Author: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

కర్పూరదీపం.. విశాలాక్షి పత్రికలో “దొడ్డెత్తే నరసమ్మ” కథ ప్రచురితం అయిన సంగతి మిత్రులకు తెలుసు కదా. ఆ నరసమ్మ విజయ మహల్ సెంటర్ నుంచి ఏకంగా ఆస్ట్రేలియాకి వెళ్లి వీధి అరుగు ఎక్కి కూర్చుంది. తను అందరికి సౌఖ్యాన్ని పంచుతూ ఎలా కరిగిపోయింది అనే విషయాన్ని అందరికీ చెప్పాలి అని మరోసారి కర్పూరదీపం లా మీ ముందుకు వచ్చింది. ఆణిముత్యాల విభాగం లో కథని ప్రచురించి ప్రోత్సహించిన “వీధి అరుగు” పత్రిక సంపాదకులు శ్రీ శ్రీనివాస్ కొండ్రు గారికి ధన్యవాదాలతో..కథను చదివిన మిత్రులు, ఇప్పటి వరకు చదవని మిత్రులు కూడా చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగురుతూ..🙏🌹 తూరుప్పక్క నుంచి వీచే గాలికి ఈదుల్లో దుమ్ముదుమారం రేగుతుండాది. దీపావళి పండగ అయి రెండు దినాలే అయింది. ఇళ్ళ ముందర కాల్చిపారేసిన లక్ష్మీ బాంబులు, తాటాకు టపాసులు, చిచ్చుబుడ్లు, చిలకూరు గన్, రాకెట్ టపాసాల కాయితాలు గాల్లోకి ఇంతెత్తున లెగిసి డాన్స్ ఆడతా…

Read More

ప్రియమైన రచయితలు సాహితీ సంబరాల నడుమ ఆవిష్కరించిన “ప్రియ కవిత” సంకలనంలో చోటు చేసుకున్న నా కవిత ఇది. శ్రీ ఇందూ రమణ గారికి, శ్రీ రంగబాబు గారికి ధన్యవాదాలతో 🙏🙏. ఇప్పుడు మూగబోయిన అందరి నాలుకల మీద వసపాలు పోయాల్సిందే కదా. కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతారుకదా❤🌹🙏 ఉభయకుశలోపరిఎన్ని ఏళ్లయ్యిందంటావ్ ఉత్తరంలో ఈ మాట చూసిహలో అబ్బయ్య ! ఎట్లుండారుఎన్నాళ్ళయ్యిందంటావ్ ల్యాండ్ ఫోన్లో ఈ మాటవినిఇప్పుడు మాటలెందుకు అంటారా?నవ్వుకో ఎమోజి, లవ్వుకో ఎమోజి, ఏడుపుకో ఎమోజిసంతోషమైన, దుఃఖమైన ఒక్క ఎమోజితో సరినాలుగుగోడల మధ్య నాలుగు టచ్ స్క్రీన్లునిత్యం యంత్రాలతోనే సహజీవనమిప్పుడుడాలర్ల వేటకు వలస పోయిన పిల్లపిట్టలకోసంవారానికోసారి వీడియో కాల్ చేస్తేటచ్ స్క్రీన్ ను ఎంతసేపు తడిమినామనవడికి తాతయ్య చెప్పే కథలు ప్రత్యక్షముగా వినిపించేనా?నానమ్మ అందించే గోరుముద్దల రుచి తెలిసేనా?నాదంతా చాదస్తం అంటారా?నా ఆలోచనలు పొరపాటు అంటారా?నేనింకా అనాగరికంగానే ఉన్నానంటారా ?కాలంతో పాటు నేను ఎదగడంలేదంటారా ?మాటలు లేక ఇప్పుడు…

Read More

సినీవాలీ పత్రిక నిర్వహించిన కవితల పోటీ లో బహుమతి పొందిన నా కవిత “పహారా” గెనెమ గట్టు-నే కొలిచే గుడి మెట్టుపచ్చని పొలం- నా ప్రార్ధన మందిరంఅన్నం విత్తులతోపాటు, ఆశల విత్తులుకూడా కొన్నిటిని మడిఅంతా చల్లుకుంటానునేల నీరు గాలి వానకనిపించే దైవాల కనికరం కొరకై..కళ్ళు తెరుచుకునే తపస్సు చేస్తుంటానుఅనుక్షణం కరుణించమని..దేశ సరిహద్దుల్లో తుపాకీతోజవానన్న పహారా కాస్తుంటేకంచె వేసిన చేలో మంచె మీద నిలిచిఉండేలు తిప్పుతూ పంటనికాచే పహారాని నేనే ఇక్కడ..కోతకొచ్చిన పంట మీ నోటికందించేలోగాప్రకృతిలోని వినాశకర వికృతులునన్ను నిలువునా నిలువరించుతున్నావ్యవస్థలోని విధ్వంసక కుశక్తులునా నోటికాడి మెతుకులను లాగేస్తున్నాతీరని రుణాలు కొండలా పోగుపడుతున్నాఆవేదనతో చిల్లులు పడ్డ నా ఆకలి పేగులకుమళ్ళీ మళ్ళీ మాచికలు వేసి కుట్టుకుంటూమీ ఆకలి తీర్చడానికి నేనుఆరుగాలాలు శ్రమిస్తూనే ఉంటానుఆశ, నిరాశల త్రిశంకుస్వర్గంలోఊగిసలాడే మీ అన్నదాతను నేను

Read More

మెట్లు దిగుతూఉంటే నేనుఏమైనా మర్చిపోయావా బుజ్జీ అమ్మ పిలుపువెనుతిరిగి చూస్తే అమ్మ కళ్ళల్లో దిగులు తెరమెట్లెక్కి వచ్చి అమ్మ చేతిని ముద్దాడిపదిరోజుల్లో మళ్ళీ వస్తాగదమ్మా అనివెనుదిరిగిన నా కంట్లో కూడా ఊరిన నీటి చెలమలుఉండవే ఆటో వరకు వస్తా అంటూ వడివడిగామెట్లు దిగే అమ్మ అడుగుల్లో మమతల మడుగులునేను సంచి పట్టుకుని ఆటో ఎక్కి కూర్చోగానే”కాస్త ఉండు అబ్బయ్యా” అంటూనే అమ్మనాలుగురోడ్ల కూడలిలో ఎడంపక్కమల్లెపూలు, జాజిమల్లెలు, మనోరంజనాలుపాటల వినపడుతున్న రాజయ్య అరుపులకుమూర మల్లెలు మూర జాజులు ,రెండు మనోరంజనాలుబేరమాడి కొని నా జళ్ళో తురిమి”మల్లె పూలంటే నీకిష్టం కదా బుజ్జీ ” అంటూమరోసారి అనురాగానంతా నాపై కురిపించేసింది అమ్మఊరికొచ్చి వెళుతున్న ప్రతిసారి అంతేఅమ్మ ప్రేమ ఎక్కడా తగ్గలేదుఇప్పుడు మల్లెలు ఉన్నాయి, అమ్మ లేదుకానీ అమ్మ ప్రేమ మల్లెల పరిమళంలానా గుండెల్లో నా చుట్టూ కమ్ముకొని ఉంది” రోహిణి వంజారి9000594630

Read More

పొగడ దొరువు కండ్రిగనాయన పుట్టిన ఊరుమా నాయన పుట్టిన ఊరుచిన్నప్పుడు ఊపిరులూదిన గాలిపచ్చగా పలకరించే చేనుచెంత చేరి నిమరగానే కళ్ళనిండా ప్రేమనుకురిపించే లేగ దూడలు..గడ్డివాము ఎక్కి అన్నతో ఆడిన ఆటలుతంపటేసిన తేగలకోసం పడిన గొడవలులెక్క తెలియకుండా జుర్రుకున్న తాటిముంజలు..గడ్డిలో కాల్చిన తాటిపండు తీపి రుచిముంత దించగానే పాలేరును ఏమార్చినాలుకపై వేసుకున్న కల్లు చుక్కలు..కోతలైన చేలో పోటిపడి ఏరుకున్న పరిగెలుదోటీతో లాగి ఒడిలో దాచుకున్న సీమచింత గుబ్బలు..దిగుడు బావిలో జలకాలాటలుగున గున తిరిగే గిన్నె కోళ్ళ అరుపులుఈత పళ్ళు, కాలెక్కాయల వేటలోగుచ్చుకున్న ముళ్ళు..ఎన్నని చెప్పను జ్ఞాపకాల ట్రంకు పెట్టెలోదాచుకున్న పసిదనాల ఊసులు..ఇన్నాళ్ళకు మళ్ళీ ఊరిలోకి చేనులోకిపల్లె పగడాల నవ్వులను తనివితీరా ఏరుకునిపచ్చటి పైరగాలిని ఊపిరుల నిండా నింపుకొనినా బాల్య జ్ఞాపకాల ట్రంకు పెట్టెనిమీ కోసం తెరిచాను మళ్ళీ ఇక్కడ.. వంజారి రోహిణి11-7-2022

Read More

బంధం ఆర్థికమా..హార్దికమా.. ఏ బంధాలు ఎలా ముడిపడతామో, ఎలా వీగిపోతాయో.. మరి ఈ కథలోని మైత్రి బంధానికి ఉన్న బలం ఎంత..? తెలియాలంటే ఈ రోజు నవ తెలంగాణ ఆదివారం అనుబంధం సోపతి లో ప్రచురితమైన నా కథ “మైత్రి -వైచిత్రి” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగకోరుతూ.. సోపతి సంపాదకులు శ్రీ కటుకోజ్వల ఆనందాచారిగారికి ధన్యవాదాలతో 🌹🙏 రాఘవ ఇల్లు ఖాళీ చేసి ఊరొదిలి వెళ్ళిపోయాడట. రాత్రికి రాత్రే కుటుంబంతో సహా. ఎవరో అనుకుంటున్న మాటలు వినగానే శరాఘాతం తగిలినట్లు విలవిలలాడాడు అతను. ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు ఎవరికి చెప్పకుండా..?ఆ పక్క ఎక్కడో పశ్చిమం తట్టు వెలుగుపూలను తనలో ఇముడ్చుకుని పగటిరాజు వస్తాడని ఎదురుచూస్తున్న ముద్దమందారం పూమొగ్గలు తొలివెలుగు కిరణాలు నులివెచ్చగా తమని తాకగానే పరవశించిపోతూ పూరేకులను నిండుగా విప్పుకుని, చిరు తెమ్మెరల తాకిడికి సుతారంగా ఊగసాగాయి.స్నానం చేసి తుండుగుడ్డ చుట్టుకుని సందుపక్కకు వొచ్చి అప్పుడే విచ్చుకున్న ముద్దమందారాలను ఆపేక్షగా…

Read More

ఈనాటి నవ తెలంగాణ సోపతిలో నా కవిత “అభ్యుదయం”. చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపగోరుతూ..🙏🌹 అభ్యుదయంఆ పసివేళ్ళు యంత్రం కన్నా వేగంగాఅంట్ల గిన్నెలను తోమి శుభ్రం చేస్తున్నాయిఆ వేళ్ళు పట్టుకోవాల్సింది పుస్తకం కలమనిఅక్కడ చెప్పేవారు ఎవరు లేరు..అమ్మ గారికి నీళ్ళు తెచ్చి ఇవ్వుఅయ్యగారికి కాఫీ పెట్టి తీసుకురారోబోట్ కంటే వేగంగా కదులుతూమేడం గారి ఆజ్ఞని శిరసావహిస్తున్నఆ లేత పాదాలకు తెలియదుతాను నడవాల్సింది బడిబాట వైపుకని..కార్పొరేట్ స్కూల్లో చదివే కూతురి పాత డ్రెస్సులునాలుగు అమ్మగారు తన ముందు పడేస్తే సంబరపడి పోయిఅవే తనపాలిటి చీనిచీనాంబరాలనిమురిసిపోతుంది ఆ పసి హృదయం..తాను పనిచేసే ఇంట్లోవాళ్ళు అందరు తినగామిగిలిన రెండు చికెన్ ముక్కలు తన సత్తు పళ్ళెంలోకి చేరితేఅవే తనపాలిటి పంచభక్షపరమాన్నాలనిపరవశించిపోతుంది ఆ అమాయకపు బాల్యం.పేదరికపు ఆకలి పేగుల ఆర్తనాదాలుఅమ్మాఅయ్యల చేతులు విరిచేశాయనిబలిసినోళ్ళ కుటిలావకాశం తన బాల్యాన్నిఆ ఇంటి పంజరంలో బంధించిందనితాడుతో బంధించిన డాబర్ మ్యాన్ని షికారుతిప్పుతున్న ఆ పసిదానికి తెలియదుఆ ఇంట్లో తాను ఓ…

Read More

ఆరోగ్యమే ఆనందం పార్ట్ 2. జూన్ నెల సాహూ మాసపత్రికలో. మీ అందరికోసం..🙏🌹 శబ్ద, కాంతి, వాయువేగాలను మించిన వేగంతో పయనించే సాధనము ఏమిటో మీరు చెప్పగలరా..? ఇంకేముందండి అది మన మనసే. మనసు పయనించడానికి ఏ మాధ్యమం అవసరం లేదు. క్షణంలో వెయ్యోవంతు కాలంలో కోరుకున్నచోటికి చేరుకోగలదు. అట్లని మనసు స్థిరంగా ఉంటుంది అనుకోవడం పొరపాటే. మహా చంచలమైనది మనసు. మరి మనసుకు కళ్లెం వేసి ఓ చోట నిలపాలంటే దానికి నిరంతర సాధన కావాలి.పోయిన నెల యోగ, ధ్యానంలో ప్రాథమిక సాధన అయిన “పద్మాసనం” గురించి తెలుసుకున్నాం కదా. ఈ నెల “వజ్రాసనం” గురించి తెలుసుకుందాం. పద్మాసనం సరిగా వేయలేని వాళ్ళకు ఈ వజ్రాసనం వజ్రసమానమైన దేహాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.వజ్రాసనం వేయు విధానం: యోగ మాట్ లేదా దళసరిగా మడతలు వేసిన దుప్పటిమీదమోకాళ్ళను నెమ్మదిగా మడిచి పాదాలను చాపి కూర్చోవాలి. రెండు కాళ్ళను దగ్గరగా చేర్చాలి.…

Read More

“ఆకులో ఆకునవుదామనుకున్నాకొమ్మలో కొమ్మని కూడా అయిపోదామనుకున్నాకెరటాల్లోని చిరుగాలిని గుండె నిండుగానింపుకోవాలనుకున్నాను..ఆకుపచ్చని లేలేత రెమ్మలు గాలికి ఊగుతూజీవితమంటే రేపటి ఆశతో బతకడమే అనిగుసగుసలాడాయి..నిటారుగా నిలిచిన ముదురు గోధుమరంగు మాన్లుతలవంచని ధీరత్వంతోనే నీ పయనం సాగించుఅని పాఠాలు చెప్పే పనిలో పడ్డాయి..చెట్టు పుట్ట పిట్ట బంధిఖాన లేని సహజీవనమేమా ఆనందానికి ప్రతీక అన్నాయి..కాసేపైనా వాటి మౌన భాషను వింటూమైమరచిపోవాలనుకున్నాను..నల్లమల నిశ్శబ్ద రాగంలో స్వేచ్ఛా గీతాన్నితనివితీరా వినాలనుకున్నాను..అంతలోనే కార్లు, వేన్ ల హారన్లు వినిపిస్తేఅడవి పక్కున నవ్వింది నన్ను చూసి..అడవి కాదు నగర జనారణ్యంనీ నెలవు పదపద అంటూ వాస్తవంవ్యంగ్యంగా నన్ను చూసి ఈసడించింది..నవ్వలేని నేను తెల్లబోయిన మనసుతోవెనుదిరిగి చూస్తూ చూస్తూవ్యాను ఎక్కి కూర్చున్నాను..నల్లమల కి దూరమవుతూజనారణ్యానికి దగ్గరవుతూ..రోహిణి వంజారి6-6-2022

Read More

శుభసాయంత్రం. మే 2022 “పాలపిట్ట” మాసపత్రికలో నా కథ “విహ్వల”. పాలపిట్ట సంపాదకులకు ధన్యవాదాలతో. “విహ్వల” చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపగోరుతూ.. ట్యూషన్ వదిలేశారు. అనిత, రజని వెళ్లిపోయారు. నేను ఒంటరిగా మిగిలాను. చీకటి దట్టంగా మసిగొట్టం నుంచి విడుదలయ్యే పొగలా అములుకుంటోంది. తలెత్తి చూసాను. నక్షత్రాలు కూడా అక్కడొకటి ఇక్కడొకటిగా నాలాగే ఒంటరిగా ఉన్నాయి.ఈ రోజు పరిస్థితి ఏమిటో అర్ధం కాకుండా ఉంది.రేపు లెక్కల పరీక్ష ఉంది స్కూల్లో. అందుకే ట్యూషన్లో శ్రీదేవి మేడం మరో అర్ధగంట ఎక్కువసేపు క్లాస్ తీసుకున్నారు. ట్యూషన్ వదిలి బయటకు వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది.వీధి దీపాలు రెండు ఏ క్షణంలోనైనా ఆరిపోతాం అన్నట్లు చాల తక్కువ కాంతితో నీరసంగా వెలుగుతున్నాయి. ఇంకో రెండు కరెంటు స్తంభాలకు దీపాలు అలంకారంగా ఉన్నాయి. అంతే. అవి వెలిగి చాలారోజులు అయింది. పట్టించుకునే వారే లేరు. పుస్తకాలను గుండెలకు అదుముకుని మెల్లగా నడుస్తున్నాను.వీధి మలుపు తిరిగితే చల్ల…

Read More