సూసైడ్ నోట్
శుభోదయం. ఈ రోజు నవతెలంగాణ దినపత్రిక దర్వాజా పేజీ లో నా కవిత “సూసైడ్ నోట్” మెల్లగా పాకుతోందదిదాని స్పర్శ ఒంటికి తగిలినప్పుడల్లాజుగుప్సాకర జలదరింపుఎదిగీ ఎదగని నా ఎదనుదాని ఇనుప చేతులు నొక్కినప్పుడల్లాచురకత్తితో నా గుండెను చీల్చుతున్నంత బాధదాని మదపు వేళ్ళునా తొడమీద పాకుతుంటేవారించలేని నా నిస్సహాయతనిచంపేయాలన్నంత కసి నాలోతరతరాలుగా మా ఒంటిమీద దాని మృగపు వేళ్ళుపాకుతూనే ఉన్నాయి కామపు కుళ్ళుతో..మదపురసి కారుతున్న దాని వికృతపు వేళ్ళనునరికే శక్తి నా బాల్యానికి లేదుఆత్మాభిమానం, అధైర్యంనా గొంతు నొక్కేశాయి […]