Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

శ్వేత గులాబీల తోట

నెల్లూరు లో ప్రముఖ వైద్యులు డా. ఈదూరు సుధాకర్ గారి అకాల మరణానికి చింతిస్తూ ఆయన స్మృతి చిహ్నంగా రాసిన ఈ కవిత “శ్వేత గులాబీల తోట” విశాలాక్షి మాస పత్రికలో మే 2019 సంచికలో ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. ————————————————————————————————————————– శ్వేత గులాబీ తోట చిన్న బోయిందిపుడు. తోటమాలి చిరునవ్వుల పలకరింపు లేక ఒక్కొక్క పాదులో ఒక్కో మొక్క వేసి , చెట్టు చెట్టుకు ఒక్కో పేరు పెట్టి, స్పర్శ, ప్రకృతి, […]

శ్వేత గులాబీల తోట Read More »

విశ్వ విజేతలవుదాం

నేను వ్రాసిన క్రింది కవిత “విశ్వ విజేతలవుదాం” నెచ్చెలి అంతర్జాల పత్రికలో ప్రచురింపబడినది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. ————————————————————————————————————————– తిరుగుబాటు – పోరుబాట రణరంగంలో యుద్ధం… ప్రాచీన చరిత్ర లో రాజులకు రాజులకు మధ్య రాజ్యాలకు రాజ్యాలకు మధ్య రాజ్య కాంక్షతో రక్తాన్ని ఏరులై పారించారు… చివరికి అందరి ప్రాణాలు గాల్లో అన్నీ కట్టెలు మట్టిలో…. ఆధునిక చరిత్ర లో ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య దేశానికీ దేశానికీ మధ్య కులానికీ కులానికీ మధ్య మతానికీ

విశ్వ విజేతలవుదాం Read More »

స్పర్శ

నేను వ్రాసిన క్రింది కవిత “స్పర్శ” మాలిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడినది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. చంటి బిడ్డకే తెలుసు అమ్మపొత్తిళ్ళలోని వెచ్చదనపు స్పర్శ… ఎడారిలో ఎండమావికే తెలుసు ఎప్పుడో ఏనాటికో నింగి నుండి జారి పడే వాననీటి స్పర్శ… యుద్ధవీరునికే తెలుసు విజయం వరించినపుడు భుజం తట్టి అభినందించే అనుంగుల చేతి స్పర్శ… నిరాశ నిండిన మనసుకే తెలుసు, జీవితంలో ఏది సాధించలేని ఓటమి స్పర్శ… ఓటమికే తెలుసు, ఓడిపోయినా వీడిపోక వెన్నుతట్టి

స్పర్శ Read More »

పెట్టెలో బొమ్మ

క్రింది కవిత “పెట్టెలో బొమ్మ” నవ్య వీక్లీ లో ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. ————————————————————————————————————————- అర్థరాత్రి ఏ జాములోనో నిద్దర్లో ఏ దుస్వప్నాన్ని తిలకించాడో ! బిడ్డ ఉలిక్కిపడి తల్లిని హత్తుకుని అమ్మా! నాన్నేప్పుడొస్తాడే! అడిగాడు వస్తాడు నాన్న శూరుడై , ధీరుడై ఉగ్రవాద ఉక్కు పాదాన్ని పాతాళానికి నెట్టివేసి, విజయ కేతనాన్ని ఎగరేసి వీరుడై వస్తాడు! మరి నాన్న వచ్చేటప్పుడు పెట్టి నిండా నాకు బొమ్మలు తెస్తాడా? తప్పకుండా అన్నదమ్మ. పెట్టెలో

పెట్టెలో బొమ్మ Read More »

సంఘర్షణ

నేను వ్రాసిన క్రింది కవిత “సంఘర్షణ” మాలిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడినది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. ” నిరంతర ఘర్షణ క్షణ క్షణం కీచులాట నాలోని నాస్తిక, ఆస్తికత్వాలకు… తక్కెడలో తూకపు వస్తువుల్లా ఒకసారి నాస్తికత్వం పైకొస్తే మరోసారి ఆస్తికత్వానిది పై చేయి అవుతుంది… అరాచకాలు,అబలల ఆక్రందనలు, పసిమొగ్గల చిదిమివేతలు చూసినపుడు మనిషి ఉలితో చెక్కి దేవుణ్ణి చేసిన రాతిబొమ్మ హృదయం లేని పాషాణమే అని నాలోని నాస్తికత్వం వేదనతో గొంతు చించుకుంటుంది… మళ్ళీ

సంఘర్షణ Read More »

అందం

క్రింది కవిత “అందం” విశాలాక్షి మాస పత్రికలో ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. ————————————————————————————————————————- ముఖం మీద ఒక్క ముడత్తెనా ఉండకూడదు.. ఒక్క మచ్చ అయినా కనిపించకూడదు ఆరెంజ్ పీల్ ప్యాక్, ముల్తానీ ఫేస్ ప్యాక్, ఆరు పొరల మందాన మేకప్ క్రీం వేసినా.. చిరునవ్వు ఆభరణంగా లేని ముఖారవిందానికి వ్యర్థమేగా… అరచేతినించి మోచేతిదాక గాజులు ధరించినా ఆ చేతికి,సాయమడిగే మరోచేతికి చేయూతనీయకపోతే ఆ గాజుల సవ్వడి వ్యర్థమేగా.. ముడతలు పడిన మెడనించీ, హ్రుదయందాక

అందం Read More »

తియ్యదనం

నేను వ్రాసిన క్రింది కవిత “తియ్యదనం” మాలిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడినది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. ————————————————————————————————————————- కెజియా వచ్చి ప్రార్థన చేసిన కేకు తెచ్చి ఇచ్చింది… రంజాన్ నాడు రజియా వచ్చి షీర్ కుర్మా రుచి చూడమంది… దసరా పండుగ నాడు విజయ వచ్చి అమ్మ వారి ప్రసాదం చక్కెర పొంగలి తెచ్చి నోట్లో పెట్టింది… అన్నింటిలోనూ ఒకటే తియ్యదనం… అదే మనందరినీ కలిపే మానవత్వం… అనురాగపు వెల్లువలో అందరం తడిసి మురిసే

తియ్యదనం Read More »

నిర్మాల్యం

క్రింది కవిత “నిర్మాల్యం” సాహిత్య ప్రస్థానం మాస పత్రిక లో నవంబర్ 2019 సంచికలో ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. ————————————————————————————————————————– గతం… గ్రీష్మపు వేడిమికి కరిగిపోయిన ఓ మంచు ముక్క కలం పాళిలో ఇంకిపోయిన ఓ ఆఖరి సిరా చుక్క. పండగ సంబరాల అంతిమ ఘట్టంలో మిగిలిపోయిన ఓ నిర్మాల్యం.. వేడుకల అనంతరం నిమజ్జనం అయిపోయే ఓ మట్టి పెళ్ళ.. వెనుకకు తిప్పలేని ఓ గడియారపు ముల్లు.. శరత్ కాలపు చెట్టు కింద

నిర్మాల్యం Read More »

ఎన్ని ఉగాదులొస్తేనేం

క్రింది కవిత “ఎన్ని ఉగాదులొస్తేనేం” ప్రజా శక్తి స్నేహ వీక్లీ లో 31-03-2019 న ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయాలూ తెలుప ప్రార్ధన. ————————————————————————————————————————— ఎన్ని ఉగాదులొస్తేనేం కాంక్రీటు కీకారణ్యంలో భూతద్దమేసినా కానరాని పచ్చదనం కాలుష్యం కోరల కింద సమాధి అవుతుంటే మూగబోయింది కోకిలమ్మ కంఠస్వరం… ఎన్ని ఉగాదులొస్తేనేం… నీరులేక, నారులేక, మడులులేక నెర్రలు బారిన నేలలో కరువు దేవత కరాళ నృత్యం మాడుతుంటే పురుగుల కోసం తెచ్చిన మందే రైతన్న గొంతులో గరళంలా దిగి అచేతన అవస్థను

ఎన్ని ఉగాదులొస్తేనేం Read More »

మనిషి’లో’ చెత్త

క్రింది కవిత “మనిషి’లో’ చెత్త” నవ్య వీక్లీ లో 29-8-2018 న ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయండి. ————————————————————————————————————————— మనిషి స్పర్శించడం మానేశాడు కరచాలనాలు, ఆలింగనాలు, కంటి చూపులు చిరునవ్వుల చిత్తరువులు.. ఊహ.. ఏమి లేవిప్పుడు మనిషి స్పర్శేంద్రియాన్ని కోల్పోయాడు మనిషి ఘ్రాణించడం మానేసాడు మల్లెల మకరందాలు, మట్టి సువాసనలు పచ్చటి పొలాల పైరగాలుల పరిమళాలు ఆస్వాదన లేనే లేదిప్పుడు మనిషి ఘ్రాణేంద్రియాన్ని కోల్పోయాడు టీ.వీ. ముందో, ఐపాడ్, ఐఫోన్ లోని టచ్ స్క్రీన్ ని

మనిషి’లో’ చెత్త Read More »