ఆ మూడు మాకొద్దు

ఈనాటి “మహా”పత్రిక సాహితీ పేజీ లో నా కవిత “ఆ మూడు మాకొద్దు” చదవండి. మహా సాహితీ పేజి సంపాదకులు హనీఫ్ గారికి ధన్యవాదాలతో

“అన్నీ అంగాల్లాంటివే

మా దేహాల్లో ఇమిడిఉన్న

ఆ మూడు..

అవి ఉన్నందుకేగా

మాపై మీ దాష్టికాలు..

గుడులు బడులు

రైల్వేస్టేషన్లు హోటళ్ళు

ఎన్ని స్థలాలో మీకు..

మా అవయవాలను

ఛిద్రం చేయడానికి..

మా దేహాల రక్షణకు

కాసింత జాగా ఎక్కడుందో

ఏ మహాత్ముడు చెప్పగలడు?

ఇరవై ముప్పై మృగాల

మూకుమ్మడి దాడికి

ఛిద్రమయ్యేది మా దేహమే కాదు..

విలువలు దిగజార్చుకున్న

మీ నైతిక వికాసం కూడా..

ఆడతనానికి ప్రతీకలు

మా రెండు రొమ్ములు..

నీకు జన్మనిచ్చే అమ్మతనానికి ప్రతీక

మా దేహాల్లోని మర్మాంగం..

అమ్మలని అక్కలని మరచి

ఆడవాళ్ళంటే

ఆ మూడు అంగాల కుప్పలే

అని మగజాతి తలచినంతకాలం..

మా దేహల్లోని రోమ్ములుమర్మాంగాన్ని

మాకు మేమే నిషేదించుకుంటాం..

సృష్టి ఆగిపోతే పోనీండి

మానవజాతి నశించిపొతే పోనీండి..

ఆడతనంలో అమ్మతనాన్ని

మీరు చూసినప్పుడే

మా అంగాలను పునఃసృష్టించుకుని

మాతృమూర్తులుగా

మళ్ళీ మీకు జన్మనిస్తాము

అంతవరకూ ఆ మూడు మాకొద్దు”

రోహిణి వంజారి

9000594630