Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

ధనాత్మకం

జీవితంలో మనిషికి ధనాత్మకంగా ఉండాల్సింది ఏమిటి ?. ఈ రోజు “విశాలాంధ్ర” ఆదివారం అనుబంధం లో నా కథ “ధనాత్మకం” ప్రచురితం అయింది. విశాలాంధ్ర సంపాదకులకు ధన్యవాదాలతో. మీరు కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా.. మిన్ను విరిగి మీద పడినా నాకేం కాదు. ధీమా అనేది నా రక్తంలోనే ఉంది. ఇటాంటివి ఎన్ని చూడలేదు నేను. ఈ మధుసూధన్ రావు అంటే ఎవరైనా, ఏదైనా గడగడలాడాల్సిందే.అయినా దేవి ఎందుకు అంత కంగారు పడుతుంది. చిన్న […]

ధనాత్మకం Read More »

మానవ హక్కులు

కులమత బేధాలను పెంచి పోషించివిద్వేషాలను రగిల్చేదొకరు..స్వార్థానికి విచ్చలవిడిగా వాడుతూప్రకృతిని వికృతం చేసేది ఇంకొకరు..శవాలకు కూడా కులం కుళ్ళుఅంటగట్టి చావును కూడా పండగచేసుకునే సైకోలు ఎందరెందరో..ప్రతి స్త్రీ అంగాంగాన్ని కామపు కళ్ళతోనిత్యం అత్యాచారం చేసే మృగపశువులుఇంకా ఎందరెందరెందరో..హక్కుల కోసం పోరాడే ముందుబాధ్యతలను ఒక్కసారి గుర్తుకు చేసుకుంటేఎంత పాతాళంలో ఉందో నీ వ్యక్తిత్వంనీకు నీవుగా ప్రశ్నించుకో..సమాధానం తెలిసిన రోజు నీవుమనిషిగామారినట్లే కదా..అప్పుడు నీ హక్కుల కోసమే కాదువిశ్వమానవ సౌభ్రాతృత్వం కోసంనువ్వు పోరాడతావు మనసున్న మనిషిగా వంజారి రోహిణి10-12-2021.

మానవ హక్కులు Read More »

అందమే ఆనందం

నవంబర్ నెల సాహో పత్రికలో అందమే ఆనందం మీ కోసం… “అధరం మధురం, వదనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం ” పాట విన్నారు కదా అండి. మరి అధరం, వదనం మధురంగా ఉండాలంటే సంతోషపు చిరుజల్లులు పెదవులనుంచి కురియాలంటే ముందు హృదయం పాల అంత స్వచ్ఛంగా వెన్న, అంత మృదువుగా ఉండాలి. కల్మషం లేని హృదయంలో కరుణ ఉంటుంది. మంచితనం ఉంటుంది. మనసు పొరల నుంచి వెలువడే ఆ స్వచ్ఛత మన ముఖంలో ప్రతిఫలిస్తుంటుంది. కాబట్టి

అందమే ఆనందం Read More »

టమాటా ఆవేదన

నేను టమేటా నండిరామ ములక్కాడ అని కూడా నన్ననేవాళ్ళండి మీ పెద్దోళ్ళునేనేప్పుడూ రంగులు మార్చనండీఏ కాలంలో అయినా ఎర్రగాగుండ్రంగానే ఉంటానండీకూరగాయలన్నింటిలోకి నేనేఅందంగా ఉంటాననిమీరందరూనన్నంటుంటే మురిసిపోతానండీపేద ధనిక కులం మతంతేడాలు నాకు తెల్వదండీఅందరి కడుపులు నింపడమేనా అభిమతమండీనాటు టమేటాగా ఉన్న నన్నుహైబ్రీడ్టమేటాగా మార్చింది మరి మీరేనండీకరువో,వరదో వస్తే తప్ప ప్రతిఏటా ఒకేలా కాపుకొస్తానండీమీ వంటింటి రుచుల్లో చట్నీ నోగ్రేవీనో, కర్రినో అవుతానండీఈ డిమాండ్, సప్లైల మాయాజూదమేంటో నాకు తెల్వదండీఆర్థిక సూత్రాలు అంటే కూడా నాకుఅసలికే తెలియదండీఇప్పుడు నన్ను కిలో

టమాటా ఆవేదన Read More »

నాన్న కోరిక

శుభోదయం. ఈ వారం సినీవాలి ఆన్లైన్ వారపత్రిక లో నేను వ్రాసిన కథ “నాన్న కోరిక” ప్రచురితం అయింది. సినీవాలి పత్రిక సంపాదకులు గౌరవనీయులు డా.శ్రీ ప్రభాకర్ జైనీ గారికి ధన్యవాదాలతో. మరి నాన్న కోరిక ఏమిటో తెలియాలంటే ఈ కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగకోరుతూ… పొద్దున ఐదున్నరకే గంటకొట్టినట్టు మెలకువ వచ్చేసింది సత్యనారాయణయ్యకు. మసక మసకగా కనిపిస్తున్న ఎర్రటి బెడ్ లైట్ వెలుగులోనే తడుముకుంటూ అడుగులు వేసి ఎదురుగా గోడకు గట్టి పురికొస

నాన్న కోరిక Read More »

నవనీతం

ముందుగా “బహుళ” త్రైమాసిక పత్రిక సంపాదకులు, ప్రముఖ కవులు, కథా రచయిత్రి శ్రీమతి జ్వలిత Jwalitha Denchanala Jwalitha గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా స్త్రీ లు ఎదుర్కొంటున్న వివక్షలు, సమస్యలు, పరిష్కారాలు, సలహాలు, చిట్కాలు,మనసుని రంజింపజేసే కథలు, కవితలు, సమీక్షలు, వ్యాసాలు తదితరాలతో రూపొందించబడిన అపురూపమైన పత్రిక “బహుళ”. సంపాదకురాలిగా ఎన్నో వ్యయ ప్రయాసలు తట్టుకుని, మరెన్నో చిత్కారాలను ఓర్పు తో సహించి పత్రికను ఎంతో ఉన్నత స్థాయిలో నిలపటానికి జ్వలిత గారి పట్టుదల, శ్రమ

నవనీతం Read More »

బొట్టు

ద్వేషంతో చిమ్మే విషపుబొట్లు తప్ప ప్రతి బొట్టు మంచిదేగా. ఈ వారం “సహరి” వారపత్రికలో నా కవిత “బొట్టు”. సహరి సంపాదకులకు ధన్యవాదాలతో ఓ నెత్తుటి బొట్టుకోట్ల కణాలతో యుద్ధం చేసిగెలిచి నీకు జన్మనిస్తుంది ఓ వాన నీటి బొట్టుబీడు పడ్డ రైతన్న కళ్ళల్లోపన్నీటి జల్లు కురిపిస్తుంది ఓ తేనేటి బొట్టుశ్రమజీవి దేహపుచెమట బొట్లలో కలసిఇంధనమై శక్తినిస్తుంది ఓ కన్నీటి బొట్టుమనసులో ఉప్పొంగేవేదనాసాగరానికిసాంత్వననిస్తుంది భృకుటిపై సింధూరపు బొట్టుకుండలిని తాకినీలో విజ్జ్ఞతను మేల్కొలుపుతుందిబొట్టు మంచిదే..

బొట్టు Read More »

కుబుసం

నమస్తే. ఈ రోజు [31-10-2021] ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం “స్నేహ “లో నా కథ “కుబుసం ” ప్రచురితం అయింది. ప్రజాశక్తి సంపాదకులకు ధన్యవాదాలతో. కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయం కోరుతూ.. “వెతకండి..వెతికి పట్టుకోండి.. కొట్టండి..కొట్టి చంపేయండి” అరుపులకు మెలకువ వొచ్చేసింది నాకు.” అబ్బా..సెలవు రోజు నిద్రపోనీకుండా పొద్దునే ఈ వెర్రి అరుపులు ఏంటి” కళ్ళు నులుముకుంటూ లేచాను. “ఈయన లేచి ఉదయపు నడక కోసం వెళ్లినట్లు ఉన్నాడు ” బ్రష్ మీద పేస్ట్

కుబుసం Read More »