అనాహత
ఈనాటి సాక్షి పత్రిక ఆదివారం అనుబంధం ఫండే లో నా కవిత “అనాహత” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. పిట్టల పాటలు – సెలయేటి గలగలలుతుమ్మెదల ఝంకారం చిరుగాలి సవ్వడిఉహు..ఏ శబ్దం వినిపించడంలేదుఎవరినీ ఏ అలికిడి కదిలించడం లేదుకళ్ళముందు కదిలేవి లోపల తాకడంలేదు..మనసు మూలల్లోఎప్పటెప్పటివో నిశ్శబ్దపు శబ్దాలుతెరలుతెరలుగా పొరలుపొరలుగాఅతుక్కుంటూ ఊడిపోతూగెలుస్తూ ఓడిపోతూ..తడి కళ్ళతో నవ్వినట్లోచెమ్మగిల్లిన గుండెను తడిమినట్లోప్రేమో ద్వేషమో తెలిసేదెట్టా..?ఎన్నేళ్ళనుంచో చప్పుడు చేయని శబ్దాలునిశ్శబ్దంగా చుట్టూ చేరి అనుక్షణంధ్వనితరంగాలై దేహం నిండా ప్రవహిస్తుంటేఇంద్రియాలను స్పర్శించేవిమనో వేదికను […]