Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

ముంగిట్లో ముత్యాలు

ఈ రోజు 19-12-2021 నవ తెలంగాణ ఆదివారం అనుబంధం సోపతి లో నా కవిత “ముంగిట్లో ముత్యాలు” ఓ పక్క చిరు చీకట్లు – మరోపక్క ఒణికించే తెమ్మెరలుఅయినా లెక్క చేయని పడతి మనోరథంలో జీవం పోసుకునిఆమె చూపుడువేలు, బొటనవేలు దీక్షగా కదులుతుంటేమధ్యన పువ్వు నుంచి రాలే పచ్చని పుప్పొడిలా రాలుతూకళ్ళాపి చల్లిన పచ్చటి ముంగిట్లో శ్వేతకాంతులనుసృష్టిస్తున్నాయి ముత్యాల చుక్కలు, రత్నాల ముగ్గులువిశిష్ట ధనుర్మాస ఉషోదయాన ప్రతి అతివా ఓ సృష్టికర్తేనింగి నుంచి వంగి హరివిల్లు తనలోని […]

ముంగిట్లో ముత్యాలు Read More »

తట్టుడీ మీకు తీయబడును

ఆరవ తరగతిలో తొలిసారి బడిలో చేరిన తొలిరోజు “యేసయ్య” గురించి తెలుసుకున్న బుజ్జమ్మ చెప్పిన కథ “తట్టుడీ మీకు టీయబడును”, ఈ నెల [డిసెంబర్] విశాలాక్షి మాసపత్రికలో. శ్రీ కోసూరి రత్నం సర్, శ్రీ ఈతకోట సుబ్బారావు సార్లకి ధన్యవాదాలతో. మిత్రులకు ముందస్తు “క్రిస్మస్” పండుగ శుభాకాంక్షలతో..🎄🎄🙏🙏 పైప్రాణాలు పైనే పోయి వొనకతా ఎనక్కి చూసినా. ఆడ మా హెడ్ మిస్సెస్ ఎలిజబెత్ టీచర్ బూట్లు టక టకలాడిస్తా చెక్క మెట్లు దిగి వస్తా ఉండాది. అప్పుటికి

తట్టుడీ మీకు తీయబడును Read More »

ధనాత్మకం

జీవితంలో మనిషికి ధనాత్మకంగా ఉండాల్సింది ఏమిటి ?. ఈ రోజు “విశాలాంధ్ర” ఆదివారం అనుబంధం లో నా కథ “ధనాత్మకం” ప్రచురితం అయింది. విశాలాంధ్ర సంపాదకులకు ధన్యవాదాలతో. మీరు కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా.. మిన్ను విరిగి మీద పడినా నాకేం కాదు. ధీమా అనేది నా రక్తంలోనే ఉంది. ఇటాంటివి ఎన్ని చూడలేదు నేను. ఈ మధుసూధన్ రావు అంటే ఎవరైనా, ఏదైనా గడగడలాడాల్సిందే.అయినా దేవి ఎందుకు అంత కంగారు పడుతుంది. చిన్న

ధనాత్మకం Read More »

మానవ హక్కులు

కులమత బేధాలను పెంచి పోషించివిద్వేషాలను రగిల్చేదొకరు..స్వార్థానికి విచ్చలవిడిగా వాడుతూప్రకృతిని వికృతం చేసేది ఇంకొకరు..శవాలకు కూడా కులం కుళ్ళుఅంటగట్టి చావును కూడా పండగచేసుకునే సైకోలు ఎందరెందరో..ప్రతి స్త్రీ అంగాంగాన్ని కామపు కళ్ళతోనిత్యం అత్యాచారం చేసే మృగపశువులుఇంకా ఎందరెందరెందరో..హక్కుల కోసం పోరాడే ముందుబాధ్యతలను ఒక్కసారి గుర్తుకు చేసుకుంటేఎంత పాతాళంలో ఉందో నీ వ్యక్తిత్వంనీకు నీవుగా ప్రశ్నించుకో..సమాధానం తెలిసిన రోజు నీవుమనిషిగామారినట్లే కదా..అప్పుడు నీ హక్కుల కోసమే కాదువిశ్వమానవ సౌభ్రాతృత్వం కోసంనువ్వు పోరాడతావు మనసున్న మనిషిగా వంజారి రోహిణి10-12-2021.

మానవ హక్కులు Read More »

అందమే ఆనందం

నవంబర్ నెల సాహో పత్రికలో అందమే ఆనందం మీ కోసం… “అధరం మధురం, వదనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం ” పాట విన్నారు కదా అండి. మరి అధరం, వదనం మధురంగా ఉండాలంటే సంతోషపు చిరుజల్లులు పెదవులనుంచి కురియాలంటే ముందు హృదయం పాల అంత స్వచ్ఛంగా వెన్న, అంత మృదువుగా ఉండాలి. కల్మషం లేని హృదయంలో కరుణ ఉంటుంది. మంచితనం ఉంటుంది. మనసు పొరల నుంచి వెలువడే ఆ స్వచ్ఛత మన ముఖంలో ప్రతిఫలిస్తుంటుంది. కాబట్టి

అందమే ఆనందం Read More »

టమాటా ఆవేదన

నేను టమేటా నండిరామ ములక్కాడ అని కూడా నన్ననేవాళ్ళండి మీ పెద్దోళ్ళునేనేప్పుడూ రంగులు మార్చనండీఏ కాలంలో అయినా ఎర్రగాగుండ్రంగానే ఉంటానండీకూరగాయలన్నింటిలోకి నేనేఅందంగా ఉంటాననిమీరందరూనన్నంటుంటే మురిసిపోతానండీపేద ధనిక కులం మతంతేడాలు నాకు తెల్వదండీఅందరి కడుపులు నింపడమేనా అభిమతమండీనాటు టమేటాగా ఉన్న నన్నుహైబ్రీడ్టమేటాగా మార్చింది మరి మీరేనండీకరువో,వరదో వస్తే తప్ప ప్రతిఏటా ఒకేలా కాపుకొస్తానండీమీ వంటింటి రుచుల్లో చట్నీ నోగ్రేవీనో, కర్రినో అవుతానండీఈ డిమాండ్, సప్లైల మాయాజూదమేంటో నాకు తెల్వదండీఆర్థిక సూత్రాలు అంటే కూడా నాకుఅసలికే తెలియదండీఇప్పుడు నన్ను కిలో

టమాటా ఆవేదన Read More »

నాన్న కోరిక

శుభోదయం. ఈ వారం సినీవాలి ఆన్లైన్ వారపత్రిక లో నేను వ్రాసిన కథ “నాన్న కోరిక” ప్రచురితం అయింది. సినీవాలి పత్రిక సంపాదకులు గౌరవనీయులు డా.శ్రీ ప్రభాకర్ జైనీ గారికి ధన్యవాదాలతో. మరి నాన్న కోరిక ఏమిటో తెలియాలంటే ఈ కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగకోరుతూ… పొద్దున ఐదున్నరకే గంటకొట్టినట్టు మెలకువ వచ్చేసింది సత్యనారాయణయ్యకు. మసక మసకగా కనిపిస్తున్న ఎర్రటి బెడ్ లైట్ వెలుగులోనే తడుముకుంటూ అడుగులు వేసి ఎదురుగా గోడకు గట్టి పురికొస

నాన్న కోరిక Read More »

నవనీతం

ముందుగా “బహుళ” త్రైమాసిక పత్రిక సంపాదకులు, ప్రముఖ కవులు, కథా రచయిత్రి శ్రీమతి జ్వలిత Jwalitha Denchanala Jwalitha గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా స్త్రీ లు ఎదుర్కొంటున్న వివక్షలు, సమస్యలు, పరిష్కారాలు, సలహాలు, చిట్కాలు,మనసుని రంజింపజేసే కథలు, కవితలు, సమీక్షలు, వ్యాసాలు తదితరాలతో రూపొందించబడిన అపురూపమైన పత్రిక “బహుళ”. సంపాదకురాలిగా ఎన్నో వ్యయ ప్రయాసలు తట్టుకుని, మరెన్నో చిత్కారాలను ఓర్పు తో సహించి పత్రికను ఎంతో ఉన్నత స్థాయిలో నిలపటానికి జ్వలిత గారి పట్టుదల, శ్రమ

నవనీతం Read More »