Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

విమల సాహితి ఎడిటోరియల్ 49 – చెదురుతున్న గూళ్ళు

భూమి దినోత్సవం సందర్భంగా ఈనాటి ‘విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక ‘ లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి పక్షి శత్రువులనుంచి తనను తాను రక్షించుకోవడానికి, గుడ్లను పొదిగి పిల్లలను సంరక్షించడానికి, వాతావరణ మార్పులు తట్టుకోవడానికి, నానా యాతనలు పడి పుల్లాపుడక తెచ్చుకుని ఓ చెట్టు కొమ్మలో గూడునల్లుకుంటుంది. అంతే ఇక ఆ పక్షికి నిశ్చింత. ఆ గూటీని ఎన్నడూ వదలదు. ఏ తుఫాను గాలి గూటిని చెరిపేస్తేనో, ఏ గొడ్డలివేటు […]

విమల సాహితి ఎడిటోరియల్ 49 – చెదురుతున్న గూళ్ళు Read More »

అయిపు

ఏడాదేగా అయింది నేర్చుకున్న పాఠాలు అప్పుడే మరిచావా.. పునఃశ్చరణ చేసుకోవడం పనికిమాలినదంటావా. నియమాలన్నీ గాలికొదిలేసావా.. నిందలన్నీ ఎదుటివారిమీదకే నెట్టేస్తావా.. ఆత్మపరిశీలన అనవసరం అనుకున్నావా.. ఇకనైనా అప్రమత్తం కాకుంటే నీ రక్షణ కోసం సంభవామి యుగే యుగే అంటూ దేవుడు వస్తాడో లేడో కానీ నీ భక్షణ కోసం సంభవామి పదే పదే అంటూ సైతాను మాత్రం కొత్త శక్తులను కూడకట్టుకుని కోటానుకోట్లుగా నీ ఊపిరిలోకి ఉప్పెనలా దూసుకొస్తోంది నాకేం కాదనే ధీమాని వదిలిపెట్టి పునఃశ్చరణ పాఠాలు మొదలుపెట్టు

అయిపు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 48 – కరిగే మంచు కొండ

ఫాథర్స్ డే సందర్భంగా ఈ రోజు విమలసాహితి ఆన్లైన్ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం “కరిగే మంచు కొండ” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. మాతృదేవోభవ..పితృదేవోభవ.. లోకంలో తల్లిదండ్రులను, చదువు నేర్పిన గురువులను, ఇంటికి వచ్చిన అతిధులను దేవునితో సమానంగా పూజించాలి అనేది మనకు తెలిసిన నిత్యసత్యం. అంటే మనిషి జీవితంలో ప్రాధాన్యతల క్రమం తీసుకుంటే తల్లిదండ్రుల పాత్ర అతి ప్రాముఖ్యత కలిగింది. ఓ సృష్టి జరగాలంటే, తల్లిగర్భంలో ఓ పిండం ఏర్పడాలంటే తల్లిదండ్రుల ఇద్దరిపాత్ర

విమల సాహితి ఎడిటోరియల్ 48 – కరిగే మంచు కొండ Read More »

మకరందం

ఈ నెల[జూన్] విశాలాక్షి మాసపత్రికలో నా కవిత “మకరందం” ప్రచురితం అయింది. శ్రీ ఈత కోట సుబ్బారావు గారికి ధన్యవాదాలు. “మకరందం” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపండి. ఎర్ర చందనపు చెక్కలు కావుసుగంధం వెదజల్లలేవుమల్లెపూల పరిమళాలు కావుమైమరపించలేవుదేహపు విసర్జితాలన్నీ దుర్గందాలేనీలో నాలో అందరిలోకానీ ..పెదవి దాటి వచ్చే మాటొక్కటే మకరందంమాట్లాడితే మనసు తేలికవ్వాలిమాట హృదయ వీణను మీటాలికరువు నేలను వాననీటి చుక్క తడిపినట్లుమాట గుండె బరువును దింపేయాలిమాట వెన్నెల్లో జాబిలి అవ్వాలిజాజిపూల పరిమళంలా మనసును చుట్టేయాలిమాట

మకరందం Read More »

మహారాజు

మహారాజు – ఓ మంచి తాగుబోతు. ఈ నెల కౌముది పత్రికలో ప్రచురితం అయిన నా బహుమతి కథ. సంపాదకులకు కృతఙ్ఞతలు. మహారాజు కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి. “రేయ్ ..రవనా ..లెగరా..బారెడు పొద్దెకుండాది, రేతిరి తాగింది ఇంకా దిగినట్టులేదు ఈడీకి” అనుకుంటా రవణడిని కుదిపాడు రిక్షాసుధాకర్. మొండి గోడ కింద పగటికి రాత్రికి తేడా తెలియని సుప్తావస్థలో పడుకున్న జీవిలాగా పక్కకి పొర్లాడు రవణడు కళ్ళు మూసుకొనే.“తూ..ఎదవ నాయాలా..! నిన్ను నమ్ముకోని బంగారంటి

మహారాజు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 42 – ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు

“ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు”. ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. డాక్టర్ బి.అర్. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్ “నేలతో నీడ అన్నది నను తాకరాదని – పగటితో రేయి అన్నది నను తాకరాదని”. ఇక్కడ కవి చమత్కారం ఎలా ఉన్నా ఎన్నో శతాబ్దాలుగా, ఎన్నో తరాలుగా అంటరానితనమనే ఒక అమానవీయ వైఖరి మనిషిని మనిషి తాకకుండా కట్టడి చేస్తోంది.

విమల సాహితి ఎడిటోరియల్ 42 – ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు Read More »

దిశ మార్చుకో

మహిళా ఉద్యమ కరదీపిక ” మానవి” ద్వైమాసపత్రిక మార్చి -ఏప్రిల్ 2024 సంచికలో నా కథ “దిశ మార్చుకో” ప్రచురితం అయింది. సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. “దిశ మార్చుకో” కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి నన్ను నేను తిట్టుకోవడం అప్పటికి వందోసారి. అమ్మ తోడుగా వస్తాను అంటే ” ఎందుకమ్మా… ఇంటర్వ్యూ ఎంతసేపు చేస్తారని, లంచ్ లోపలే అయిపోతుంది నేను వచ్చేస్తాలే… నువ్వు విశ్రాంతి తీసుకో అనడం నాది బుద్ది తక్కువ అయింది. నాలుగు

దిశ మార్చుకో Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 41 – షడ్రుచుల ఈద్ ముబారక్

“షడ్రుచుల ఈద్ ముబారక్” ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి వసంతం – శరత్తు – హేమంతం, ఈ ఆమనీ బ్రతుకులో ఈ మూడే ఋతువులు. ప్రకృతిలో ఉన్నవి ఆరు ఋతువులు అయినా మనిషి జీవితంలో ఈ మూడే ఋతువులు ఉండాలి అని కవి ఎంత చమత్కారంగా అన్నాడో. ఎండలు మండే గ్రీష్మం, చిరుజల్లులను తుఫానులుగా కూడా మార్చేసే వర్ష ఋతువు, ఆకులు రాల్చే

విమల సాహితి ఎడిటోరియల్ 41 – షడ్రుచుల ఈద్ ముబారక్ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 40 – పసుపు ముద్ద – గాజులు

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “పసుపు ముద్ద – గాజులు”, చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి “హు..! శత్రువులను చూసి సమరానికి కాలు దువ్వకుండా పిరికి పందలా వెన్ను చూపి వస్తివా..అదిగో అక్కడ మంచం చాటున పసుపు ముద్ద, గాజులు పెట్టాను. పోయి పసుపు పూసుకుని, గాజులు వేసుకో పో” యుద్దానికి భయపడి లేదా యుద్ధంలో ఓడిపోయి తిరిగి వచ్చిన రాజులను చూసి ఓ వీర మాత, ఓ

విమల సాహితి ఎడిటోరియల్ 40 – పసుపు ముద్ద – గాజులు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 39 – సంతోషమా..! ఏది నీ చిరునామా..?

సంతోషమా..! ఏది నీ చిరునామా? ఈ నెల 20న World Happiness Day సందర్భంగా ఈ వారం ‘విమల సాహితీ పత్రిక ‘ లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఏడాదికి 365 రోజులు. ప్రతి రోజు ఓ ప్రత్యేక దినమే. మదర్స్ డే, ఫాథర్స్ డే, ప్రేమికుల దినోత్సవం, సైనిక దినోత్సవం. ఏడాది పొడవునా ప్రత్యేక దినాలే. నవమాసాలు మోసి, ప్రసవ వేదన అనుభవించి, జన్మనిచ్చిన అమ్మ త్యాగానికి, ప్రేమకు

విమల సాహితి ఎడిటోరియల్ 39 – సంతోషమా..! ఏది నీ చిరునామా..? Read More »