Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

కడలి – అల

నమస్తే. ఈనాటి “నవతెలంగాణ సోపతి” లో నా కవిత “కడలి – అల”. సంపాదకులు శ్రీ కే. ఆనందాచారి గారికి ధన్యవాదాలతో.. కవితను చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ.. తను నీలాకాశం అయితేనేను మెరిసే తారకనవుతాతను కదిలే మేఘం అయితేనేను పురివిప్పే మయూరమవుతాతను కురిసే వర్షపు చినుకైతేనేను మొలకెత్తే చిగురునవుతాతను పోటెత్తే కడలి అయితేనేను ఊరకలేసే అలనవుతాతను పొదరిల్లు అయితేనేను ఇంటిదీపాన్నవుతాతను నా జీవితనౌక అయితేనేను తనని నడిపే తెరచాపనవుతామేము ప్రతిరోజూ ఐ లవ్ యు […]

కడలి – అల Read More »

ఉషోదయం

“ఉషోదయాన తుషార బిందువులునింగి నుంచి జారి పచ్చని ఆకులపై వాలిచల్లని కబుర్లు చెబుతున్నాయి..ఎర్రగులాబీలు రాత్రి కురిసిన మంచులోతడిసి మత్తులో సోలిపోతున్నాయి..అందరి మత్తు వదిలించేందుకునేనొచ్చేస్తున్నానంటున్నాడు బాలభానుడుతూర్పు పక్క అరుణ వర్ణాన్ని పులిమేస్తూ..ద్వేషాలు రోషాలు వివక్షలు మానేసిప్రేమని పెంచుకోండి అంటూ ఈ ప్రకృతిఉదయరాగాలు ఆలపిస్తోంది ఆర్తిగా.. రోహిణి వంజారి25-1-2023

ఉషోదయం Read More »

లక్ష్యం

“పైపైకెగరాలని ఉంది గాలిపటంలానింగి అంచులు తాకాలనుంది స్వేచ్ఛగాఅడొచ్చే ఏ దుశ్చక్తినైనా తృణీకరిస్తూవిజయతీరాలకు దూసుకు వెళ్ళాలనుందినిప్పులుచెరిగే అంతరీక్ష నౌకలాఎదురైయ్యే అవరోధాలను అధిగమిస్తూగెలుపు తలుపులు తెరవాలనుందిఉత్సాహానికి వారసురాలిగాగాలివాటానికి సుడులు తిరుగుతూధూళిలో కలిసే కాగితపు ముక్కలా కాకదృఢమైన వ్యక్తిత్వపు అస్థిత్వంతోకార్యాచరణకు పూనుకోవాలనుందిలక్ష్యాన్ని చేధిస్తూ వెళ్ళే క్షిపణిలాఎంత ఎత్తు ఎదిగినా విజయపు శిఖరం చేరుకున్నానేలమీది పునాదులను మరువకుండాకోసం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలనుందిఅలుపెరుగని తేనెటీగలా” రోహిణి వంజారి15-1-2023

లక్ష్యం Read More »

సుతిమెత్తని పరిమళం

పారిజాత పువ్వులంపగడపు వన్నె కాడలతోవెండి చందమామ రేకులతోముట్టుకుంటే చాలుచిన్నిపాప మేనులా సుతిమెత్తగామీ చేతివేళ్ళ కొనలకిదివ్యపరిమళాలు అద్దుతాము..సత్యభామ కోసం కృష్ణుడుదివి నుంచి భువికి తెచ్చినదేవలోక పుష్పాలు అంటారు కానీఆ దైవత్వాన్ని అంటగట్టకండి మాకుఆడపిల్లలను అమ్మవారు శక్తి స్వరూపిణిఅంటూనే కాలరాచిపారేసినట్లు..అచ్చంగా భువిలో మీకోసం పూచే కుసుమాలంసాయంత్రాలు రేకులనువిచ్చుకుంటాంవిరిసిరుల సుగంధాలను మీకందిస్తాంపొద్దున కి నేలరాలి పగడాల తివాచీనిచిక్కగా పరుస్తాం మీ కోసం..అప్పుడే పుట్టిన పసికందునుచేతుల్లోకి తీసుకున్నంత మృదువుగామమ్మల్ని మీ దోసిట్లోకి తీసుకోండివాసన చూసి నలిపిపారేయకండివావివరస చూడక ఆడదేహాన్ని చిదిమేసినట్లు..మేం వెదజల్లే పరిమళాలను

సుతిమెత్తని పరిమళం Read More »

మాయాదీపపు మంత్రనగరి విచిత్రాలు “కేరాఫ్ బావర్చి” కథలు

యువ కథా రచయిత చరణ్ పరిమి Charan Parimi గారి “కేరాఫ్ బావర్చీ కథలు” సంపుటి కోసం రాసిన నా సమీక్ష.ఈ నెల “సాహిత్య ప్రస్థానం” లో. శ్రీ సత్యాజీ గారికి ధన్యవాదాలతో. చరణ్ పరిమి గారికి హృదయపూర్వక అభినందనలు. సమీక్ష చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపకోరుతూ 🌹🙏 మీరెప్పుడైనా ఇంట్లోకూర్చుని ఇరానీ హోటల్లో ఉండే మసాలా టీ రుచిని ఆస్వాదించారా..? సినిమా యాక్టర్, డైరెక్టర్ అయిపోదామని కలలుకంటూ మీ పక్కింటి కుర్రాడో, ఎదురింటి పోరి

మాయాదీపపు మంత్రనగరి విచిత్రాలు “కేరాఫ్ బావర్చి” కథలు Read More »

మది నదిలో నిరంతరం ప్రవహించే భాష – అంతరంగపు భాష

శ్రీ జల్ది విద్యాధర్ రావు గారి “అంతరంగపు భాష” కవనానికి నా చిరు సమీక్ష. ఈ నెల” విశాలాక్షి మాసపత్రికలో”. శ్రీ జల్ది విద్యాధర్ రావు గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో..సమీక్ష చదివి మీ విలువైన అభిప్రాయాలను తెలుపగోరుతూ.. ప్రతి దేశానికీ ఓ ప్రత్యేక భాష ఉంటుంది. ప్రతి ప్రాంతానికి కూడా ఓ ప్రత్యేక భాష ఉంటుంది. ప్రకృతిలోని జీవకోటిలో ప్రతి జీవి తన స్పందనలను ఓ ప్రత్యేక రీతిలో తెలుపుతుంది. అలాగే మనుషులు

మది నదిలో నిరంతరం ప్రవహించే భాష – అంతరంగపు భాష Read More »

శతకోటి వందనాలు

ప్రతిష్టాత్మకమైన “అమ్మకు అక్షర నైవేద్యం” కవితా సంకలనం లో చోటు చేసుకున్న నా కవిత ” శతకోటి వందనాలు”. శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారికి, శ్రీ ఉడతా రామకృష్ణ గారికి ధన్యవాదాలతో..🙏🌹 అమ్మకు వందనాలు. కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగోరుతూ..🙏🌹 ఆషాఢమాసాన అరుదెంచే సింహవాహినీశతకోటి వందనాలమ్మా నీకు…పల్లె అయినా, పట్టణమైనా, ఆలు బిడ్డలు తోడఅప్ప చెల్లెళ్ళ తోడ నీ దరికి చేరుతామమ్మాకరుణించవే మా అమ్మా మహంకాళీశతకోటి వందనాలమ్మా నీకు…శివ సత్తులు, పోతురాజు వెంటరాగానీకు బోనమెత్తుతానమ్మా..నా

శతకోటి వందనాలు Read More »

చీకటి దీపాలు

నేటినిజం పత్రికలో నా కవిత “చీకటిదీపాలు”. బైంసా దేవదాసుగారికి ధన్యవాదాలతో .. ఒకరికి మోదంమరొకరికి ఖేదంవెలుగుతున్న దీపాలు ఆర్పితేనేఒకరికి మన:శాంతిఇంకా చీకటిలోనే బతకడం ఇష్టం వారికిప్రేమను ఆశించడం మూర్కత్వం అయిపోతోందిప్పుడుపెంచుకునే కుక్కపాటి విలువ చేయకపోయే సాటిమనిషికాలకూట విషంకన్నా చేదని షీర్ కుర్మానిటోపీ గడ్డాలను చీదరించుకునే ద్వేషం ఒకరికి నరనరాల్లోఆత్మస్తుతి పరనిందా జీవన విధానమైంది మరొకరిలోఆడపిల్ల ఇష్టం మీద ముసుగు వేయడంమతాధికార దురహంకారం ఎల్లెడలా..బొట్లు గడ్డాలు ఆనవాలే పట్టలేనిశవాల గుట్టల్లో, సామూహిక దహనంలోఊపిరిల్లోకి దూరిన రాక్షసి దురాగతంఇంకా మరపుకి

చీకటి దీపాలు Read More »

ఆరోగ్యమే ఆనందం

మిత్రులకు సాహూ కానుక. జనవరి నెల సాహూలో కపాలభాతి ప్రాణాయామం. ఇందూరమణ గారికి ధన్యవాదాలతో .. ఆరోగ్యమే ఆనందం“ఏ శ్వాసలో చేరితే.. గాలి గాంధర్వమౌతున్నదో, ఏ మోవిపై వాలితే..మౌనమే మంత్రమౌతున్నదో..ఆ శ్వాసలో నే లీనమై” మరి అంతగా మనం లీనం అవ్వాలంటే మన శ్వాస, మన మోము, మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉండాలని. మన మనసు, దేహం ఆ స్వచ్ఛతను సాధించాలంటే సులభమైన మార్గం ప్రాణాయామం. గత రెండు నెలల్లో సరళ ప్రాణాయామం, అనులోమ..విలోమ ప్రాణాయామం

ఆరోగ్యమే ఆనందం Read More »