బొట్టు
ద్వేషంతో చిమ్మే విషపుబొట్లు తప్ప ప్రతి బొట్టు మంచిదేగా. ఈ వారం “సహరి” వారపత్రికలో నా కవిత “బొట్టు”. సహరి సంపాదకులకు ధన్యవాదాలతో ఓ నెత్తుటి బొట్టుకోట్ల కణాలతో యుద్ధం చేసిగెలిచి నీకు జన్మనిస్తుంది ఓ వాన నీటి బొట్టుబీడు పడ్డ రైతన్న కళ్ళల్లోపన్నీటి జల్లు కురిపిస్తుంది ఓ తేనేటి బొట్టుశ్రమజీవి దేహపుచెమట బొట్లలో కలసిఇంధనమై శక్తినిస్తుంది ఓ కన్నీటి బొట్టుమనసులో ఉప్పొంగేవేదనాసాగరానికిసాంత్వననిస్తుంది భృకుటిపై సింధూరపు బొట్టుకుండలిని తాకినీలో విజ్జ్ఞతను మేల్కొలుపుతుందిబొట్టు మంచిదే..