Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

మానవత్వ పరిమళాలు ప్రసరించే నల్ల సూరీడు —- సామాజిక ఆరోగ్య ప్రయోజనాలలో అల్ల నేరేడు

ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి రోహిణి వంజారి గారి కథా సంపుటి “నల్ల సూరీడు” పుస్తకంపై ఒక చిరు సమీక్ష ************************************************ తెలుగు సాహిత్యం అనే రైల్వే స్టేషన్ లోకి కథా రచన అనే ప్లాట్ఫారం మీదకి 2014లో ఒక బుల్లెట్ ట్రైను దూసుకు వచ్చింది. మామూలు రైళ్లు తిరిగే ఆ ఫ్లాట్ ఫామ్ ని ఒక్క కుదుపు కుదిపి బలమైన హక్కుదారుగా తన అస్తిత్వాన్ని నిరూపించుకుంది. ఆ ఫ్లాట్ ఫామ్ పై తిరిగే ప్రయాణికులు అందర్నీ

మానవత్వ పరిమళాలు ప్రసరించే నల్ల సూరీడు —- సామాజిక ఆరోగ్య ప్రయోజనాలలో అల్ల నేరేడు Read More »

“జీవన గమనాలు” “నల్లసూరీడు రచనా ప్రస్థానం”

“జీవన గమనాలు” “నల్లసూరీడు రచనా ప్రస్థానం” కథల సంపుటి శ్రీమతి రోహిణి వంజారి గారు సమీక్షకురాలు అరుణ సందడి విమల సాహితి e పేపర్లో ఈ సమీక్షను ప్రచురించినందుకు యాజమాన్యం వారికి హృదయ పూర్వక నమస్సులు తెలుపుతున్నాను, ******************************************** ఇంగ్లీషులో స్టోరీ అనే పదం కథగా ,షార్ట్ స్టోరీ అనే పదం కథానికగా మారింది. నేడు కథ మరియు కథనం రెండు పరస్పరము మార్చుకోబడ్డాయని చెప్పుకుంటారు… తొలి తెలుగు కథ “దిద్దుబాటు” 1910 లో గురజాడ గారు

“జీవన గమనాలు” “నల్లసూరీడు రచనా ప్రస్థానం” Read More »

బతకడం కోసం, బతికించడం కోసం తిందామా..!

స్పూన్ తో నా, చేత్తో నా తినేది మీరు ..? తిండి కోసం, వివక్ష కోసం బతుకుదామా..? నలుగురి ఆకలి తీర్చేదానికి బతుకుదామా..? ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలపండి 🙏🌹 బతకడం కోసం, బతికించడం కోసం తిందామా..! మొత్తం జీవరాశుల్లో మానవులు వర్టిబ్రేట్స్ [వెన్నెముక గల జీవులు ] జీవ సముదాయంలో మమ్మెల్స్ [క్షీరదాలు అనగా పిల్లలకు పాలు ఇచ్చే జీవులు] జాతికి చెందినవాళ్ళం.

బతకడం కోసం, బతికించడం కోసం తిందామా..! Read More »

రా రా కృష్ణయ్యా

కృష్ణా…. మన్ను, వెన్నలు తిన్నది ఇక చాలయ్యా వన్నె,వలువలు దోచింది కూడా ఇక చాలు చాలయ్యా “దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై సంభవామి యుగే యుగే” అంటూ దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి వస్తానన్నావు కలియుగానికి మాత్రం రాకుండా శీతకన్నెసావు ఏమయ్యా… ఇపుడు కలియుగం అంటే కంసులు,పూతనలు, మారీచులు,శిశుపాలురూ వందలు,వేల సంఖ్యలో తిరుగాడుతున్న కలి కాలమిది… దొంగతనాలు,దోపిడులు, హత్యలు, అత్యాచారాలు, వివక్షలు,ఊచకోతలు హెచ్చుమీరిన దుష్టయుగం ఇది.. కాలుష్యాలు,కరోనాలు అంతుచిక్కని అంటురోగాలు ప్రభలిన రోగ లోకం ఇది.. మతి తప్పిన మానవజాతి

రా రా కృష్ణయ్యా Read More »

నల్ల సూరీడు సమీక్ష సోపతి లో

ఈ రోజు నవ తెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం “సోపతి ” లో నల్ల సూరీడు కథల గురించి నస్రీన్ ఖాన్ గారు రాసిన సమీక్ష. సలీమా, నస్రీన్ ఖాన్ గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలతో.

నల్ల సూరీడు సమీక్ష సోపతి లో Read More »

పురస్కారాలు అసలైన ప్రతిభను తూచే తక్కెడలేనా.. – సంపాదకీయం 5

ఓ కవి లేదా కథకుని అంతరంగ క్షేత్రంలో అనేకానేక సంఘర్షణలు జరిగి, ఆ అంతర్మథనం ఫలితంగా ఓ రచనకు బీజంపడితే, ఆ కవి లేదా కథకుడు తనలోని శక్తియుక్తులన్నింటినీ క్రోడీకరించి ఓ రచనకు అంకురార్పణ చేస్తాడు. ఓ తల్లి ప్రసవవేదన అనుభవించి, ఓ బిడ్డను కన్నప్పుడు ఎంత ఆనందం అనుభవిస్తుందో అంతకంటే ఎక్కువ ఆనందం అనుభవిస్తాడు ఓ కవి లేదా కథకుడు తన రచన పదిమందిలోకి వెళ్ళినప్పుడు. అక్షరానికి ఉన్న గొప్ప విలువ అది.అయితే ఆ రచన

పురస్కారాలు అసలైన ప్రతిభను తూచే తక్కెడలేనా.. – సంపాదకీయం 5 Read More »

విజ్ఞాన వని – నల్ల సూరీడు సమీక్ష

“విజ్ఞాన వని”సైన్స్ విశేషాలతో కూడిన పత్రిక. “నల్ల సూరీడు” అస్పృశ్యతని నిరసించే సామాజిక కథ. సైన్స్ పత్రికలో సామాజిక కథ. ఓ సైన్స్ టీచర్ గా, రచయిత్రి గా ఇంతకంటే ఆనందం ఏముంటుంది నాకు. కథ తో పాటు “నల్ల సూరీడు” సంపుటి మీద శాస్త్రీయ పద్దతిలో రాసినట్లున్న సమీక్ష. జులై నెల విజ్ఞాన వని మాసపత్రికలో “నల్ల సూరీడు” సమీక్షను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపాలని కోరుకుంటూ.. సమీక్షని రాసిన ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య

విజ్ఞాన వని – నల్ల సూరీడు సమీక్ష Read More »

ఆరోగ్య యోగం..అందరికీ అందాల్సిన ఫలం – సంపాదకీయం 4

విమల సాహితీ నాలుగో వారం విజయవంతంగా మీ ముందుకు విందు భోజనం తెచ్చిపెట్టింది. ఆస్వాదించడమే మీ వంతు.. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతలను విస్మరించకూడదు అని మన రాజ్యాంగం చెపుతోంది. అందరూ ఆరోగ్యం కలిగి ఉండడం మన హక్కు అనుకుంటే, ఆరోగ్యం ని పొందడం కోసం మన వంతుగా మనం ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నాం అనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న.పక్క వారిని పలకరించడానికి కూడా సమయం లేని బిజీ లైఫ్. ఉరుకుల పరుగుల ఉద్యోగాలు. ఏ

ఆరోగ్య యోగం..అందరికీ అందాల్సిన ఫలం – సంపాదకీయం 4 Read More »

“ఓ వివస్త్రా… నీకు వందనం ! – సంపాదకీయం 3

“చీరలోని గొప్పతనం తెలుసుకో..చీర కట్టి ఆడతనం పెంచుకో ” అన్నారు సినీ కవి చంద్రబోస్. మరి ఆ చీరనే అందరి ముందరే విప్పేసి ఆడతనాన్ని వదిలేసి వివస్త్ర అయితే..? ఆడవాళ్ళ చీరలను వాళ్ళు స్నానం చేస్తుండగా ఎత్తుకు పోయి దాచేసే కొంటెతనాన్ని, ఇంకో సందర్భంలో ఓ స్త్రీ మానాన్ని రక్షించడానికి అంతం లేని ఓ పెద్ద చీరను సృష్టించడాన్ని హీరోయిజంగా, దైవత్వంగా ఉటంకించిన పురాణ దృష్టాంతాలు ఉన్నాయి. మరి తనకుతాను వివస్త్రగా మారిన ఈ మహిళను మనం

“ఓ వివస్త్రా… నీకు వందనం ! – సంపాదకీయం 3 Read More »