Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

నేల తల్లి

మిత్రులకు నమస్కారాలు. 2021 సంవత్సరంలో నా మొదటి కవిత ” సృజనప్రియ” మాసపత్రిక జనవరి సంచికలో. తన బిడ్డ [రైతు] కోసం ఓ అమ్మ [సాగు నేల] పడే ఆవేదనే ఈ కవిత “నేల తల్లి “. నువ్వు కవిత రాయాల్సిందే అంటూ ప్రోత్సహించిన “సృజనప్రియ” సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారికి ధన్యవాదాలతో… సాగునేలను అన్నం పెట్టే తల్లిలా ఆరాధించి, తన ఒంట్లో శక్తి ఉడిగిపోయేదాకా నేలతల్లి మీద ఆధారపడ్డ మా నాయన కవితే […]

నేల తల్లి Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 29 – కొత్త రెక్కలు – నింగి అంచులు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం. ఫేస్ బుక్ మిత్రులందరికీ, విమల సాహితీ పత్రిక పాఠకులకు, నా ప్రియ సహ సంపాదకులకు నూతన సంవత్సర(2024) శుభాకాంక్షలు విమల సాహితీ పత్రికలో సంపాదకీయం రాసే గొప్ప అవకాశం నాకు కల్పించిన డా.జెల్ది విద్యాధర రావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలుసంపాదకీయం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఆహా..! కాలం బహు చిత్రమైంది. చాల టక్కరిది. పోయిన జనవరి మొదటి తారీఖున కూడా కొత్త సంవత్సరం

విమల సాహితి ఎడిటోరియల్ 29 – కొత్త రెక్కలు – నింగి అంచులు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 28 – నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు

“నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు” ఈ వారం విమల సాహితీ సంపాదకీయ వ్యాసం చదివి, మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. మిత్రులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు “ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా నా వద్దకు రండి. నేను మీకు స్వస్థతను కలుగచేతును” అద్భుతమైన ఈ వాక్య సంపదను చూసారా..? ఇది సరిగ్గా నా కొరకే చెప్పబడింది అని ప్రతిఒక్కరికీ అనిపిస్తోంది కదా. నిత్య జీవితంలో మానవులు ఎన్ని రకాలుగా కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు.

విమల సాహితి ఎడిటోరియల్ 28 – నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 27 – ఉచితం ఉచితమా..? అనుచితమా..?

” ఫ్రీ ఫ్రీ ఫ్రీ” ఫ్రీగా వస్తే ఫినాయిల్ ని అయినా వదులుకోకూడదు అని మనం సరదాగా వింటుంటాం. మరి తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనిపై ఎన్నో జోకులు, సెటైర్లు, వ్యంగ్య కార్టూన్లు. ఈ అంశం గురించి ఈ రోజు విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం ” ఉచితం..ఉచితమా? అనుచితమా?” చదివి, మీ అభిప్రాయాలు కూడా ఇక్కడ పంచుకోండి నేస్తాలు.. ఫ్రీ – ఫ్రీ –

విమల సాహితి ఎడిటోరియల్ 27 – ఉచితం ఉచితమా..? అనుచితమా..? Read More »

సినాప్సెస్

“బహుళ” పత్రిక ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికలో నా కవిత “సినాప్సెస్”. జ్వలిత మేడం కి ధన్యవాదాలతో. చిన్న కవిత చదవండి. బాధతో వ్రాసిన కవిత. అభినందనలు కాదు మీ అభిప్రాయం తెలుపండి నీ జన్మస్థానం ఎక్కడో ఎరుకైననాడు విశ్వపుత్రుడవవుతావు నువ్వు ఆకులలమలతో ఒంటిని కప్పుకున్న రాతిగుహల నుంచి బయటపడి చాల కాలమైంది నువ్వు కాళ్ళు చేతులు చెవులు కళ్ళు లాంటి రెండు సాధారణ అవయవాలే మా దేహాల్లో ఇమిడి ఉన్న రెండు రొమ్ములు ఎదురుపడిన స్త్రీ

సినాప్సెస్ Read More »

అక్షర కాంతులు

ఈరోజు నమస్తే తెలంగాణా పత్రిక ఆదివారం అనుబంధం “బతుకమ్మ” లో నా “నల్ల సూరీడు” కథల సంపుటి పై చిరు సమీక్ష. నమస్తే తెలంగాణా పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో

అక్షర కాంతులు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 26 – అన్యత్వ – అనన్య

ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “అన్యత్వ-అనన్య” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి మానవ జాతి ఏర్పడడానికి లక్షల సంవత్సరాల ముందు ఈ విశ్వంలో ముందుగా జలావరణాలు ఏర్పడ్డాయి. మొట్టమొదటిసారిగా సముద్ర జలాల్లో ఎమినో ఆమ్లాల రూపంలో జీవం పుట్టుకకి అంకురార్పణ జరిగింది. భూవాతావరం జీవనానికి అనుకూలించడం ప్రారంభమైనాక కొన్ని వేల సంవత్సరాలు గడిచాక ఎన్నో జీవులు ఏర్పడి, కొంతకాలం జీవించి , ప్రకృతిలోని అసమతుల్య వాతావరణాలవల్ల ఎన్నో వందలు,వేలు జీవులు

విమల సాహితి ఎడిటోరియల్ 26 – అన్యత్వ – అనన్య Read More »

బిడ్డ నేర్పిన పాఠం

ఈనాటి నవ తెలంగాణ పత్రిక సోపతి “నెమలీక” శీర్షికలో నేను రాసిన బాలల కథ “బిడ్డ నేర్పిన పాఠం” ప్రచురితం అయింది. నవ తెలంగాణ సంపాదక వర్గానికి నా ధన్యవాదాలు. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹 సాయిలు ఐదో తరగతి చదువుతుండె. చాల తెలివిగలవాడు. సాయంత్రం బండి నించి అచ్చినంక అర్ధ గంట దోస్తులతో ఆడుకొని, ఇంటికచ్చి ముఖం కడుక్కున్నాడు. అమ్మ ఇచ్చిన సర్వపిండి నములుకుంటా సోషల్ బుక్ తీసి చదువుకుంటుండె. ఇంటి

బిడ్డ నేర్పిన పాఠం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 25 – పులిరాజాలు ఏం చేస్తున్నారు..?

“పులిరాజ” గుర్తు ఉన్నాడా మీకు? మర్చిపోయి ఉంటే ఓ సారి ఈ సంపాదకీయం చదివి గుర్తు తెచ్చుకోండి మిత్రాస్. ఆరోగ్యమే సకల భాగ్యాల సమ్మేళనం అని తెలుసుకుని అందరం ఆనందంగా జీవితం గడపాలని కోరుకుంటూఈ రోజు “విమల సాహితీ పత్రిక” ఎడిటోరియల్ వ్యాసం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి డిసెంబర్ మాసం ఇష్టసఖి లాంటిది. చిరుజల్లులు ఒకపక్క, పిల్ల తెమ్మెరలు మరోపక్క, లేత నీరెండ ఇంకోపక్క ఒంటిని తాకుతుంటే ఎంత మానసికోల్లాసం. చామంతులు, ముద్ద బంతులు,

విమల సాహితి ఎడిటోరియల్ 25 – పులిరాజాలు ఏం చేస్తున్నారు..? Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 24 – చూపుడు వేలు ఆయుధమైన వేళ

“విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో ఈరోజు నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి  “నాయకులకు నువ్విప్పుడు దేవుడివినీ కోసం చేస్తారు ఎన్నెన్నో ఊడిగాలునీ చుట్టూ చేస్తారు ప్రదక్షిణాలువీలైతే నిన్నెత్తుకుని ఊరేగిస్తారుమాయలో పడ్డావో నీకుండదు భవితచూపుడు వేలే ఇప్పుడు నీ వజ్రాయుధంఅనర్హులకు వేసే ఓటుఅది చేస్తుంది నీకు చేటువిజ్ఞతతో నీవు వేసే ఓటుఅది వేస్తుంది నీ ప్రగతికి పై మెట్టు” నవంబర్ మాసంలో చిరుచిరు చలిగాలులు. అయినా అటు నాయకులు, ఇటు ప్రజల మనసుల్లో

విమల సాహితి ఎడిటోరియల్ 24 – చూపుడు వేలు ఆయుధమైన వేళ Read More »