Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

తలలు – మొండాలు

ఈ వారం నవతెలంగాణ సోపతిలో నేను రాసిన కవిత “తలలు-మొండాలు”. సోపతి సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి మమ్మల్నిన్కా పూలతో తీగలతో పోల్చకండి మా ఒంపుసొంపుల్ని మీ కావ్యకపటాల్లోకి నెట్టకండి త్యాగాలు మీ వంతు అంటూ ఆంక్షలు విధించకండి.. మా వేదనలను వినే సమయం మీకులేదు మా సమయాలను మాత్రం మీకోసం లాక్కోకండి.. ప్రేమ దోమ అంటూ మా వెనుక పడకండి ప్రేమికుల రోజంటూ పూలబొకేలు ఇవ్వకండి.. మీ మాయలోపడి […]

తలలు – మొండాలు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 34 – కదలి వస్తున్న సాహితీ పండుగ

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం ” కదలి వస్తున్న సాహితీ పండుగ” చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి మనకు సంక్రాంతి, దసరా రంజాన్ ,క్రిస్మస్, లాంటి పండుగలు ఎన్నో ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లాంటి జాతీయ పండుగలూ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటితో పాటు మరొక కొత్త పండుగ కొత్త సంవత్సరం మొదట్లోనే మన ముందుకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లా దూసుకుని వచ్చేస్తోంది. భాగ్యనగరంలో

విమల సాహితి ఎడిటోరియల్ 34 – కదలి వస్తున్న సాహితీ పండుగ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 33 – సర్వసత్తాక – సామ్యవాద – ప్రజాస్వమ్య – లౌకిక – గణతంత్ర…!!

“సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర” ఈ నాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి భారత ఖండం ప్రపంచదేశాల మధ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. అపారమైన ప్రకృతి వనరులు, ఖనిజాలు, జంతు, వృక్ష సంపదలు కలిగిఉన్న దేశం మనది. ఈ సంపదలతో పాటు అసంఖ్యాకమైన మానవ వనరులు కలిగినది మన హిందూస్తాన్. కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు అంతా మనదే. అంతా మనకే.

విమల సాహితి ఎడిటోరియల్ 33 – సర్వసత్తాక – సామ్యవాద – ప్రజాస్వమ్య – లౌకిక – గణతంత్ర…!! Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 32 – పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై

ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.. “వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు” అనే నానుడి మనకు తెలుసు. నిర్దోషికి శిక్ష పడటం విచారకరమే కానీ వంద మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకుని సమాజంలోకి పొతే ఏమౌతుందో తెలుసా..? దేశం నేరాల మయం అవుతుంది. మృగాలు వీధుల్లో తిరుగుతూ పైశాచిక క్రీడలు సాగిస్తాయి.

విమల సాహితి ఎడిటోరియల్ 32 – పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై Read More »

“నల్ల సూరీడు” కథల సమీక్ష

ఈనాటి ప్రజాశక్తి “స్నేహ” లో నా “నల్ల సూరీడు” కథల సంపుటి గురించి సమీక్ష. స్నేహ సంపాదకులకు, జ్యోతిర్మయి గారికి ధన్యవాదాలతో..

“నల్ల సూరీడు” కథల సమీక్ష Read More »

ముగ్గంటే

పండుగ అయిపోయినా జ్ఞాపకాలు గుండెల నిండా ఉంటాయి. నేటి నిజం పత్రికలో నా కవిత “ముగ్గంటే”. బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 17-2-2024 మా పెళ్ళి రోజు సందర్భంగా ఆశీస్సులు అందించిన మిత్రులందరికీ ప్రేమాత్మకమైన ధన్యవాదాలు వాకిట్లో నాలుగు చుక్కలు పెట్టి రంగులేయడం కాదు ముగ్గంటే నలుగురు మనుషులను కూడగట్టడం వాకిళ్లు చిమ్మి కళ్ళాపి చల్లే పనిమనుషుల సందడి పేడకళ్ళకోసం వీధుల్లో పోటీపడి తిరిగే అమ్మలక్కలు రాతి ముగ్గుపిండి రతనాల పిండి మల్లెపువ్వంటి పిండి సమయానికి తగుమాటలల్లి

ముగ్గంటే Read More »

ఉత్సవం

ఈ వారం “సృజన క్రాంతి” సాహితీ పేజీలో నా కవిత “ఉత్సవం” చదవండి. శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారికి ధన్యవాదాలు. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి చలి జూలు విదిలించి కొట్టే ఓ ప్రభాతంలో ఉన్ని చొక్కానో, శాలువాతోనో రహదారుల్లో ఆగని ఉదయపు నడకలు.. వెచ్చని నెగళ్ళ కోసం వెతుకులాటలు ఇరానీ హోటల్లో పొగలు కక్కుతున్న గరం గరం చాయ్ తేనేటి కోసం తేనెటీగల్లా బారులు తీరిన జనం.. నిమ్మ, నారింజ, జామ, సీతాఫలాలు సీజనల్

ఉత్సవం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 31 – హేమంత సీమంతోత్సవం

“హేమంత సీమంతోత్సవం” ఈనాటి విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి. మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు హేమంత మాసం. చిరు చీకట్లు, సోమరిగా వీచే చల్ల గాలులు, చలిమంటలు, ఉషోదయ తుషార జల్లులు, ఇరానీ చాయ్ పొగలు, కంబళ్ళు, శాలువాలు కప్పుకుని ఉదయపు నడకలు, సుదీర్ఘమైన చీకటి రాత్రులు. “హేమంతం కృషీవలుల సీమంతం” అంటాడు ఓ కవి. “ప్రియురాలి కౌగిలిలో నెగళ్లు రగిలించి వెచ్చగా చలి కాచుకునే కాలం”

విమల సాహితి ఎడిటోరియల్ 31 – హేమంత సీమంతోత్సవం Read More »

విద్యయా అమృతమశ్నుతే

ఈ రోజు నవ తెలంగాణ “సోపతి”లో ప్రచురితమైన నా కథ “విద్యయా అమృతమశ్నుతే” తో ఈ సంవత్సరం 2024 నా సాహితీ పయనానికి శ్రీకారం చుట్టబడింది. నవ తెలంగాణ సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹 దిగ్గున లేచికూర్చున్నాడు ప్రణీత్. చుట్టూ చిమ్మ చీకటి. గదిలో సన్నటి బెడ్ లాంప్ వెలుతురుకు అలవాటుపడ్డాయి ప్రణీత్ కళ్ళు. పక్క మంచాలమీద పడుకున్న అతని రూంమేట్స్ దుప్పటి ముసుగేసి గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. అతన్ని మాత్రం నిద్రాదేవి

విద్యయా అమృతమశ్నుతే Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 30 – ఉడుకు నెత్తురు – ఉక్కు నరాలు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయం “ఉడుకు నెత్తురు – ఉక్కు నరాలు”. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు జరుపుకుని అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి. రెక్క విప్పుకున్న గువ్వ పిట్టని ఎగరనీయకుండా ఆపడం ఎవరికైనా సాధ్యమా..? అదేవిధంగా కాలాన్ని ముందుకుపోనీకుండా ఆపడం, సూర్యుడి తేజస్సుకి అరచేయి అడ్డుపెట్టి ఆపడం కూడా ఎవరితం కాదు. అందుకే అంటారు ధనం, గొప్ప పేర్ల కంటే విలువైనది కాలం.

విమల సాహితి ఎడిటోరియల్ 30 – ఉడుకు నెత్తురు – ఉక్కు నరాలు Read More »