Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

విమల సాహితి ఎడిటోరియల్ 32 – పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై

ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.. “వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు” అనే నానుడి మనకు తెలుసు. నిర్దోషికి శిక్ష పడటం విచారకరమే కానీ వంద మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకుని సమాజంలోకి పొతే ఏమౌతుందో తెలుసా..? దేశం నేరాల మయం అవుతుంది. మృగాలు వీధుల్లో తిరుగుతూ పైశాచిక క్రీడలు సాగిస్తాయి. […]

విమల సాహితి ఎడిటోరియల్ 32 – పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై Read More »

“నల్ల సూరీడు” కథల సమీక్ష

ఈనాటి ప్రజాశక్తి “స్నేహ” లో నా “నల్ల సూరీడు” కథల సంపుటి గురించి సమీక్ష. స్నేహ సంపాదకులకు, జ్యోతిర్మయి గారికి ధన్యవాదాలతో..

“నల్ల సూరీడు” కథల సమీక్ష Read More »

ముగ్గంటే

పండుగ అయిపోయినా జ్ఞాపకాలు గుండెల నిండా ఉంటాయి. నేటి నిజం పత్రికలో నా కవిత “ముగ్గంటే”. బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 17-2-2024 మా పెళ్ళి రోజు సందర్భంగా ఆశీస్సులు అందించిన మిత్రులందరికీ ప్రేమాత్మకమైన ధన్యవాదాలు వాకిట్లో నాలుగు చుక్కలు పెట్టి రంగులేయడం కాదు ముగ్గంటే నలుగురు మనుషులను కూడగట్టడం వాకిళ్లు చిమ్మి కళ్ళాపి చల్లే పనిమనుషుల సందడి పేడకళ్ళకోసం వీధుల్లో పోటీపడి తిరిగే అమ్మలక్కలు రాతి ముగ్గుపిండి రతనాల పిండి మల్లెపువ్వంటి పిండి సమయానికి తగుమాటలల్లి

ముగ్గంటే Read More »

ఉత్సవం

ఈ వారం “సృజన క్రాంతి” సాహితీ పేజీలో నా కవిత “ఉత్సవం” చదవండి. శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారికి ధన్యవాదాలు. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి చలి జూలు విదిలించి కొట్టే ఓ ప్రభాతంలో ఉన్ని చొక్కానో, శాలువాతోనో రహదారుల్లో ఆగని ఉదయపు నడకలు.. వెచ్చని నెగళ్ళ కోసం వెతుకులాటలు ఇరానీ హోటల్లో పొగలు కక్కుతున్న గరం గరం చాయ్ తేనేటి కోసం తేనెటీగల్లా బారులు తీరిన జనం.. నిమ్మ, నారింజ, జామ, సీతాఫలాలు సీజనల్

ఉత్సవం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 31 – హేమంత సీమంతోత్సవం

“హేమంత సీమంతోత్సవం” ఈనాటి విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి. మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు హేమంత మాసం. చిరు చీకట్లు, సోమరిగా వీచే చల్ల గాలులు, చలిమంటలు, ఉషోదయ తుషార జల్లులు, ఇరానీ చాయ్ పొగలు, కంబళ్ళు, శాలువాలు కప్పుకుని ఉదయపు నడకలు, సుదీర్ఘమైన చీకటి రాత్రులు. “హేమంతం కృషీవలుల సీమంతం” అంటాడు ఓ కవి. “ప్రియురాలి కౌగిలిలో నెగళ్లు రగిలించి వెచ్చగా చలి కాచుకునే కాలం”

విమల సాహితి ఎడిటోరియల్ 31 – హేమంత సీమంతోత్సవం Read More »

విద్యయా అమృతమశ్నుతే

ఈ రోజు నవ తెలంగాణ “సోపతి”లో ప్రచురితమైన నా కథ “విద్యయా అమృతమశ్నుతే” తో ఈ సంవత్సరం 2024 నా సాహితీ పయనానికి శ్రీకారం చుట్టబడింది. నవ తెలంగాణ సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹 దిగ్గున లేచికూర్చున్నాడు ప్రణీత్. చుట్టూ చిమ్మ చీకటి. గదిలో సన్నటి బెడ్ లాంప్ వెలుతురుకు అలవాటుపడ్డాయి ప్రణీత్ కళ్ళు. పక్క మంచాలమీద పడుకున్న అతని రూంమేట్స్ దుప్పటి ముసుగేసి గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. అతన్ని మాత్రం నిద్రాదేవి

విద్యయా అమృతమశ్నుతే Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 30 – ఉడుకు నెత్తురు – ఉక్కు నరాలు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయం “ఉడుకు నెత్తురు – ఉక్కు నరాలు”. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు జరుపుకుని అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి. రెక్క విప్పుకున్న గువ్వ పిట్టని ఎగరనీయకుండా ఆపడం ఎవరికైనా సాధ్యమా..? అదేవిధంగా కాలాన్ని ముందుకుపోనీకుండా ఆపడం, సూర్యుడి తేజస్సుకి అరచేయి అడ్డుపెట్టి ఆపడం కూడా ఎవరితం కాదు. అందుకే అంటారు ధనం, గొప్ప పేర్ల కంటే విలువైనది కాలం.

విమల సాహితి ఎడిటోరియల్ 30 – ఉడుకు నెత్తురు – ఉక్కు నరాలు Read More »

నేల తల్లి

మిత్రులకు నమస్కారాలు. 2021 సంవత్సరంలో నా మొదటి కవిత ” సృజనప్రియ” మాసపత్రిక జనవరి సంచికలో. తన బిడ్డ [రైతు] కోసం ఓ అమ్మ [సాగు నేల] పడే ఆవేదనే ఈ కవిత “నేల తల్లి “. నువ్వు కవిత రాయాల్సిందే అంటూ ప్రోత్సహించిన “సృజనప్రియ” సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారికి ధన్యవాదాలతో… సాగునేలను అన్నం పెట్టే తల్లిలా ఆరాధించి, తన ఒంట్లో శక్తి ఉడిగిపోయేదాకా నేలతల్లి మీద ఆధారపడ్డ మా నాయన కవితే

నేల తల్లి Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 29 – కొత్త రెక్కలు – నింగి అంచులు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం. ఫేస్ బుక్ మిత్రులందరికీ, విమల సాహితీ పత్రిక పాఠకులకు, నా ప్రియ సహ సంపాదకులకు నూతన సంవత్సర(2024) శుభాకాంక్షలు విమల సాహితీ పత్రికలో సంపాదకీయం రాసే గొప్ప అవకాశం నాకు కల్పించిన డా.జెల్ది విద్యాధర రావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలుసంపాదకీయం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఆహా..! కాలం బహు చిత్రమైంది. చాల టక్కరిది. పోయిన జనవరి మొదటి తారీఖున కూడా కొత్త సంవత్సరం

విమల సాహితి ఎడిటోరియల్ 29 – కొత్త రెక్కలు – నింగి అంచులు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 28 – నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు

“నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు” ఈ వారం విమల సాహితీ సంపాదకీయ వ్యాసం చదివి, మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. మిత్రులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు “ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా నా వద్దకు రండి. నేను మీకు స్వస్థతను కలుగచేతును” అద్భుతమైన ఈ వాక్య సంపదను చూసారా..? ఇది సరిగ్గా నా కొరకే చెప్పబడింది అని ప్రతిఒక్కరికీ అనిపిస్తోంది కదా. నిత్య జీవితంలో మానవులు ఎన్ని రకాలుగా కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు.

విమల సాహితి ఎడిటోరియల్ 28 – నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు Read More »