కవితలు

ధీమా

ప్రేమికుల దినోత్సవం రోజున ఈ వారం సృజన క్రాంతి పత్రికలో నా కవిత “ధీమా”. మిత్రులందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అతను పిజ్జా డెలివరీ బాయ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలసటతో ఇంటికొచ్చిన నాకు వంటింట్లో అడుగుపెడితే నీరసం అతను గుర్తుకు వస్తాడు ఆ క్షణం క్షణాల్లో ప్రత్యక్షం అవుతాడు పిజ్జాతో వెళుతూ వెళుతూ కాసిన్ని నవ్వులను పిజ్జా తో పాటు డెలివరీ చేసిపోతాడు నవ్వులన్నీ ఏరి మూటగట్టుకున్న నాకు నా వలపు పిలుపు ఎక్కడుందో తెలిసింది […]

ధీమా Read More »

తలలు – మొండాలు

ఈ వారం నవతెలంగాణ సోపతిలో నేను రాసిన కవిత “తలలు-మొండాలు”. సోపతి సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి మమ్మల్నిన్కా పూలతో తీగలతో పోల్చకండి మా ఒంపుసొంపుల్ని మీ కావ్యకపటాల్లోకి నెట్టకండి త్యాగాలు మీ వంతు అంటూ ఆంక్షలు విధించకండి.. మా వేదనలను వినే సమయం మీకులేదు మా సమయాలను మాత్రం మీకోసం లాక్కోకండి.. ప్రేమ దోమ అంటూ మా వెనుక పడకండి ప్రేమికుల రోజంటూ పూలబొకేలు ఇవ్వకండి.. మీ మాయలోపడి

తలలు – మొండాలు Read More »

ముగ్గంటే

పండుగ అయిపోయినా జ్ఞాపకాలు గుండెల నిండా ఉంటాయి. నేటి నిజం పత్రికలో నా కవిత “ముగ్గంటే”. బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 17-2-2024 మా పెళ్ళి రోజు సందర్భంగా ఆశీస్సులు అందించిన మిత్రులందరికీ ప్రేమాత్మకమైన ధన్యవాదాలు వాకిట్లో నాలుగు చుక్కలు పెట్టి రంగులేయడం కాదు ముగ్గంటే నలుగురు మనుషులను కూడగట్టడం వాకిళ్లు చిమ్మి కళ్ళాపి చల్లే పనిమనుషుల సందడి పేడకళ్ళకోసం వీధుల్లో పోటీపడి తిరిగే అమ్మలక్కలు రాతి ముగ్గుపిండి రతనాల పిండి మల్లెపువ్వంటి పిండి సమయానికి తగుమాటలల్లి

ముగ్గంటే Read More »

ఉత్సవం

ఈ వారం “సృజన క్రాంతి” సాహితీ పేజీలో నా కవిత “ఉత్సవం” చదవండి. శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారికి ధన్యవాదాలు. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి చలి జూలు విదిలించి కొట్టే ఓ ప్రభాతంలో ఉన్ని చొక్కానో, శాలువాతోనో రహదారుల్లో ఆగని ఉదయపు నడకలు.. వెచ్చని నెగళ్ళ కోసం వెతుకులాటలు ఇరానీ హోటల్లో పొగలు కక్కుతున్న గరం గరం చాయ్ తేనేటి కోసం తేనెటీగల్లా బారులు తీరిన జనం.. నిమ్మ, నారింజ, జామ, సీతాఫలాలు సీజనల్

ఉత్సవం Read More »

నేల తల్లి

మిత్రులకు నమస్కారాలు. 2021 సంవత్సరంలో నా మొదటి కవిత ” సృజనప్రియ” మాసపత్రిక జనవరి సంచికలో. తన బిడ్డ [రైతు] కోసం ఓ అమ్మ [సాగు నేల] పడే ఆవేదనే ఈ కవిత “నేల తల్లి “. నువ్వు కవిత రాయాల్సిందే అంటూ ప్రోత్సహించిన “సృజనప్రియ” సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారికి ధన్యవాదాలతో… సాగునేలను అన్నం పెట్టే తల్లిలా ఆరాధించి, తన ఒంట్లో శక్తి ఉడిగిపోయేదాకా నేలతల్లి మీద ఆధారపడ్డ మా నాయన కవితే

నేల తల్లి Read More »

సినాప్సెస్

“బహుళ” పత్రిక ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికలో నా కవిత “సినాప్సెస్”. జ్వలిత మేడం కి ధన్యవాదాలతో. చిన్న కవిత చదవండి. బాధతో వ్రాసిన కవిత. అభినందనలు కాదు మీ అభిప్రాయం తెలుపండి నీ జన్మస్థానం ఎక్కడో ఎరుకైననాడు విశ్వపుత్రుడవవుతావు నువ్వు ఆకులలమలతో ఒంటిని కప్పుకున్న రాతిగుహల నుంచి బయటపడి చాల కాలమైంది నువ్వు కాళ్ళు చేతులు చెవులు కళ్ళు లాంటి రెండు సాధారణ అవయవాలే మా దేహాల్లో ఇమిడి ఉన్న రెండు రొమ్ములు ఎదురుపడిన స్త్రీ

సినాప్సెస్ Read More »

చంద్రకాంత చెలి

సాయంత్రమైందని చంద్రకాంత చెంత చేరానుచెక్కిలి ఆనించి ఓ నవ్వు నవ్వానా.. సాయంత్రమైందని చంద్రకాంత చెంత చేరాను చెక్కిలి ఆనించి ఓ నవ్వు నవ్వానా.. మరింత పక్కున నవ్వాయి చంద్రకాంత పూలు రేపొద్దునకి వాడిపోతారు అంత నవ్వెందుకు అని ఉడుక్కున్న నాకు ఊసులెన్నో చెప్పాయవి.. అరపూటే మా జీవితం అయితే ఏంటంట మీలా కాదు మేము అంటూ గర్వంగా తలలూపాయి.. మీ మనుషులకే కదా బాధలు వేదనలు బంధాలు బంధనాలు వేతలు వేధింపులు.. విద్వేషపు కొట్లాటలు మోసపూరిత దుర్మార్గాలు

చంద్రకాంత చెలి Read More »

యుద్ధమే ముద్దు

గణేష్ దిన పత్రికలో ఈ రోజు[29-10-2023] నేను రాసిన కవిత “యుద్ధమే ముద్దు” ప్రచురితమైంది. మిత్రులు చదివి మీ స్పందనను తెలుపండి. యుద్ధం అనివార్యంపోరాటం జరగాల్సిందేశత్రువుని తుదముట్టించాల్సిందేబాంబర్ల మోతతో చెవులు తూట్లు పడుతున్నాయుద్ధ ట్యాంకుల శబ్దం గుండెల్లో వణుకుపుట్టిస్తున్నాయుద్ధమే ముద్దు మాకు అంటావా?తెగిన తలలనుంచి ఏరులై పారుతున్న నెత్తురుతల్లి శవం మీద పడి తల్లడిల్లుతున్న శిశువుకూలిపోయిన ఇళ్ళు పొగ చూరిన గోడలుశిధిలాల మధ్యనుంచి వినిపించే ఆర్తనాదంఏవి కదిలించలేవు నిన్నుయుద్ధమే కావాలి నీకుయుద్ధ విజేతల సమాధులు చెప్పే కథలు

యుద్ధమే ముద్దు Read More »

ప్రొజెక్షన్

స్త్రీ ల ఆహార్యం గురించి Facebook వాల్స్ దగ్గర అనుచిత కామెంట్స్ చేసే మేక వన్నె కాదు కాదు నీతివన్నె కాముకుల పట్ల నిరసన, జుగుప్సలతో రాసిన కవిత ఇది. ఈ నెల సాహిత్య ప్రస్థానం లో.. మేము పంజరాలు బద్దలుకొట్టిబయటపడి చాల కాలమైందిమళ్ళీ కొత్తగా నీ ఆదిపత్యం ఏందిదేవత మహా ఇల్లాలు మహా పతివ్రతాబిరుదులిచ్చి వేసిన సంకెళ్లు చాలు ఇకమా నవ్వులమీద మా తిండి మీదమా బతుకులమీద నీ మనువు ముసుగుఎంతకాలం వేసుకోమంటావుపొడుగు పొట్టి లావు

ప్రొజెక్షన్ Read More »