్

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “డిటాచ్మెంట్ టు అటాచ్మెంట్” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి “అన్నదమ్ములవలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్. దేశ మంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” గురజాడ వారి ముత్యాలసరం నుంచి జారిపడిన మేలిమి ముత్యాలు ఈ పదాల వరుసలు. “కలసి ఉంటే కలదు సుఖము”, “ఐకమత్యమే మహాబలము” పంచతంత్రంలో విష్ణు శర్మ జంతువులతో చెప్పించిన చద్ది మూటలు ఇవి. అయితే కలిసి ఎంతకాలం ఉన్నా

విమల సాహితి ఎడిటోరియల్ 55 – డిటాచ్మెంట్ to అటాచ్మెంట్ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 54 – ప్రకృతి ఒడిలో మమేకం

ఈ వారంలో విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి ఎన్నికల ప్రహసనం ముగిసింది. ఇక ఫలితాలకోసం ఎదురుచూపు ప్రహసనం మొదలైంది. ఈసారి ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో, ఎవరిని ఇంట్లో కూర్చోబెడతారో కాలమే సమాధానం చెప్తుంది జూన్ 4న. కాలం అంటే గుర్తుకు వచ్చింది, ఇప్పటిదాకా నిప్పులు చెరిగిన గ్రీష్మ కాల ప్రచండ మార్తాండుడి ప్రతాపం కూడా ముగిసింది. అంతటా తొలకరి జల్లులు. ఎండ వేడిమికి నెర్రలు బారిన నేలలోకి

విమల సాహితి ఎడిటోరియల్ 54 – ప్రకృతి ఒడిలో మమేకం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 53 – తాంబూలాలిచ్చేసారిక

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. “ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే – ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే – ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి”. నాయకులు, కార్యకర్తలు , ఓటర్లు అందరు కంటిమీద రెప్ప వేయకుండా ఎదురు చూసిన ఎన్నికల పోలింగ్ రోజు మే 13 అలా వచ్చేసింది. ఇలా వెళ్ళిపోయింది. కాలానిదేముంది. ఎవరిని పట్టించుకుంటుతుందది?

విమల సాహితి ఎడిటోరియల్ 53 – తాంబూలాలిచ్చేసారిక Read More »