విమల సాహితి ఎడిటోరియల్స్

విమల సాహితి ఎడిటోరియల్ 68 – అనువాద సాహిత్యం అనుసరణీయమేనా ?

అనువాదకుల లిస్ట్ చాంతాడంత ఉంది తెలుగులో. కానీ తెలుగు భాష లోని సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించేవారు వారు మాత్రం కరువైనారు. తెలుగు సాహిత్యానికి ఎందుకీ దుస్థితి. ఈ నాటి విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. మన ఇంటి మంచి కూర ఎంత రుచిగా ఉన్నా పొరుగింటి పుల్లకూర మీదే మక్కువ ఎక్కువ’ ఈ నానుడి అందరికీ తెలిసినదే. మనవాళ్ళు ఎన్ని విజయాలు సాధించినా, మనలో […]

విమల సాహితి ఎడిటోరియల్ 68 – అనువాద సాహిత్యం అనుసరణీయమేనా ? Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 67 – సాహిత్యమా – వ్యాపారమా

ఈనాటి విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం ” సాహిత్యమా – వ్యాపారమా ” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. ఓ పిల్ల తెమ్మెర మేనిని తాకినప్పుడు మనసు పరవశించో, కళ్ళ ముందు జరిగిన అన్యాయం హృదయాన్ని ముక్కలు చేసినప్పుడో, మోసమో, ద్రోహమో భరించలేక గుండె లోతుల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలైనప్పుడో, ఓ కవి అంతరంగంలో కవితాక్షరాలు పురుడు పోసుకుంటాయి. ఓ కథకుని మదిలో వస్తుశిల్పాలు పోటీపడి కథని నడిపిస్తాయి. ఆ ప్రాచీన కవులు

విమల సాహితి ఎడిటోరియల్ 67 – సాహిత్యమా – వ్యాపారమా Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 66 – అఖండ భారతం – అ’మృత’ భారతం

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం ” అఖండ భారతం- అ ‘ మృత ‘ భారతం ” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. మూడు దిక్కులా నీటి వనరులు, నాలుగవ దిక్కున పర్వత కనుమలు మధ్యన వెలిసిన విశాలమైన ద్వీపకల్పం మన అఖండ భారతం. ఎన్నో ప్రాంతాలు. మరెన్నో కులాలు, మతాలు, సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు అనుసరించే ప్రజలతో, అపారమైన ప్రాకృతిక వనరులతో ఎన్నో శతాబ్దలుగా విలసిల్లుతూ, ఎందరో

విమల సాహితి ఎడిటోరియల్ 66 – అఖండ భారతం – అ’మృత’ భారతం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 65 – 150 మిల్లీగ్రాముల దౌర్భాగ్యం

150 మిల్లీగ్రాముల దౌర్భాగ్యం. ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. ఏ చీకట్లలో కునారిల్లుతోంది దేశం? ఏ నికృష్టపు మృగనీడలు దేశాన్ని ఆవరించిఉన్నాయి? జరుగుతున్న సంఘటనలు తలచుకుంటుంటే రక్తం మరిగిపోతోంది. నిరాశ పెద్ద పాములా తలకు చుట్టుకుంటోంది. ఏమి చేయలేని నిస్సహాయత నిలువునా కూల్చేస్తోంది. భారత దేశం ప్రగతి పధంలో ఉంది. అభివృద్ధిని సాధించినది. సాంకేతికాభివృద్ధిలో ఎదురులేని విజేత అయింది. ఇవన్నీ ఉత్త మాటలు.

విమల సాహితి ఎడిటోరియల్ 65 – 150 మిల్లీగ్రాముల దౌర్భాగ్యం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 64 – స్వేచ్ఛ – బందిఖానా

కథలకు శైలి, శిల్పం అవసరమా? యువత ఎక్కడ బంధింపబడింది? ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “స్వేచ్ఛ – బందిఖాన” చదవండి.మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి పంద్రాగస్టు.. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు. భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన శుభదినం. బ్రిటిష్ వలస పాలన నుంచి, విభజించి పాలించిన దాష్టికం నుంచి భారత దేశం విముక్తి పొందిన తరుణం. 1947 ఆగష్టు 15 న భారత స్వాతంత్రం

విమల సాహితి ఎడిటోరియల్ 64 – స్వేచ్ఛ – బందిఖానా Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 63 – ఓటమి – గెలుపు

‘ఓటమి -, గెలుపు’. ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి సహనా వవతు! సహనౌ భునక్తు! సహవీర్యం కరవావహై! తేజస్వినావధీతమస్తు! మావిద్విషావహై! ప్రపంచంలో ఉన్న స్వేచ్ఛను, సమానత్వాన్ని, సంపదలను అందరం కలిసి అనుభవించాలి. అందరు కలిసిమెలిసి మానసిక వికాసాన్ని, చైతన్యాన్ని సాధించాలి. దేశ ప్రజలందరూ తేజోవంతులుగా ఒకరిపట్ల ఒకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండి దేశ పరువు ప్రతిష్టలను, గౌరవ మర్యాదలను అంతర్జాతీయ స్థాయిలో

విమల సాహితి ఎడిటోరియల్ 63 – ఓటమి – గెలుపు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 62 – పద్మం డాక్టర్ కత్తి పద్మారావు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి అడవిలో దుప్పి, జింకల్లాంటి సాధుజంతువులతో పాటు క్రూర మృగాలైన పులి, సింహంలాటివి కూడా ఉంటాయి. నక్క, తోడేళ్లలాంటి జిత్తులమారి జంతువులూ ఉంటాయి. అటువంటి అడవిలో జీవులు మనుగడ సాగించడం ఎలా? నీటి కొలనులో అరవిరిసిన కలువలు, ఎర్ర తామరలే కాకుండా, నెత్తురు తాగే మొసళ్ళు, ప్రాణాలు తీసే పాములు కూడా ఉంటాయి. అక్కడే చేపలు, ఎర్రలు,

విమల సాహితి ఎడిటోరియల్ 62 – పద్మం డాక్టర్ కత్తి పద్మారావు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 61 – పరిపూర్ణ జీవితం

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “పరిపూర్ణ జీవితం” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. “గురో: ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే ” గురువు అనుగ్రహం లేనిదే లోకంలో సుఖం పొందడం దుర్లభం. ఎక్కడో ఒకచోట పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు, పుట్టుకతోనే సహజ పాండిత్యం అబ్బిన పోతనామాత్యుల వంటి వారు ఉండవచ్చు కానీ, ప్రతి మనిషికీ గురువు లేకుండా జీవితం సాగదు. ఎంత గొప్ప వ్యక్తి

విమల సాహితి ఎడిటోరియల్ 61 – పరిపూర్ణ జీవితం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 60 – అనేకానేక ముసుగులు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “అనేకానేక ముసుగులు”చదివి మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. సంతోషం, దుఃఖం, కోపం, కరుణ, ఆవేశం. బహు ముఖాల ఉద్వేగాలు, సంవేదనలను వ్యక్తపరచడం ఒక్క మనుషులకి మాత్రమే సాధ్యం. ఎద లోతుల్లో జనించిన భావాలకు భాష తోడై, మనసుని వెల్లడిచేసే మాటలు పలకడం కూడా ఒక్క మనిషికే సాధ్యం. మిగతా జంతువులకు కూడా ఈతి బాధలు ఉంటాయి. అయితే వాటిని చెట్లు, జంతువులు వ్యక్తం చేయలేవు

విమల సాహితి ఎడిటోరియల్ 60 – అనేకానేక ముసుగులు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 59 – పాద ధూళిలో ప్రాణాలు

మిత్రులకు శుభోదయం. ఈవారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “పాద ధూళిలో ప్రాణాలు” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి నలుగురిని ఒకచోట చేర్చి, నాలుగు మంచి మాటలు చెప్తే సమాజంలో ఓ మార్పుకి శ్రీకారం చుట్టవచ్చు. మంచైనా, చెడైనా వ్యాపించాలంటే మౌత్ పబ్లిసిటి ని మించిన సామాజిక వనరు మరొకటి లేదు. చెడుని కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే మనుషుల ఐక్యమత్యాన్ని నిర్వీర్యం చేసి, మనుషుల మధ్య చిచ్చు పెట్టే మానవ

విమల సాహితి ఎడిటోరియల్ 59 – పాద ధూళిలో ప్రాణాలు Read More »