Home కధలు

కధలు

విరిగిన తల. ఎవరి తల ..? ఎందుకు విరిగింది..? తెలుసుకోవాలంటే ఈ రోజు "ప్రజాశక్తి ఆదివారం అనుభందం స్నేహ పత్రిక" లో ప్రచురితం అయిన కథ "విరిగిన తల" చదవాల్సిందే. "ప్రజాశక్తి " సంపాదకులకు ధన్యవాదాలతో.. విరిగిన తల చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపాలని కోరుతూ.. డుగు డుగు డుగు డుర్ డుర్.. డుర్ర్ర్..' కీ ' ఇచ్చి వదిలిన స్కూటర్ బొమ్మ ఇల్లంతా పరుగులు తీస్తోంది. బొమ్మ వెనుకే పరుగు తీస్తున్నాడు ఐదేళ్ళ చిన్నారి చైతన్య. భలే భలే అంటూ చప్పట్లు...

యుద్ధం

విద్యార్థులు విజయం సాధించాల్సింది దేనిమీద..? మే నెల "కస్తూరి మాసపత్రిక" లో నా కథ "యుద్ధం". కస్తూరి మాసపత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో. "యుద్ధం " చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపగోరుతూ... 🙏🙏 మనం తరచుగా విజయాన్ని అకడమిక్ స్కోర్‌లతో సమానం చేసే ప్రపంచంలో, మార్కులు జీవితం ఒకటె అనుకునే అనాగరిక ప్రపంచంలో ఉన్నాము . రెండు విభిన్న కథనాలు నా దృష్టికి వచ్చాయి. ఒక విద్యార్థి, 1,000కి 892 స్కోర్‌ను సాధించినప్పటికీ, విషాదకరంగా ఆత్మన్యూనతతో తన ప్రాణాలను తానె తీసుకున్నాడు. మరో విద్యార్థి, 470కి కేవలం...
నెల్లూరులో నరసింహకొండకు వెళ్లే దారిలో లోతైన చీకటి గుహ లాంటి చోట వెలసిన ఇరగాలమ్మ.. గ్రామ దేవత. ఇరుకళల అమ్మగా మారక ముందు నేను పసితనంలో కళ్లారా చూసిన జాతర. "గంగరాయి చెట్టు కింద ఇరగాలమ్మో" కథ రూపంలో మార్చి నెల పాలపిట్టలో. గుడిపాటి వెంకట్ గారికి ధన్యవాదాలతో.."గంగరాయి చెట్టు కింద ఇరగాలమ్మో" చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ.. " మొ..రవంత గొబ్బిరి చమురు చేతలో ఏస్తావా" ఇరబోసుకున్న తలను గీరుకుంటా అడిగినాది సుబ్బి."ఏం సుబ్బే..ఈ రోజు తలకుబోసుకుంటావా ఎట్టా" బియ్యంలో రాళ్ళేరతా...
ఈ రోజు ప్రజాశక్తి "స్నేహ" పత్రికలో నా బాలల కథ "నాటిన విత్తులు". స్నేహ సంపాదకులకు ధన్యవాదాలతో..చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కోరుతూ.. బడి వదిలి గంట అయినా ఇంకా ఇంటికి రాని కొడుకు కోసం వాకిట్లో నిలబడి చూస్తోంది కీర్తన.ఆమె కొడుకు సుధీర్ మూడోవ తరగతి చదువుతున్నాడు. స్కూల్ ఇంటికి మూడు వీధుల అవతల ఉంది. రోజు బడి గంట కొట్టాక ఓ గంట స్కూల్ దగ్గర మిత్రులతో ఆడుకుని ఒక్కడే ఇంటికి వచ్చేసేవాడు. ఆ రోజు ఒకటిన్నర గంట అయినా రాలేదని...

పందేరం

మిత్రులకు సంక్రాతి కానుక. విశాలాంధ్ర పత్రికలో ఈ రోజు మీకోసం "పందేరం". విశాలాంధ్ర సంపాదకులకు ధన్యవాదాలతో.. వరికుప్పల నడుమ వడివడిగా తిరుగుతూఈ తూరికి ఎన్ని పుట్ల ఒడ్లు వస్తాయోననిలెక్కలు గట్టే నాయన కళ్ళుచీకట్లో గడ్డివాముల చుట్టూ తిరిగేమిణుగురుల్లా ఆశగా మెరుస్తున్నాయి.. కుప్ప నూర్పిడి చేసి వొడ్లను తూర్పారబడుతూఅలిసిసొలిసిన కూలోళ్ళకు నడుమ నడుమతాటాకుల దొన్నెలో శాంతమ్మ అందించే కల్లుఅమృతపు చుక్కల్లా గొంతుల్లోకి దిగుతోంది.. ఊర్లోని పిలకాయలకోసం తెగలు తంపటేస్తూబురగుంజు తీస్తూ, తాటిముంజలు కొడుతూకరతుమ్మ పుల్లల మంటమీద తాటిపండ్లు కాలుస్తూవీరయ్య తాత చేసే హడావిడిపోతరాజు జాతరలో వీరంగం ఆడినట్లు ఉండాది..పిల్లకాయలు...
చిన్న రోగానికే పచారిసామాన్ల చీటీ అంత పొడుగున పరీక్షలు, మందులు రాసేసి ఆసుపత్రి అంటేనే బెదిరిపోయేలా చేసే డాక్టర్లు ఉన్న ఈ కాలంలో కూడా వారివారి స్తోమతని బట్టి ఎంత ఫీజు ఇస్తే అంత తీసుకుని, తన ధైర్య వచనాలతోనే సగం రోగాన్ని తగ్గిస్తూ, చక్కని వైద్యం చేసే ఓ డాక్టర్ కథే ఈ "రూపాయి దేవుడు". ఈ నెల "నవమల్లెతీగ" మాసపత్రికలో నా కథ "రూపాయి దేవుడు". "నవమల్లెతీగ " సంపాదకులు "కలిమి శ్రీ" గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో.."రూపాయి దేవుడు"...

ఆఖరి మజిలీ

నవంబర్ నెల "సాహిత్య ప్రస్థానం" లో నా కథ "ఆఖరి మజిలీ". నెల్లూరు లో నేను చూసిన నాలుగు జీవితాలు ఈ కథకి ప్రేరణ. ప్రస్థానం సంపాదకులకు ధన్యవాదాలతో. "ఆఖరి మజిలీ" చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగోరుతూ.. "ఒళ్ళు బలిసి లేచిపోయిందంటారా..! ముండ. పిలకాయలు, మొగుడిని వదిలేసి " ఎగతాళిగా అన్నాడతను. ఇంతకుముందెప్పుడు నేనతన్ని చూడలేదు." అంతేనా..! ఆ ఐరావతమ్మకి మందు పెట్టి మాయ చేసి ఆస్తంతా రాయించేసుకుందట"కోర్టు మెట్లు ఎక్కుతుంటే వినిపించాయి ఆ మాటలు నాకు. మరి ప్రసాద్ వాళ్ళ అమ్మ...
కర్పూరదీపం.. విశాలాక్షి పత్రికలో "దొడ్డెత్తే నరసమ్మ" కథ ప్రచురితం అయిన సంగతి మిత్రులకు తెలుసు కదా. ఆ నరసమ్మ విజయ మహల్ సెంటర్ నుంచి ఏకంగా ఆస్ట్రేలియాకి వెళ్లి వీధి అరుగు ఎక్కి కూర్చుంది. తను అందరికి సౌఖ్యాన్ని పంచుతూ ఎలా కరిగిపోయింది అనే విషయాన్ని అందరికీ చెప్పాలి అని మరోసారి కర్పూరదీపం లా మీ ముందుకు వచ్చింది. ఆణిముత్యాల విభాగం లో కథని ప్రచురించి ప్రోత్సహించిన "వీధి అరుగు" పత్రిక సంపాదకులు శ్రీ శ్రీనివాస్ కొండ్రు గారికి ధన్యవాదాలతో..కథను చదివిన మిత్రులు,...
బంధం ఆర్థికమా..హార్దికమా.. ఏ బంధాలు ఎలా ముడిపడతామో, ఎలా వీగిపోతాయో.. మరి ఈ కథలోని మైత్రి బంధానికి ఉన్న బలం ఎంత..? తెలియాలంటే ఈ రోజు నవ తెలంగాణ ఆదివారం అనుబంధం సోపతి లో ప్రచురితమైన నా కథ "మైత్రి -వైచిత్రి" చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగకోరుతూ.. సోపతి సంపాదకులు శ్రీ కటుకోజ్వల ఆనందాచారిగారికి ధన్యవాదాలతో 🌹🙏 రాఘవ ఇల్లు ఖాళీ చేసి ఊరొదిలి వెళ్ళిపోయాడట. రాత్రికి రాత్రే కుటుంబంతో సహా. ఎవరో అనుకుంటున్న మాటలు వినగానే శరాఘాతం తగిలినట్లు విలవిలలాడాడు అతను....

విహ్వల

శుభసాయంత్రం. మే 2022 "పాలపిట్ట" మాసపత్రికలో నా కథ "విహ్వల". పాలపిట్ట సంపాదకులకు ధన్యవాదాలతో. "విహ్వల" చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపగోరుతూ.. ట్యూషన్ వదిలేశారు. అనిత, రజని వెళ్లిపోయారు. నేను ఒంటరిగా మిగిలాను. చీకటి దట్టంగా మసిగొట్టం నుంచి విడుదలయ్యే పొగలా అములుకుంటోంది. తలెత్తి చూసాను. నక్షత్రాలు కూడా అక్కడొకటి ఇక్కడొకటిగా నాలాగే ఒంటరిగా ఉన్నాయి.ఈ రోజు పరిస్థితి ఏమిటో అర్ధం కాకుండా ఉంది.రేపు లెక్కల పరీక్ష ఉంది స్కూల్లో. అందుకే ట్యూషన్లో శ్రీదేవి మేడం మరో అర్ధగంట ఎక్కువసేపు క్లాస్ తీసుకున్నారు....
నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.