విమల సాహితి ఎడిటోరియల్ 23 – “హితేన సహితం సాహిత్యం” ..ఇప్పుడంతా హితమేనా?

ఈ వారం విమల సాహితీ పత్రికలో “హితేన సహితం సాహిత్యం” లో ఇప్పుడు హితమెంత? సంపాదకీయ వ్యాసం చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹 కాలం బండరాయి కాదు. ఒకేచోట స్థిరంగా ఉండడానికి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లు కూడా కాదు. కాలచక్రం నిరంతర సంచారి. అలుపెరుగని బాటసారి. గమ్యం తెలియని తెరువరి. కాలంతో పాటు సమాజంలో మార్పులు కూడా సహజం. సర్వసామాన్యం. రెండు రాళ్ళను కొట్టి నిప్పును పుట్టించిన ఆదిమానవుడి నుంచి, ఆ మంటనే వాడి […]

విమల సాహితి ఎడిటోరియల్ 23 – “హితేన సహితం సాహిత్యం” ..ఇప్పుడంతా హితమేనా? Read More »

మార్పు తెచ్చిన మాస్టారు

ఈ రోజు ప్రజాశక్తి పత్రిక ఆదివారం అనుబంధం ‘స్నేహ’ లో నా బాలల కథ “మార్పు తెచ్చిన మాస్టారు” కథ ప్రచురితం అయింది. సంపాదకులకు ధన్యవాదాలతో..కథని చదివి, మీ అమూల్యమైన స్పందన తెలపాలని కోరుతూ.. తెలుగు పీరియడ్ సమయం అవగానే గంట కొట్టాడు అటెండరు యాదయ్య. వెంటనే ఐదవ తరగతిలోకి సైన్స్ మాస్టారు అనిల్ కుమార్ ప్రవేశించాడు. అతని చేతిలో ఉన్న పేపర్ల కట్ట వంక పిల్లలంతా ఆసక్తిగా చూడసాగారు. మొదటి యూనిట్ పరీక్షల జవాబు పత్రాలు

మార్పు తెచ్చిన మాస్టారు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 21 – సిరులెన్ని ఉన్నా చిరునవ్వు ఏది ?

“సిరులెన్ని ఉన్నా చిరునవ్వు ఏది ? ఈ వారం విమల సాహితి పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపండి. గేటెడ్ కమ్యూనిటీలో 3 బీకే ప్లాట్, విల్లా లాంటి పెద్ద భవంతి, పెద్ద ఉద్యోగాలు, లక్షల్లో బ్యాంకు బాలన్సు, తిరగడానికి ఖరీదైన కారు. అన్నీ ఉన్నా ముఖంలో చిరునవ్వు కరువు. సకల సౌకర్యాలు ఉన్నా, బంగారు పువ్వు వేసిన వెండి పళ్ళెంలో తినేది మాత్రం రాగి సంగటి ముద్ద, రెండంటే రెండు

విమల సాహితి ఎడిటోరియల్ 21 – సిరులెన్ని ఉన్నా చిరునవ్వు ఏది ? Read More »

యుద్ధమే ముద్దు

గణేష్ దిన పత్రికలో ఈ రోజు[29-10-2023] నేను రాసిన కవిత “యుద్ధమే ముద్దు” ప్రచురితమైంది. మిత్రులు చదివి మీ స్పందనను తెలుపండి. యుద్ధం అనివార్యంపోరాటం జరగాల్సిందేశత్రువుని తుదముట్టించాల్సిందేబాంబర్ల మోతతో చెవులు తూట్లు పడుతున్నాయుద్ధ ట్యాంకుల శబ్దం గుండెల్లో వణుకుపుట్టిస్తున్నాయుద్ధమే ముద్దు మాకు అంటావా?తెగిన తలలనుంచి ఏరులై పారుతున్న నెత్తురుతల్లి శవం మీద పడి తల్లడిల్లుతున్న శిశువుకూలిపోయిన ఇళ్ళు పొగ చూరిన గోడలుశిధిలాల మధ్యనుంచి వినిపించే ఆర్తనాదంఏవి కదిలించలేవు నిన్నుయుద్ధమే కావాలి నీకుయుద్ధ విజేతల సమాధులు చెప్పే కథలు

యుద్ధమే ముద్దు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 20 – భరత్ అనే నేను

ఈవారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నేను వ్రాసిన “భరత్ అనే నేను”, సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. చెడుపైన విజయం, రజో, తమో గుణాలతో యుద్ధముచేసి సత్వగుణ సంపన్నులై జీవితాన్ని తీర్చి దిద్దుకోమని చెప్తూ వచ్చిన నవరాత్రుల దసరా పండుగ ఎన్నెన్నో సందేశాల తాయిలాలను ఇచ్చి, మళ్ళీ ఏడాది తర్వాతే కనిపిస్తాను అంటూ మొన్ననే వెళ్ళిపోయింది. మరోపక్క గాజా గడ్డమీద యుద్ధ కాండ, అమాయక పౌరులపై దమనకాండ, మతపిశాచాల మారణకాండ కొనసాగుతూనే

విమల సాహితి ఎడిటోరియల్ 20 – భరత్ అనే నేను Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 19 – ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం.

“ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం” ఈ వారం విమల సాహితీ పత్రికలో నేను రాసిన ఎడిటోరియల్ వ్యాసం. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపండి. మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలతో.. ‘గెలిస్తే ఏమొస్తుంది? మహా అయితే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. అదే ఓసారి ఓడిపోయి చూడు ప్రపంచం మొత్తాన్ని నువ్వు చూడవచ్చు. ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో నువ్వు తెలుసుకోవచ్చు’ అంటాడు మైఖేల్ మొనేట్ అనే ఓ మనోవైజ్ఞానిక నిపుణుడు. విజయం -అపజయం, గెలుపు – ఓటమి..! ఎంత

విమల సాహితి ఎడిటోరియల్ 19 – ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం. Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 18 – యుద్ధం – ఓ అంతర్గత గాయం – ఓ నెత్తుటి శకలం

సామ్రాట్ అశోకుడు ధర్మ ప్రభువు ఎప్పుడు అయినాడు? ప్రపంచ చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన ధర్మచక్రాన్ని ఎప్పుడు నిర్మించాడు? తనని నమ్ముకున్న ప్రజలకు సుభిక్షమైన సలక్షణమైన పాలనను ఎప్పుడు అందించాడు? ఒక్కసారి చరిత్రపుటల్లో తిప్పి చూస్తే 261 బి.సి. కాలంలో ఇప్పటి భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రము అప్పటి కళింగ ప్రాంతం. సకల కళా నైపుణ్యాలతో, విశాలమైన సంస్కృతి, ఆర్ధిక వనరులతో అలరారే “ఉత్కళ” ప్రాంతాన్నిఅశోకుని ముత్తాత చంద్ర గుప్త మౌర్యుడు దాడి చేసి ఆక్రమించడానికి విఫల ప్రయత్నం

విమల సాహితి ఎడిటోరియల్ 18 – యుద్ధం – ఓ అంతర్గత గాయం – ఓ నెత్తుటి శకలం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 17 – వందే మాతరం..వందే భారతం !!

వందే భారత్ రైళ్ళు ఎవరికోసమండీ..? ఈ రోజు విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి. “బండీర పొగ బండీర.. దొరలెల్లే రైలు బండీర.. దొరసానులెల్లే బండీర” మనదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ తెల్ల దొరలు, దొరసానులు పొగ రైలు బండ్లలో తిరుగుతుంటే, వారి భోగాన్ని చూసి మన దేశ జానపదులు పాడుకున్న పాట ఇది. వయో వృద్ధులైన కొంతమందికైనా ఈ పాట గుర్తుండే ఉంటుంది. దేశానికీ స్వాతంత్రం వచ్చి

విమల సాహితి ఎడిటోరియల్ 17 – వందే మాతరం..వందే భారతం !! Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 16 – మేధావులారా..మేల్కొనండి..

మేధావులారా ..మేల్కొనండి. ఈ వారం విమల సాహితి పత్రికలో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి. మనసు లేని మనుషులు పుట్టుకొస్తున్నారు. కళ్ళు చెమ్మగిల్లడం మానేశాయి. కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. సాధించిన విజ్ఞానాన్ని నెత్తికెత్తుకుని భవిష్యత్ వైపుకు పరుగులు తీస్తూ మన సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న ఓ మహా మేధావుల్లారా..! దయచేసి మీ బిడ్డలకైనా జీవితపు విలువల గురించి కాస్త నేర్పించండి. అన్ని దేశాల సంస్కృతులు వేరు. మన దేశ సంస్కృతి వేరు. కన్న వారిని కావడిలో

విమల సాహితి ఎడిటోరియల్ 16 – మేధావులారా..మేల్కొనండి.. Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 15 – బేబీ… ఐ లవ్ యూ

Baby…..I Love You..Be Always Beautiful Yourself  బయట ఎవరితోనో కాదు. నీతో నువ్వు గాఢంగా ప్రేమతో మునిగిపో.. ఈ వారం విమల సాహితీ సంపాదకీయం. చదవండి.మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఆహా..! ఎంత మధురంగా ఉన్నాయి ఈ మాటలు. నవ యవ్వనపు వీణల తంత్రులన్నీ ఒక్కసారిగా కోటి రాగాలను ఆలపించినట్లు. ప్రేమికుల మధ్య ఆ తొలివలపు మధురిమలు చూస్తుంటే మనసు, తనువూ పులకరించిపోదా..! ప్రేమను పొందని బతుకెందుకు? చరిత్రలో ప్రేమకు దాసోహం అవని ఏ రాజైనా

విమల సాహితి ఎడిటోరియల్ 15 – బేబీ… ఐ లవ్ యూ Read More »