Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

విమల సాహితి ఎడిటోరియల్ 17 – వందే మాతరం..వందే భారతం !!

వందే భారత్ రైళ్ళు ఎవరికోసమండీ..? ఈ రోజు విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి. “బండీర పొగ బండీర.. దొరలెల్లే రైలు బండీర.. దొరసానులెల్లే బండీర” మనదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ తెల్ల దొరలు, దొరసానులు పొగ రైలు బండ్లలో తిరుగుతుంటే, వారి భోగాన్ని చూసి మన దేశ జానపదులు పాడుకున్న పాట ఇది. వయో వృద్ధులైన కొంతమందికైనా ఈ పాట గుర్తుండే ఉంటుంది. దేశానికీ స్వాతంత్రం వచ్చి […]

విమల సాహితి ఎడిటోరియల్ 17 – వందే మాతరం..వందే భారతం !! Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 16 – మేధావులారా..మేల్కొనండి..

మేధావులారా ..మేల్కొనండి. ఈ వారం విమల సాహితి పత్రికలో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి. మనసు లేని మనుషులు పుట్టుకొస్తున్నారు. కళ్ళు చెమ్మగిల్లడం మానేశాయి. కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. సాధించిన విజ్ఞానాన్ని నెత్తికెత్తుకుని భవిష్యత్ వైపుకు పరుగులు తీస్తూ మన సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న ఓ మహా మేధావుల్లారా..! దయచేసి మీ బిడ్డలకైనా జీవితపు విలువల గురించి కాస్త నేర్పించండి. అన్ని దేశాల సంస్కృతులు వేరు. మన దేశ సంస్కృతి వేరు. కన్న వారిని కావడిలో

విమల సాహితి ఎడిటోరియల్ 16 – మేధావులారా..మేల్కొనండి.. Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 15 – బేబీ… ఐ లవ్ యూ

Baby…..I Love You..Be Always Beautiful Yourself  బయట ఎవరితోనో కాదు. నీతో నువ్వు గాఢంగా ప్రేమతో మునిగిపో.. ఈ వారం విమల సాహితీ సంపాదకీయం. చదవండి.మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఆహా..! ఎంత మధురంగా ఉన్నాయి ఈ మాటలు. నవ యవ్వనపు వీణల తంత్రులన్నీ ఒక్కసారిగా కోటి రాగాలను ఆలపించినట్లు. ప్రేమికుల మధ్య ఆ తొలివలపు మధురిమలు చూస్తుంటే మనసు, తనువూ పులకరించిపోదా..! ప్రేమను పొందని బతుకెందుకు? చరిత్రలో ప్రేమకు దాసోహం అవని ఏ రాజైనా

విమల సాహితి ఎడిటోరియల్ 15 – బేబీ… ఐ లవ్ యూ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 13 – అధునాతన ధర్మం

అధునాతన ధర్మం ఏం చెబుతోంది? ఈవారం విమల సాహితీ సంపాదకీయం. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి “ధర్మో రక్షతి రక్షితః ” ఈ వాక్యానికి సూక్ష్మంగా “ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది” అనే అర్ధం ఉంది. ఎక్కడ ప్రజలు కలహాలు, కల్లోలాలు, విద్వేషాలు లేకుండా సంతోషంగా ఉంటారో, ఎక్కడ హింసకి తావు లేకుండా, త్యాగం, ప్రేమ, కరుణ రాజ్యమేలుతాయో అక్కడ ధర్మం నాలుగుపాదాల మీద నిలుస్తుంది అని పెద్దలు అన్నారు. మరి ఇప్పుడు

విమల సాహితి ఎడిటోరియల్ 13 – అధునాతన ధర్మం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 12 – మసకబారుతున్న బంధాలు – మతి తప్పిన స్వార్ధం

అక్కా, చెల్లి, తల్లి, కొడుకు..ఎవరైతే ఏం. మన సుఖానికి అడ్డువస్తే ఏసైడమే. అనుబంధమా..తొక్క..ఇలా మారుతున్న మానవ సంబంధాలు. దిగజారిన నైతిక విలువలు. విమల సాహితి పత్రికలో నేను రాసిన ఎడిటోరియల్ ఆర్టికల్ చదవండి. సాధారణ పరిభాషలో కుటుంబం అంటే అమ్మ,నాన్న,అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అవ్వ, తాత, అత్తలు, మామలు, పిన్నమ్మలు, పెద్దనాన్నలు. వీరు కాకుండా స్నేహితులు, ఇరుగు,పొరుగు. ఒక్క కుటుంబంలోనే సామాజిక బంధాలన్నీ ప్రతిఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు చెదిరిపోకుండా కాపాడే దృఢమైన పునాదులు

విమల సాహితి ఎడిటోరియల్ 12 – మసకబారుతున్న బంధాలు – మతి తప్పిన స్వార్ధం Read More »

ప్రొజెక్షన్

స్త్రీ ల ఆహార్యం గురించి Facebook వాల్స్ దగ్గర అనుచిత కామెంట్స్ చేసే మేక వన్నె కాదు కాదు నీతివన్నె కాముకుల పట్ల నిరసన, జుగుప్సలతో రాసిన కవిత ఇది. ఈ నెల సాహిత్య ప్రస్థానం లో.. మేము పంజరాలు బద్దలుకొట్టిబయటపడి చాల కాలమైందిమళ్ళీ కొత్తగా నీ ఆదిపత్యం ఏందిదేవత మహా ఇల్లాలు మహా పతివ్రతాబిరుదులిచ్చి వేసిన సంకెళ్లు చాలు ఇకమా నవ్వులమీద మా తిండి మీదమా బతుకులమీద నీ మనువు ముసుగుఎంతకాలం వేసుకోమంటావుపొడుగు పొట్టి లావు

ప్రొజెక్షన్ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 11 – వెలుగుతున్న దీపాలు

ఈ వారం విమల సాహితీ సంపాదకీయం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో..వెలుగులీనుతున్న జీవన దీపాలు “మాతృదేవోభవ -పితృదేవోభవ -ఆచార్యదేవోభవ ” అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి, గురువు, దైవం అని వరుసక్రమం కూడా చెప్పారు. అంటే తల్లి,తండ్రి తర్వాతి స్థానం గురువుకి ఇచ్చి, ఆ తర్వాతే దైవం అన్నారు. అంటే గురువు దైవం కంటే గొప్పవాడనే కదా అర్ధం. మనిషి జీవితంలో ఎందుకు గురువుకి అంత ఉన్నత స్థానం ఇచ్చారు అంటే గురువు అనే గొప్ప పదానికి అర్ధం

విమల సాహితి ఎడిటోరియల్ 11 – వెలుగుతున్న దీపాలు Read More »

షీ

షీ.. ఈ కథలో పాత్రలకి పేర్లు లేవు. ఇది అందరికత. బహుళ త్రైమాసిక పత్రికలో చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి. అదిరిపడ్డాను ఒక్కసారిగా..!మిన్ను విరిగి మీద పడ్డట్టు. ప్యూపాని ని బద్దలు కొట్టుకునిబయటకు వచ్చి , రంగురంగుల లేలేత రెక్కలను చాచి అప్పుడప్పుడే ఎగరడం నేర్చుకుంటూ పైపైకి ఎగిరే ప్రయత్నం చేస్తున్న సీతాకోక చిలుక చిన్ని చిన్ని రెక్కలను విరిచేస్తే, ఎగరలేక నేలమీద పడి గిలగిలా కొట్టుకున్నట్లు గుండెల్లో సుడులు తిరుగుతున్న బాధ.ఫోటోని, కామెంట్ ని

షీ Read More »

మానవతా మూర్తులకు వందనం

ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకోగలిగే టెక్నాలజీ మనకు ఉందిప్పుడు. కానీ మనిషి మనసులో ఏముందో తెలుసుకోవడం మాత్రం అసాధ్యం. ఓవైపు సాంకేతికాభివృద్ధి పురోగమనంలో ఉంటే, మానవత్వపు విలువలు మాత్రం తిరోగమన దిశలో పాతాళంలోకి కురుకుపోతున్నాయి. ఇంతవరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న జాత్యహంకారం ఒక్కసారిగా భగ్గున మండి, దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది నిన్నటి మణిపూర్ సంఘటన. మతం రాబందు రెక్కలు విప్పుకుని అంతటా యథేచ్ఛగా తిరుగుతోంది. మనిషన్నవాడు అంతరించిపోయి విద్వేషం రాజ్యమేలుతుంటే ఇక

మానవతా మూర్తులకు వందనం Read More »

సైన్స్ రికార్డు – కొబ్బరి చట్నీ

నెల్లూరులో రైలుకట్టకి తూరుప్పక్క విజయమహల్ సెంటర్ లో బుజ్జమ్మ అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆ పిల్లకి ఇడ్లీలో కొబ్బరి చట్నీ నంజుకుని తినాలని కోరిక. వాళ్ళమ్మ ఎప్పుడూ మిరప్పొడి వేసేది. ఆ ఇంట్లో కొబ్బరి చట్నీ చేసుకునే స్థోమత లేదు. మరి ఆ పిల్ల కొబ్బరి చట్నీ తినాలన్న కోరిక తీరిందా లేదా. తెలియాలంటే “అంతర్వాహిని” కథల సంపుటిలోని నా కథ “సైన్సు రికార్డు” చదవాల్సిందే. మీ అభిప్రాయం తెలపాల్సిందే “ఇదిగో.. బుజ్జి..నేను గుడికాడికి పొయ్యొస్తా.

సైన్స్ రికార్డు – కొబ్బరి చట్నీ Read More »