కవితలు

దేశం – దేహం

దేశం – దేహం. ఈ వారం నవతెలంగాణ సోపతిలో. సంపాదకులకు ధన్యవాదాలతో.. దేశ గౌరవం కోసంక్రీడావనిలో వేగుచుక్క అయిందిఅకుంఠిత దీక్షతో సాధన చేసింది ప్రపంచ పట శిఖరాగ్రానికిదేశపు మువ్వన్నెల జెండాని ఎగరేయాలనుకుంది కామాంధుల కుట్రకు బలైఎదురు నిలిచిందిదేహమున్న ఆటబొమ్మనికాదు పొమ్మంది పోరాటం నాకు ఉగ్గుపాల విద్యఆత్మాభిమానం నా ఆయుధంగెలుపే నా భవితం సాధనే నా ఆయువుపోరాటమే నా ఊపిరంటూ కాలానికి ఎదురు నిలిచిన ధీర ఈనాడు ఆమె దేహ బరువువంద గ్రాములెక్కువనిద్వేషపు బరువుదేశ పటాన్ని అవనతం చేసిందిక్రీడా […]

దేశం – దేహం Read More »

నేను – పుస్తకం

పదేపదే బయట తిరగటం కన్నా ఒంటరీకరణలో పుస్తకాల మధ్యన కూర్చుని చదువుకుంటూ సంబరంగా ఏకాంతాలని జాతరలా గడపటం ఇష్టం సిల్వర్ ఫిష్ లాగా పుస్తకాల పేజీల్లో తిరగటం ఆసక్తి పేజీలు తిప్పినప్పుడల్లా వాటి మధ్య దాచిన నెమలీకలు ఎండిన రోజా పూల రెక్కలు జ్ఞాపకాల కథల మూటలను విప్పుతాయి ఒకసారి పచ్చటి అడవుల్లోకి వెళతాను కొండకోనల్లో జాలువారే నీటిని ఒడిసిపట్టుకుని తాగుతాను ఎడారి ఇసుక వేడి భరించలేక అరికాళ్ళను రుద్దుకుంటాను జలపాతాల హోరుతో పోటీపడుతూ తోటి గువ్వలా

నేను – పుస్తకం Read More »

71. సమాయత్తం

“నింగి వంగి నేలపైకి నీటిబొట్లతో ప్రేమవంతెనేసింది పుడమి గుండె పులకించి అణువణువు ప్రేమ చెమ్మతో తడుపుకుంది నేల ఒడిలో దాగున్న విత్తులు వాననీటి ప్రేమ స్పర్శకి గులామ్ అంటూ విచ్చుకుని ఆకుపచ్చ తలలెత్తాయి హరితంకిరణం సంగమించాయి ప్రకృతి రంగులమయమైంది జగతి ఆకలి తీర్చే అక్షయపాత్ర కావటానికి హరితకిరణాలు ప్రేమగా సమాయత్తమవుతున్నాయి జయహో హరితం జయహో కిరణం” రోహిణి వంజారి 31-07-2024

71. సమాయత్తం Read More »

70. ప్రవర

ఈ పక్షం “సారంగ” పత్రికలో నా కవిత “ప్రవర”. మిత్రులు చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. Afsar Mohammed గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో నువ్వెవరంటే ఏం చెప్పను మిత్రమా యుగయుగాలుగా చెప్పి చెప్పి అలిసిపోయాను.. అల్లంత దూరంలో నేను అస్పష్టంగా కనిపించినా ముందు నీచూపు పడేది నా కనుబొమ్మల మధ్యనే కదా.. అక్కడ బొట్టు ఉందా లేదా అని చూస్తున్నావా? లేదంటే చూపు కిందకి దింపి గడ్డంకేసి చూస్తున్నావా ? అయినా నేనెవరో నీకు తెలియడంలేదు

70. ప్రవర Read More »

ఆవేదన

ఏ కాల సర్పం కాటేసిందో ఏ ద్రోహం ఆవేదన పరచిందో ఏ కష్టం కన్నీట ముంచిందో ఏ దుఃఖం ఓపలేనిదైందో ఏ బాధ బ్రతకవద్దందో ఏ నిరాశ గుండెను చీల్చిందో ఏ నిస్పృహ నిస్తేజ పరచిందో ఏ అపజయం ఉరినెక్కమందో ఏ ఓటమి కాటికి పొమ్మందో ఏమో ఎవరికి తెలుసుగనుక ఆత్మ హత్య వెనుక కథ అశ్రు నివాళులు అర్పించకున్నా పర్వాలేదు… ప్రగాఢ సంతాపం తెలుపకున్నా పర్వాలేదు… కానీ… పోయిన వాడు ఏ రంగువాడు ఏ కులపువాడు

ఆవేదన Read More »

దిగుడు మెట్లు

కవిత చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి “ఓ చెంప జననం మరోపక్క మరణం ద్వంద్వ సమాసంలా ఆనందం దుఃఖం.. ఇంకెక్కడో ద్వేషం మోసం అసూయ త్రిక సంధిలా తట్లాడుతుంటాయి.. అక్కడెవరికో పదవొచ్చిందని ఇక్కడ గుండెల్లో మంట రేగుతోంది.. ఎక్కడో పార్టీలో ఎవరో దొరికారని నిద్రని తరిమి నిశీధిలో.. యూ ట్యూబ్ వీడియోల శోధనలో తనని తాను మరచి.. ఆవేశం ఆక్రోశం అవహేళన వ్యాప్తి చేస్తూ ఇక్కడ చాకిరేవులా మార్చుకుంటున్న బతుకు .. కుళ్ళు చెత్తతో బుర్ర

దిగుడు మెట్లు Read More »

గిలక బొమ్మ

సృజన క్రాంతి సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు Wilson Rao Kommavarapu గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఉయ్యాల తొట్టిలో పొత్తి గుడ్డ గిరగిరా తిరిగే గిలక బొమ్మ.. వెన్నెల రాత్రిలో వేడి బువ్వ చందమామలో కుందేలు.. జాతరలో దొరికే చెరుకు గడ పండుగ రోజు పట్టు వస్త్రం.. కన్నీటిని తుడిచే కడకొంగు తడబడే అడుగులకు ఊతం.. పడిపోతే లేవనెత్తే ఆసరా జీవిత పుస్తకంలో తొలిపాఠం నేర్పించే గురువు.. గెలుపు ఓటమి ఏది వరించిన నన్ను నన్నుగా

గిలక బొమ్మ Read More »

జీవన్మృత్యువు

“జీవన్మృత్యువు”. ఈ వారం నవ తెలంగాణ సోపతిలో ప్రచురింపబడిన నా కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. శత్రువు లేని యుద్ధం వరద పోటెత్తినట్లు నెత్తుటి ప్రవాహం.. క్షణక్షణానికి విస్తరిస్తున్న వేదన ఆయుధాల కోతలతో ఉగ్గబట్టిన ఊపిరి .. నడుముకింద నవనాడుల్లో భరించలేని రాపిడి గాలిలో దీపమవుతున్న ప్రాణం.. తొమ్మిది నెలలు కాపురమున్న అతిధి కొత్తలోకంలోకి రావాలని జరిపే విశ్వ ప్రయత్నం .. ఉప్పెనలా ఉధృతమై ఊరుకుతున్న ఉమ్మనీరు జీవన్మృత్యు పోరాటం .. కేర్ కేర్

జీవన్మృత్యువు Read More »

ప్రేమలు

నేను గొప్ప నేనే గొప్పని విర్రవీగుతారు.. చిన్న కష్టానికే ఓర్వలేక కుదేలయిపోతారు.. కులమతాల కుళ్ళులో జలగల్లా పొర్లుతుంటారు.. ఎవరో పట్టించుకోలేదని ప్రేమకోసం దేబిరిస్తూ ఉంటారు.. స్వార్ధాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ ఉంటారు.. విజ్ఞానపు ఫలాలనెన్నింటినో చేజిక్కించుకుంటారు.. ఆధునిక వసతులనెన్నిటినో అందిపుచ్చుకుంటారు.. డబ్బు జబ్బు చేసి నానా యాతనలు పడుతుంటారు.. ఎదిగిన బిడ్డలకు వీసా రెక్కలు కట్టి లోహ విహంగం ఎక్కించేస్తారు.. డాలర్లు బంగారు బిస్కెట్లు కడుపాకలి తీర్చవని తెలిసి ఒంటరితనాన్ని నిందిస్తూ ఉంటారు.. నడుమొంచి పనిచేయక రాని

ప్రేమలు Read More »

అయిపు

ఏడాదేగా అయింది నేర్చుకున్న పాఠాలు అప్పుడే మరిచావా.. పునఃశ్చరణ చేసుకోవడం పనికిమాలినదంటావా. నియమాలన్నీ గాలికొదిలేసావా.. నిందలన్నీ ఎదుటివారిమీదకే నెట్టేస్తావా.. ఆత్మపరిశీలన అనవసరం అనుకున్నావా.. ఇకనైనా అప్రమత్తం కాకుంటే నీ రక్షణ కోసం సంభవామి యుగే యుగే అంటూ దేవుడు వస్తాడో లేడో కానీ నీ భక్షణ కోసం సంభవామి పదే పదే అంటూ సైతాను మాత్రం కొత్త శక్తులను కూడకట్టుకుని కోటానుకోట్లుగా నీ ఊపిరిలోకి ఉప్పెనలా దూసుకొస్తోంది నాకేం కాదనే ధీమాని వదిలిపెట్టి పునఃశ్చరణ పాఠాలు మొదలుపెట్టు

అయిపు Read More »