Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

షిర్ ఖుర్మా

శుభోదయం. ఈ రోజు నవ తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం “సోపతి” లో నా కథ “షిర్ ఖుర్మా“. చదివి మీ అమూల్యమైన అభిప్రాయంని తెలుపగోరుతూ..🙏🙏🌹🌹 “యాదగిరి భాయ్ ” వాకిట్లో నించి అరిచిండు కరీముల్లా సాయిబు.బాపు బయటకు వెళ్ళగానే “యాదగిరి భాయ్ ..ఈ సారికి నీకు రెండు నెల్ల కిరాయి పైసలు ఇస్తున్నాను. ఐదు నెల్ల కిరాయి నీకు బాకీ ఉందని తెల్సు. ఈ మధ్యనే నా రెండో భేటీ అఫ్రోజ్ కి నిఖా అయింది. […]

షిర్ ఖుర్మా Read More »

యుద్ధం

విజయ తీరం చేరాలంటే యుద్ధం తప్పనిసరా..? “జోర్దార్” పత్రికలో నా కథ “యుద్ధం”. సంపాదకులకు ధన్యవాదాలు.“యుద్ధం” కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్తారు కదూ..🙏🙏🌹🌹 సమాచారం అందిన వెంటనే ఆందోళనగా ఆసుపత్రికి బయలుదేరాడు కరుణాకర్ మాస్టారు. ఏం జరిగిందో తెలియక, ఆతృతగా వెళుతున్న ఆయనకు ట్రాఫిక్ జాం అడ్డు పడుతూ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తన ప్రియ శిష్యుడు గౌతమ్ కి ఏమైందో తెలియక అతని మనసు ఆరాటపడుతోంది. మోపేడు బండిలో ఆసుపత్రికి చేరుకునేదానికి అర్ధగంట

యుద్ధం Read More »

అందమే ఆనందం

ఏప్రిల్ నెల “సాహో మాసపత్రికలో” పాదాల అందం, ఆరోగ్యానికి చాల తేలికైన చిట్కాలు అండి. మీరు చదివి, అవి మీకు ఉపయోగపడితే నాకు చాల ఆనందమే కదా..🙏🙏🌹🌹 “ఈ పాదం ఇలలోనే నాట్య వేదం” “నీ చరణం కమలం మృదులం,నీ పాదాలే రస వేదాలు”. పాదాల గురించి, కాళ్ళ గురించి ఎన్నో మధురగీతాలు విన్నాం కదండీ. పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటేనే మనం పదుగురిలో హుందాగా నిలబడగలం. మరి మనల్ని నిటారుగా నిలబెట్టే పాదాల అందం, ఆరోగ్యం

అందమే ఆనందం Read More »

సార్ధకం

శుభోదయం. ఈ నెల “విశాఖసంసృతి” మాసపత్రికలో నా కవిత “సార్ధకం”. సంపాదకులు శ్రీ శిరేల సన్యాసిరావుగారికి ధన్యవాదాలతో..సార్ధకం చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా..🙏🙏🌹🌹 దిగులు మేఘాలు కమ్మేస్తున్నాయా నిన్నునాకెవరు లేరని శోకిస్తున్నావానేనెందుకూ పనికి రానని చింతిస్తున్నావాక్షణికావేశంతో లోకం విడవాలనుకుంటున్నావాఓ చిన్ని మొక్కకు రోజు ఓ గుక్కెడు నీళ్ళు పొయికొన్ని తరాలకు ప్రాణవాయువు నువ్విచ్చినట్లే కదానీ ఇంటి ముందు వాలిన పక్షికి గుప్పెడు గింజలేయిపర్యావరణ సమతుల్యాన్ని నువ్వు కాపాడినట్లే కదాఆకలంటూ వొచ్చిన అన్నార్థులకి కాసింత అన్నం పెట్టుఆకలి

సార్ధకం Read More »

నా సాహితి ప్రయాణం

ఉగాది పండుగకు “సహరి” పత్రిక నాకు ఇచ్చిన కానుక. ఈ వారం”సహరి” ఆన్లైన్ పత్రికలో నా చిరు పరిచయం. సహరి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🌹 పేరు: వంజారి రోహిణిజన్మస్థలం: నెల్లూరు టౌన్చదువు: బి.ఎస్.సి., బి.ఎడ్.సైన్స్ టీచర్ గా ఇరవైఏళ్ల అనుభవంప్రస్తుత నివాసం: హైదరాబాద్కుటుంబంభర్త: వంజారి కృష్ణ మూర్తిటీవీ, సినిమా నటులుసంతానం:శ్రీనివాస చైతన్య,వైష్ణవి అమ్మ ఆదిలక్షమ్మ గృహిణి. మా నాన్నఅరిశా సత్యనారాయణ గారు నెల్లూరు సంతపేట బి.ఎడ్ కాలేజీ ఆఫీసులో పనిచేసేవారు. చాల సామాన్యమైన దిగువ మధ్యతరగతి కుటుంబం

నా సాహితి ప్రయాణం Read More »

ఆధారం

మొక్క మట్టిలో బలంగా నాటుకోవడానికి పనికి వచ్చే తల్లివేరుని నరికేస్తే, ఇక ఆ మొక్క మనుగడసాగించి పెద్ద చెట్టు కాగలదా..? ఏమవుతుందో తెలియాలంటే ఈ వారం “సహరి” ఆన్లైన్ వారపత్రికలో ప్రచురితం అయిన “ఆధారం” కథ చదవాల్సిందే. మీ అమూల్యమైన అభిప్రాయము తెలుపాల్సిందే..🙏🙏🌹🌹 “సహరి” సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🙏🌹🌹 “సువిధా.. ! నిజంగా నువ్వు చాల గ్రేట్. కంగ్రాట్స్ ” మీటింగ్ హాల్ నుంచి బయటకు వస్తూనే కరచాలనం చేసి చెప్పింది పల్లవి.” థాంక్స్ ” అంది సువిధ

ఆధారం Read More »

అందమే ఆనందం

“సాహూ” మాసపత్రిక ఫిబ్రవరి సంచికలో నా “అందమే ఆనందం” లో అందమైన చేతుల కోసం చిట్కాలు మిత్రులకోసం.. “ఈ పాదం ఇలలోనే నాట్య వేదం” “నీ చరణం కమలం మృదులం,నీ పాదాలే రస వేదాలు”. పాదాల గురించి, కాళ్ళ గురించి ఎన్నో మధురగీతాలు విన్నాం కదండీ. పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటేనే మనం పదుగురిలో హుందాగా నిలబడగలం. మరి మనల్ని నిటారుగా నిలబెట్టే పాదాల అందం, ఆరోగ్యం గురించి ఈ మాసం “సాహూ..అందమే ఆనందం” లో తెలుసుకుందాం.

అందమే ఆనందం Read More »

దొడ్డెత్తే నరసమ్మ

ఇప్పుడు నరసమ్మ నా కళ్ళముందు కనిపిస్తే గుండెలకు హత్తుకుని, పన్నీరు, నా కన్నీరు కలిపి ఆమె పాదాలను కడిగి నెత్తిన చల్లుకోవాలని ఉంది. ఎందుకో తెలియాలంటే ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితం అయిన నా “దొడ్డేత్తే నరసమ్మ” కథ చదవాల్సిందే. విజయమహల్ సెంటర్ కథలు విశాలాక్షి పత్రికలో ప్రచురిస్తూ గొప్ప ప్రోత్సహం ఇస్తున్న శ్రీ కోసూరు రత్నం గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి శిరస్సు వంచి వందనాలు. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పోయిన నెల

దొడ్డెత్తే నరసమ్మ Read More »

నువ్వే నువ్వే

“సృజన ప్రియ” మార్చి నెల మహిళా దినోత్సవ ప్రత్యేక సంచిక లో నేను రాసిన కవిత “నువ్వే నువ్వే”. శ్రీ నీలం దయానంద రాజు గారికి, శ్రీ విల్సన్ రావు కొమ్మవారపు గారికి ప్రత్యేక ధన్యవాదాలతో..🙏🌹 నువ్వంటే నువ్వేనువ్వంటే స్వేచ్చే ఇక..పంజరాన్ని వీడి రెక్కలు చాపినింగికెగురుతున్న విహంగమే నువ్విక..నిన్ను నిలువరించే శక్తులకుయుక్తులన్నీ మిధ్యే ఇక..కొన్ని పువ్వులు నేలరాలిపోవచ్చుమరికొన్ని తారకలు నింగికెగియవచ్చు..నేల రాలిన పూలు నేర్పిన పాఠాలుఆత్మరక్షక కవచాలై దిశదిశలా వ్యాపిస్తాయి ఇక..నింగికెగిసిన తారకల మెరుపు సందేశాలుచిక్కబడ్డ చీకటిలోనైనా

నువ్వే నువ్వే Read More »

నువ్వు

“తెలుగు సొగసు” ఆన్లైన్ పత్రిక మహిళా దినోత్సవ ప్రత్యేక సంచిక లో ప్రచురితం అయిన నా కవిత “నువ్వు “. శ్రీ సుధామ గారికి, శ్రీ దాసరి చంద్రయ్య గారికి ధన్యవాదాలతో..🌹🌹🙏🙏 నువ్వునువ్వంటే నువ్వేనీలో ద్వంద్వార్ధాలు ఇక లేవువిధవనో, వేశ్యనో,పతితనోఇంతవరకు నిన్ను చూపినఆనవాళ్లను చెరిపేయాలి నువ్వుతాళిబొట్టో,హిజాబో ఏదైనా సరేనిన్ను బంధించే పంజరాలనుఇక బద్దలు కొట్టాలి నువ్వుఆత్మాభిమానం నీ ఆయుధంమనో నిబ్బరం నీ ఆత్మబలంఆత్మరక్షణ నీ ప్రాచీన హక్కునువ్వు చల్లగా దీవించే తల్లివిమమతలు పంచే చెల్లివిఅనురాగపు విత్తనాలు చల్లిప్రేమను

నువ్వు Read More »